స్కాం చేసి గర్ల్‌ఫ్రెండ్‌కు ఆడికారు: షాగీ అరెస్టు!! | Sakshi
Sakshi News home page

స్కాం చేసి గర్ల్‌ఫ్రెండ్‌కు ఆడికారు: షాగీ అరెస్టు!!

Published Sat, Apr 8 2017 4:14 PM

స్కాం చేసి గర్ల్‌ఫ్రెండ్‌కు ఆడికారు: షాగీ అరెస్టు!! - Sakshi

అమెరికాలోని పన్ను ఎగవేతదారుల నుంచి రూ. 500 కోట్లు (300 మిలియన్‌ డాలర్లు) కొల్లగొట్టిన మహారాష్ట్ర థానె యువకుడు సాగర్‌ ఠక్కర్‌ అలియాస్‌ షాగీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాది ఈ స్కాం వెలుగుచూసిన నాటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షాగీని శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో తలదాచుకున్న అతన్ని జాడ గుర్తించి..డిపోర్టేషన్‌ ముంబై ఎయిర్‌పోర్టుకు తరలించగా.. అక్కడికి వచ్చిన వెంటనే థానె కమిషనరేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని థానె తరలించి  విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.

2013లో థానెకు చెందిన కనీసం డజను కాల్ సెంటర్లు.. అమెరికాలోని 15వేలమంది పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకొని ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ కాల్‌ సెంటర్‌ కుంభకోణానికి తెరలేపాయి. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన డబ్బులో రూ. రెండుకోట్లు పెట్టి షాగీ తన గర్ల్‌ఫ్రెండుకు ఆడి కారును బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చాడు.

అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలుచేయడం అప్పట్లో కలకలం రేపింది. థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement