శంషాబాద్ విమానాశ్రయానికి స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయానికి స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు

Published Mon, Dec 16 2013 1:03 AM

శంషాబాద్ విమానాశ్రయానికి స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన గౌరవం దక్కింది. విమానాశ్రయంలో ఆరోగ్య సంరక్షణ, భద్రత చర్యలను సమర్థంగా అమలు చేసినందుకుగాను బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుంచి స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు లభించింది. ఒక ఎయిర్‌పోర్టుకు ఈ అవార్డు రావడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఇటీవల లండన్‌లో జరిగిన కార్యక్రమంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిషోర్ ఈ అవార్డును స్వీకరించారు.
 

Advertisement
Advertisement