నేడు, రేపు విద్యాసంస్థల బంద్ | Sakshi
Sakshi News home page

నేడు, రేపు విద్యాసంస్థల బంద్

Published Thu, Aug 6 2015 1:03 AM

ఓయూలో బంద్ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న పీడీఎస్ యు నాయకులు - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగ సంస్థలు ఎదుర్కొం టున్న సమస్యలతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు, రేపు (6, 7 తేదీలు) రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు ఏబీవీపీ, పీడీఎస్‌యూ (విజృంభణ) వేర్వేరు ప్రకటనలో పిలుపునిచ్చారు.
డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన, అధిక నిధులు, ఫీజు బకాయిల చెల్లింపు వంటి డిమాండ్లతో 6న డిగ్రీ కాలేజీల బంద్ పాటిస్తున్నట్లు ఏబీవీపీ జాతీయ నేత కడియం రాజు తెలిపారు.

కుటుంబానికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, కాంట్రాక్టు, పార్ట్‌టైం, టైంస్కేల్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, ప్రైవేటురంగ సంస్థల్లో ఉద్యోగాల రిజర్వేషన్లు తదితర డిమాండ్లతో 7న విద్యా సంస్థల బంద్ పాటించనున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్రనేతదయాకర్ తెలిపారు.

Advertisement
Advertisement