దిగ్విజయ్తో తెలంగాణ మంత్రుల మంతనాలు | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్తో తెలంగాణ మంత్రుల మంతనాలు

Published Mon, Feb 3 2014 12:43 PM

దిగ్విజయ్తో తెలంగాణ మంత్రుల మంతనాలు - Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ను సోమవారం తెలంగాణ ప్రాంత మంత్రులు కలిశారు. తెలంగాణ బిల్లుపై వారు ఈ బేటీలో చర్చించారు.  ఇక రాష్ట్ర సచివాలయం నుంచి తెలంగాణ బిల్లు, బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం హస్తినకు చేరింది. ఈ నెల ఐదు నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు.

కాగా అంతకు ముందు మంత్రి డీకె అరుణ ఢిల్లీ విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ జీవోఎంను కలిసేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. తమ ప్రాంత సమస్యలను మరోమారు జీవోఎం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె తెలిపారు.  మరో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం కావడం తథ్యమన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ ప్రాంత సమస్యలు జీవోం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. పార్లమెంటులో టీబిల్లు పాస్‌ అయ్యేలా కృషి చేయాలని  అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement