డ్రగ్స్ రవాణా కేసులో ఆఫ్రికన్ యువతులకు శిక్ష | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ రవాణా కేసులో ఆఫ్రికన్ యువతులకు శిక్ష

Published Tue, Jun 10 2014 10:32 PM

two South African women get 1yr jail for trying to export drugs

న్యూఢిల్లీ: డ్రగ్స్ అక్రమ రవాణాకు యత్నిస్తున్న ఇద్దరు ఆఫ్రికన్ యువతులకు ఢిల్లీ కోర్టు మంగళవారం ఏడాది పాటు జైలుశిక్ష విధించింది. వివరాలిలా .. బోత్సవానాకు చెందిన త్యబిజెంగ్ జోసెఫినా, గ్రేస్ బోంగివే అనే యువతులు సుమారు 50 కిలోల బరువున్న నిషేధిత పదార్థాన్ని తమతోపాటు తీసుకువెళుతుండగా ఎన్‌డీపీఎస్ అధికారులు పట్టుకున్నారు. కేసు విచారించిన ఎన్‌డీపీఎస్ ప్రత్యేక జడ్జి అనుగ్రోవర్ బలీజా మాట్లాడుతూ నిందితురాళ్లిద్దరికీ ఏడాది జైలు, రూ.75 వేల జరిమానా విధించారు.

 

Advertisement
Advertisement