టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Mon, Jul 24 2017 5:31 PM

today news roundup

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సోమవారం కీలక చర్చ జరిగింది. రివైజ్డ్‌ ఎస్టిమేషన్స్‌కు ప్రాజెక్ట్‌ అథారిటీ ఆమోదం ఉందా అని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం ఇంకా తగ్గలేదు. దీనిపై నటి ఛార్మీ స్సందించారు. కొన్ని చానళ్లు రేటింగ్‌లు పెంచుకునేందుకు తనపై తప్పుడు వార్తలు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  మరోవైపు భారత్‌ చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోసారి తన నోటి దురుసును చూపించింది. మాటల దాడిని పెంచింది.



<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

పోలవరంపై రాజ్యసభలో కీలక చర్చ

పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సోమవారం కీలక చర్చ జరిగింది. రివైజ్డ్‌ ఎస్టిమేషన్స్‌కు ప్రాజెక్ట్‌ అథారిటీ ఆమోదం ఉందా అని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

శాంపిల్స్‌ ఎలా తీసుకుంటారు?: ఛార్మీ
కొన్ని చానళ్లు రేటింగ్‌లు పెంచుకునేందుకు తనపై తప్పుడు వార్తలు ఇస్తున్నాయని హీరోయిన్‌ ఛార్మీ పేర్కొన్నారు.

ముద్రగడ ఏమైనా విద్రోహ శక్తా?: బొత్స
చంద్రబాబు నాయుడు పాలన చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందా? లేక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

రోడ్డుపై బ్యాగు.. భారీగా డబ్బు
విజయవాడ బీసెంట్ రోడ్డులో సంఘవి జ్యూలరీ షాపు వద్ద గల్లంతైన నగదు బ్యాగ్ కేసును సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు.

కెల్విన్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు
సిట్‌ విచారణ పద్ధతి ప్రకారం జరగడం లేదని, దర్యాప్తు దారుణంగా సాగుతోందని కెల్విన్‌ తరపు న్యాయవాది ఆరోపించారు.

<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>

'మీ ముందున్న నాకు ప్రాణం పోసింది ఆయనే..'
కీడుచేసిన వాళ్లను మరిచినా పెద్దగా నష్టం లేదు ఎందుకంటే ఆ మరుపు ఔన్నత్యాన్ని చాటుతుంది.

పర్వతాన్ని కదిలిస్తారేమో.. మమ్మల్ని కష్టం: చైనా
చైనా మరోసారి తన నోటి దురుసును చూపించింది. మాటల దాడిని పెంచింది. భారత్‌ తమ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దని, భ్రమల్లో ఉండొద్దంటూ చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్‌ సోమవారం హెచ్చరించారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>

బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదు!
టీమిండియా కోచ్ గా పని చేసి అవమానకర రీతిలో తన పదవికి గుడ్ బై చెప్పిన అనిల్ కుంబ్లేకు తగినంత గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదని సీనియర్ ఆటగాడు గౌతం గంభీర్ పేర్కొన్నాడు.

ఓడినా.. ప్రశంసలు ముంచెత్తాయి..
మహిళా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడినా మిథాలీ సేన పై ప్రశంసల జల్లు కురిస్తోంది. టోర్నీకి ముందు క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ల నుంచి ఫైనల్‌ చేరిన భారత మహిళల పోరాట పటిమకు సగటు భారత అభిమాని ముగ్ధుడయ్యాడు.

సీఎస్‌కే కోసం నా నిరీక్షణ ముగిసింది: ధోని
ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ది సుస్థిర ప్రస్థానం.  మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో రెండేళ్లపాటు జట్టు  నిషేధానికి గురైంది.

ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు
ఒకే ఓవర్ లో ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ రాస్ వైట్లే.

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>

వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్‌
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహన్‌ తాజాగా కలెక్టర్లకు ఘాటు వార్నింగ్‌ ఇచ్చారు.

మాయావతితో తేజస్వీ మంతనాలేమిటీ?
బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బహుజన సమాజ్‌ పార్టీ నాయకురాలు మాయావతిని ఇటీవల కలుసుకొని గంటన్నర సేపు చర్చలు జరిపారు.

బీజేపీపై కత్తిగట్టిన మాయావతి
రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పార్టీపై కత్తిగట్టారు. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

నటికి పెళ్లి హామీ.. మోసం.. ప్రైవేట్‌ ఫొటోలు
ఓ సినీ నటితో సన్నిహితంగా ఉండి ఆమె ప్రైవేట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేసిన ఆరోపణలు కూడా అతడిపై నమోదు చేశారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>

టీసీఎస్‌ను కాపాడండి, ఉద్యోగుల ఆందోళన
లక్నోలోని టీసీఎస్‌ ఆఫీసు మూసివేతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నో ఆఫీసు మూతను వ్యతిరేకిస్తూ ఆ కంపెనీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

కాలేజి విద్యార్థులకు వైఫై ఫ్రీ: జియో
రిలయన్స్‌ జియో మరో కొత్త సంచలనానికి తెరలేపనుందా? తాజా రిపోర్టులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి.

కోల్గేట్‌ కష్టాలు
ఊళ్లలో ఎక్కువ మంది వినియోగించే టూత్‌పేస్ట్‌ ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం కోల్గేట్‌. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్‌లోని మారుమూల గ్రామల్లో సైతం టూత్‌పేస్ట్‌ అంటే కోల్గేట్‌ అనే పేరు పాతుకుపోయింది. అలాంటిది తొలిసారి ఈ కంపెనీ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.

గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌‌: ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్
ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఒక సేల్‌ అనంతరం మరో సేల్‌ నిర్వహిస్తూనే ఉంది. తాజాగా గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది.

10వేల మైలురాయికి కాస్తంత దూరమే..
దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిల్లో ముగిశాయి. 51.15 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ అత్యంత కీలకమైన మైలురాయి 10వేలకు చేరువలో 9,966 వద్ద క్లోజైంది.

Advertisement
Advertisement