ఆర్థికసంఘం నివేదికలో ఎక్కడుందో చూపించండి | Sakshi
Sakshi News home page

ఆర్థికసంఘం నివేదికలో ఎక్కడుందో చూపించండి

Published Mon, Aug 10 2015 2:47 PM

ఆర్థికసంఘం నివేదికలో ఎక్కడుందో చూపించండి - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అసలు చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన ఏమన్నారంటే...

  • కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది.
  • విభజన చట్టంలో అనేక అంశాలున్నాయి.
  • అయినా.. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ఒక్క అంశంపై అయినా కేంద్రంతో పోరాడారా, కేంద్రాన్ని అడిగారా
  • ఒకే ఒక్క అంశం.. అదీ సెక్షన్ 8 గురించి మాట్లాడారు
  • ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఇలా చేశారు
  • అది తప్ప ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు.
  • ఆయనతో పాటు టీడీపీ ఎంపీలు ఎవరికీ చిత్తశుద్ధి లేదు
  • మేం వెల్ లోకి వెళ్లి, స్లోగన్లు ఇచ్చినప్పుడు వాళ్లు కలిసి రారు, నిరసన తెలపరు
  • పైగా అడుగుతున్నందుకు మామీద వాళ్లకు కడుపు మంట, మమ్మల్ని విమర్శిస్తారు
  • ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ రెండూ కలిసి ప్రచారం చేసినప్పుడు కచ్చితంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఆదుకుంటాం అన్నారు
  • పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం ఇచ్చారు
  • ఈరోజు ఏరు దాటాక తెప్ప తగలబెట్టడం అంటే ఇది కాదా అని టీడీపీ, బీజేపీలను అడుగుతున్నా
  • చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ
  • ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడతారు. సుజనా చౌదరి ఒకరోజు ఇస్తామంటారు, ఒకరోజు ఇవ్వమంటారు
  • 14వ ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెప్పింది కాబట్టి ఇవ్వట్లేదంటారు
  • అసలు ఆ కమిషన్ నివేదికలో ఒక్కచోటైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని రాసి ఉంటే చూపించండి
  • దాని బూచి చూపించి హోదా ఇవ్వకపోవడం అన్యాయం.
  • ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని అన్నప్పుడు.. వెంకయ్య లాంటి వాళ్లు సభలో ఐదు కాదు పదేళ్లు ఇవ్వాలని గట్టిగా అన్నారు
  • ఇప్పుడు వాళ్లు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి
  • హోదా ఇచ్చేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద గట్టిగా పోరాడదామని విజ్ఞప్తి చేస్తున్నా.

Advertisement

తప్పక చదవండి

Advertisement