Sakshi News home page

థెరిసా సలహాదారుల రాజీనామా

Published Sun, Jun 11 2017 3:06 PM

థెరిసా సలహాదారుల రాజీనామా

లండన్‌: బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నిరాశజనక ఫలితానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని థెరిసా మే సన్నిహిత సలహాదారులైన నిక్‌ తిమోతి, ఫియోనా హిల్‌లు శనివారం రాజీనామా చేశారు. బ్రిటన్‌ ప్రధాని కార్యాలయంలో జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా వీరు పనిచేస్తున్నారు.

ముందుస్తు ఎన్నికలకు వెళ్తే కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని థెరిసాను ఒప్పించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. కన్జర్వేటివ్‌ పార్టీ చీఫ్‌గా కొనసాగాలంటే నిక్, ఫియోనాను తప్పించాల్సిందేనని సొంత పార్టీ సభ్యులు అల్టిమేటం నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయని, ఎన్నికల ప్రచారంలో తన ప్రమేయానికి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నానని ఒక ప్రకటనలో నిక్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement