'మహిళలు బహిరంగంగా నవ్వొద్దు' | Sakshi
Sakshi News home page

'మహిళలు బహిరంగంగా నవ్వొద్దు'

Published Tue, Aug 5 2014 11:45 PM

Turkish Women File Lawsuit Over 'No Laugh' Remark

ఇస్తాంబుల్: మహిళలు బహిరంగంగా పెద్దగా నవ్వొద్దంటూ వ్యాఖ్యలు చేసిన టర్కీ ఉపప్రధాని బులెంట్ ఆరింక్ పై మహిళా హక్కుల నాయకురాలు, చట్టసభ ప్రతినిధి ఐలిన్ నజ్లిలియకా దావా వేశారు. ఇస్తాంబుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఉపప్రధాని ఆరింక్ లింగ వివక్షకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలు బహిరంగంగా నవ్వితే వేధింపులకు లక్ష్యంగా మారతారని ఆరింక్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై టర్కీ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నవ్వుతూ ఉన్న ఫోటోలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement
Advertisement