ఎనిమిదేళ్ళకు.. ఖరీదైన విడాకులు! | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ళకు.. ఖరీదైన విడాకులు!

Published Fri, Oct 23 2015 7:51 AM

ఎనిమిదేళ్ళకు.. ఖరీదైన విడాకులు!

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అత్యంత ఖరీదైన విడాకులు అమలయ్యాయి. రష్యన్ వ్యాపారవేత్త...బిలియనీర్ ఢిమిత్రీ  రిబోలోవ్ లేవ్.. భార్య నుంచి సుమారు  5.5 బిలియన్ యూరోలు చెల్లించి కాస్ట్ లీ విడాకుల ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత సంవత్సరంలో భార్య ఎలీనాకు 2.9 బిలియన్ యూరోలు చెల్లించి  విడిపోయేందుకు  డిమిత్రి సిద్ధమయ్యాడు. కానీ తన అప్పీలుకు కోర్టు అంగీకరించకపోవడంతో ఎనిమిదేళ్ళు సాగిన విడాకుల యుద్ధం చివరికి కోర్టు బయట సెటిల్ అయ్యింది.

రష్యన్ బిలియనీర్ డిమిత్రి రిబోలోవ్ లే... అతడి మాజీ భార్య ఎలెనా తమ విడాకులను ప్రకటించారు. చట్టప్రకారం విడాకులు పొందేందుకు కోర్టు చుట్టూ ఎనిమిదేళ్ళ పాటు తిరిగిన ఇద్దరూ..చివరకు కోర్టు బయటే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంత బిలియనీర్ అయినా... భార్య డిమాండ్ ను అమలు చేసేందుకు అతడి ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  గ్రీక్ ద్వీపం, న్యూయార్క్ లో ఉన్న అతడి  ఆస్తులను విక్రయించి మరీ భార్యకు సెటిల్ చేయాల్సి వచ్చింది.

ఏడాది క్రితం స్విస్ కోర్టులో... ఎలెనాకు 2.9 బిలియన్ యూరోలు... అంటే భర్త ఆస్తినుంచీ సుమారు సగానికి పైగా ఇచ్చేందుకు అప్పీలు జరిగింది. అయితే చివరికి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్న...  48 ఏళ్ళు నిండిన ఆ భార్యా భర్తలు అప్పటికే విసిగిపోవడంతో  కోర్టు బయటే ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం... రష్యాకు చెందిన డిమిత్రి... ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలోని 165 మందిలో 14వ స్థానంలో నిలిచారు.

సుమారు 30 సంవత్సరాల క్రితం తన భార్యను డిమిత్రి కలిశాడు. వారిద్దరూ విద్యార్థులుగా ఉన్న సమయంలో ఉరెల్ పర్వత ప్రాంతంలో ఆమెను కలుసుకున్నాడు. పెళ్ళై సుమారు 23 కలిసి జీవించారు.  అయితే ఒకరిపై ఒకరికి అనేక విషయాల్లో పొరపొచ్చాలు రావడంతో విడిపోయేందుకు మొదటిసారి 2008 లో భార్య ఎలీనా కోర్టులో దావా వేసింది. ఎనిమిదేళ్ళ పాటు కోర్టు చుట్టూ విడాకుల కోసం ఇద్దరూ తిరగాల్సి వచ్చింది. ఆస్తుల్లో వాటాల లెక్కలు కోర్టులో  తేలకపోవడంతో అప్పటినుంచీ సమస్యల  వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.  

డిమిత్రి రష్యన్ ఫెర్టిలైజర్ సంస్థ అయిన  జెయింట్ ఉరల్ కలి కి ఛైర్మన్ గా, మెజారిటీ షేర్ హోల్డర్ గా ఉండటానికి ముందు... డాక్టర్ నుంచి ఎంటర్ ప్రెన్యూర్ గానూ, తర్వాత స్టాక్ బ్రోకర్, బ్యాంకర్ గానూ ఎదిగినట్లు అతని భార్య ఎలినా చెప్తోంది. అయితే అంతకు ముందు డిమిత్రి తన పోటీదారు హత్యకేసు ఆరోపణలతో 11  నెలలపాటు జైల్లో గడపాల్సి వచ్చింది. అప్పట్లో అతడితోపాటు ఆమెకూడా జైల్లో ఉండాల్సి వచ్చిందని, అంతేకాక అతడి జీవితం బెదిరింపులతో గడిచేదని, ఓ బుల్లెట్ ప్రూఫ్ షర్ట్ వేసుకొని ఉండాల్సి వచ్చేదని అదే భయం కుటుంబాన్ని స్విట్జర్లాండ్ తరలించడానికి దారి తీసిందని.. తమ విడాకులకు అదే కారణమైందని ఆమె చెప్తోంది.

అయితే అతడు మాత్రం ఆమె చెప్పిన మాటలను అంగీకరించడం లేదు. న్యూ ఇయర్ పెలబ్రేషన్స్ లో ఉండగా వచ్చిన విడాకుల పిటిషన్ ను చూసి తాను ఆశ్చర్యపోయానని, తర్వాత బ్యాంకర్లు తన ఖాతాలను స్తంభింప చేశారని డిమిత్రి చెప్తున్నాడు. ఏది ఏమైనా 23 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా సాగిన వారి కుటుంబ జీవనం... వారికి జీవితాంతం కలిసుండే అవకాశం ఇవ్వలేదు. ఎనిమిదేళ్ళపాటు విడాకుల యుద్ధం అనంతరం చివరికి  కోర్టు బయట ఒప్పందంతో విడిపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement