టాప్ టెక్ దిగ్గజ సీఈవోలకు ట్రంప్ పిలుపు | Sakshi
Sakshi News home page

టాప్ టెక్ దిగ్గజ సీఈవోలకు ట్రంప్ పిలుపు

Published Mon, Dec 12 2016 11:55 AM

టాప్ టెక్ దిగ్గజ సీఈవోలకు ట్రంప్ పిలుపు - Sakshi

టాప్ టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ ఇంక్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాప్ట్, ఇంటెల్, ఒరాకిల్ వంటి కంపెనీల సీఈవోలు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో భేటీ కాబోతున్నారు. బుధవారం న్యూయార్క్ సిటీ, ట్రంప్ టవర్స్లో జరుగబోయే సదస్సుకు ఈ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు ఆహ్వానం అందినట్టు రీకోడ్ రిపోర్టు చేసింది. టెక్ లీడర్లతో ట్రంప్ ఈ భేటీ నిర్వహిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ భేటీలో పాల్గొనబోయే కంపెనీ ఎగ్జిక్యూటివ్లు డజను కంటే తక్కువగానే ఉంటారని తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో దిగ్గజాలుగా ఉన్న కంపెనీ ఎగ్జిక్యూటివ్లు మాత్రమే ఈ భేటీకి వెళ్తున్నాయని రీకోడ్ తెలిపింది.
 
బిలీనియర్, టెస్లా మోటార్స్ ఇంక్ సీఈవో ఎలోన్ మస్క్ కూడా ఈ భేటీకి హాజరుకాబోతున్నారని వాల్స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పేర్కొంది.  నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తోనే తాముంటామని, ఎలాంటి సహాయం కావాలన్నా తమకు సాధ్యమైన రీతిలో సాయం చేయడానికి తోడ్పడతామని సదస్సులో చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సఫ్రా కాట్జ్ ఓ ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపారు.
 
ఒకవేళ ట్రంప్ ట్యాక్స్ కోడ్ను సవరించి, నిబంధనలు సడలించి, మంచి వాణిజ్య ఒప్పందాలను ఏర్పరిస్తే, అమెరికా టెక్నాలజీ కమ్యూనిటీ మరింత బలమైనదిగా రూపాంతరం చెందుతుందని, ముందస్తు కంటే ఇంకా ఎక్కువగా పోటీ వాతావరణం పెరుగుతుందని ఆయన చెప్పారు. అమెజాన్.కామ్ ఇంక్ సీఈవో, వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఈ మీటింగ్కు ఆహ్వానం అందిందని, ఆయన కూడా హాజరుకానున్నారని రీకోడ్ చెప్పింది. ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్లు వెంటనే ఈ విషయంపై స్పందించ లేదు.
 
ఇంటెల్, మైక్రోసాప్ట్ అధికార ప్రతినిధులైతే ఈ విషయంపై మాట్లాడటానికే నిరాకరించారు. వలస విధానంలో సవరణలు నుంచి సామాజిక ఆందోళనలు వరకు అన్నీ విషయాలను ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలను వ్యతిరేకించే వారు తమ అభిప్రాయాలను తెలుపనున్నారు. అయితే ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్, నెట్ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్, సేల్ఫోర్స్ సీఈవో మార్క్ బెనిఒఫ్ఫ్, డ్రాప్బాక్స్ సీఈవో డ్రూ హోస్టన్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేలు ఈ సదస్సుకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement