'పాక్ లో ఆ అమ్మాయితో మాట్లాడండి' | Sakshi
Sakshi News home page

'పాక్ లో ఆ అమ్మాయితో మాట్లాడండి'

Published Tue, Aug 4 2015 11:23 AM

'పాక్ లో ఆ అమ్మాయితో మాట్లాడండి'

న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో పొరపాటున పాకిస్థాన్‌కు వెళ్లి దశాబ్దకాలంగా అక్కడే నివసిస్తున్న అమ్మాయి గీతను కలసి మాట్లాడాల్సిందిగా పాక్‌లో భారత హైకమిషనర్‌ను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సూచించారు.

దాదాపు ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు లాహోర్ రైల్వేస్టేషన్‌లో ఎటువెళ్లాలో తెలీక తిరుగుతున్న మాట్లాడలేని అమ్మాయిని పంజాబ్ రేంజర్స్ సైనికులు చేరదీసి కరాచీలోని ఓ ఫౌండేషన్‌కు అప్పజెప్పిన ఉదంతం తాజాగా సామాజిక వెబ్‌సైట్లలో విస్తతమైన సంగతి తెలిసిందే.

సామాజిక కార్యకర్త అన్సార్ బర్మీ ట్వీట్‌కు స్పందించి, పాక్ హైకమిషనర్ టీసీఏ రాఘవన్‌ను కరాచీకి వెళ్లి గీతతో మాట్లాడి వివరాలు సేకరించి ఆమె కుటుంబం జాడను కనుక్కోండని కోరినట్లు సుష్మా ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో సుష్మాస్వరాజ్ చొరవకు అన్సార్ కతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement