తెలుగు అంటేనే తెలంగాణ భాష | Sakshi
Sakshi News home page

తెలుగు అంటేనే తెలంగాణ భాష

Published Thu, Sep 10 2015 2:19 AM

తెలుగు అంటేనే తెలంగాణ భాష - Sakshi

- డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్:
తెలుగు అంటేనే తెలంగాణ భాష అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భాష పరంగా తెలంగాణ వివక్ష ఎదుర్కొందని, భాష, యాసను కాపాడుకోవాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణ భాష, నుడికారానికి కాళోజీ నిలువెత్తు రూపంగా నిలిచారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాషపై మక్కువ ఎక్కువని సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి, కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. భాషా పండితులకు పదోన్నతుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని దేశపతి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలంగాణ భాష శ్వాసగా కాళోజీ సాహితీ సేద్యం చేశారని కవి నందిని సిద్ధారెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో టీఎన్‌జీఓ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement