రన్వే నుంచి జారిపోయిన విమానం | Sakshi
Sakshi News home page

రన్వే నుంచి జారిపోయిన విమానం

Published Tue, Apr 14 2015 7:50 AM

రన్వే నుంచి జారిపోయిన విమానం - Sakshi

అమెరికాలోని హ్యూస్టన్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్పోర్టులో 173 మందితో వస్తున్న ఓ విమానం రన్వే నుంచి జారిపోయింది. యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం లాస్ వెగాస్ నుంచి వచ్చింది. తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో టెర్మినల్కు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. టాక్సీవే నుంచి మట్టి, గడ్డి ఉన్న ప్రాంతంలోకి విమానం జారిపోయింది. అయితే విమానంలో ఉన్నవాళ్లెవరికీ గాయాలు కాలేదు. అయితే ఈ ఘటన ఫలితంగా రన్వేను కొంతసేపు మూసేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియాల్సి ఉంది.

సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో రన్వే కూడా బాగా తడిగా ఉంది. బాగా కుదుపులతో విమానం ల్యాండ్ అవుతున్నట్లు ప్రయాణికులకు అనిపించింది. తీరాచూస్తే చుట్టూ గడ్డి, మట్టి కనిపించాయి తప్ప.. రన్వే లేదు. రెండు గంటల పాటు విమానంలోనే ఉండిపోయిన తర్వాత.. చివరకు మెట్లద్వారా బయటకు రావాల్సి వచ్చింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదని, ఎటు చూసినా అంతా గడ్డే ఉండటంతో గందరగరోళం నెలకొందని బెన్ డ్లుబాక్ అనే ప్రయాణికుడు చెప్పారు.

Advertisement
Advertisement