దీన్ని ఎక్కాలంటే దమ్ముండాల్సిందే.. | Sakshi
Sakshi News home page

దీన్ని ఎక్కాలంటే దమ్ముండాల్సిందే..

Published Sat, Jun 21 2014 1:13 AM

దీన్ని ఎక్కాలంటే దమ్ముండాల్సిందే..

మీరెప్పుడైనా రోలర్ కోస్టర్ ఎక్కారా? గాలిలో రౌండ్లు తిరుగుతూ సర్రున దూసుకుపోయే సాధారణ రోలర్ కోస్టర్ అంటేనే   చాలామంది భయపడతారు. మరి ప్రపంచంలోనే అత్యంత పొడవైన, వేగవంతమైన, ఎక్కువ మలుపులు, వంపులు ఉన్న రోలర్ కోస్టర్ ఎక్కాలంటే ఎంత ధైర్యం కావాలి? అలాంటి గుండె ధైర్యం ఉన్నవారికోసమే అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ‘సిక్స్ ఫ్లాగ్స్’ అనే సంస్థ గోలియత్ అనే ఈ రోలర్ కోస్టర్‌ను ఏర్పాటుచేసింది. కలపతో రూపొందించిన ఈ కోస్టర్.. గురువారమే ప్రారంభమైంది. మలుపులు, వంపుల్లో కూడా గంటకు 72 మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. అంతేకాదు.. పైనుంచి నిట్టనిలువుగా కిందకు అమాం తంగా దిగిపోతుంది. కేవలం 75 సెకన్లలోనే ఓ రౌం డ్ కొట్టేస్తుంది. దీనిపై తొలిసారిగా రైడ్ కొట్టినవారిలో జాన్ ముర్మన్ అనే 88 ఏళ్ల వ్యక్తి కూడా ఉండటం విశేషం.
 

Advertisement
Advertisement