టాటా మోటార్స్‌ నికర లాభాలు ఢమాల్‌! | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌ నికర లాభాలు ఢమాల్‌!

Published Tue, Feb 14 2017 3:27 PM

టాటా మోటార్స్‌ నికర లాభాలు ఢమాల్‌!

ముంబై:  ప్రముఖ కార్ల దిగ్గజం టాటా మోటార్స్‌  క్యూ3 లో  నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది.  మంగళవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేపోయింది.  గత ఏడాది రూ.2,953 కోట్ల లాభాలతో  పోలిస్తే  ఈ క్వార్టర్‌ లో96 శాతం క్షీణించి రూ.112 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.  మొత్తం ఆదాయం కూడా 4 శాతం క్షీణించి రూ. 68,541కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే  క్వార్టర్‌ లోరూ.71,616కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.  అటు ఈ ఫలితాల నేపథ్యంలో టాటా మెటార్స్‌  కౌంటర్‌ లో అమ్మకాల వెల్లువ  కొనసాగింది. టాటా మెటార్స్‌  షేర్‌ 8శాతానికిపైగా, డీవీఆర్‌ షేర్‌ 4 శాతం క్షీణించాయి. డీమానిటైజేషన్‌  కారణంగా కంపెనీ భారీ నష్టాలను మూటగట్టుకుంది.

నిర్వహణ లాభం(ఇబిటా) 42 శాతం దిగజారి రూ. 5,161 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 12.5 శాతం నుంచి 7.6 శాతానికి బలహీనపడ్డాయి. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర నష్టం రూ. 147 కోట్ల నుంచి రూ. 1036 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం మాత్రం 1.5 శాతం పుంజుకుని రూ. 11,222 కోట్లయ్యింది.

ఫారిన్‌  ఎక్సేంజ్‌ నష్టం  భారీగా ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు.    అలాగే బ్రెగ్సిట్‌ ఉదంతంతో ముఖ‍్యంగా జెఎల్‌ఆర్‌ నిరుత్సాహకర  అమ్మకాలు టాటా  మోటార్స్‌ ఫలితాలను బాగా దెబ్బతీసింది.   జాగ్వార్‌  రేంజ్‌ రోవర్‌ 10 శాతానికి దిగువడం పడిపోవడం మార్కెట్‌  వర్గాలను సైతం విస్మయపర్చింది.

 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement