అమెరికన్ ఓటర్లు రికార్డు బ్రేక్ చేశారు! | Sakshi
Sakshi News home page

అమెరికన్ ఓటర్లు రికార్డు బ్రేక్ చేశారు!

Published Thu, Oct 20 2016 9:45 AM

అమెరికన్ ఓటర్లు రికార్డు బ్రేక్ చేశారు! - Sakshi

వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో మొదటిసారి అధ్యక్ష ఎన్నికల కోసం రికార్డు స్థాయిలో రిజిస్టర్ ఓటర్లు పెరిగారు. 200 మిలియన్లకు పైగా అమెరికన్లు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు రిజిస్టర్ చేపించుకున్నట్టు డెమొక్రాటిక్ పొలిటికల్ డేటా సంస్థ టార్గెట్స్మార్ట్ తెలిపింది. నేషనల్ రిజిస్ట్రేషన్ ప్రకారం అమెరికా ప్రస్తుతం 200,081,377 మంది రిజిస్ట్రర్ ఓటర్లు కలిగి ఉన్నట్టు టార్గెట్స్మార్ట్ సీఈవో టామ్ బోనియర్ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో దాదాపు 50 మిలియన్కు పైగా కొత్త రిజిస్ట్రర్ ఓటర్లు పెరిగినట్టు ఈ డేటాలో వెల్లడైనట్టు జిన్హువా ఏజెన్సీ రిపోర్టు చేసింది.
 
ప్రస్తుత అధ్యక్షుడు ఒరాక్ ఒబామా మొదటిసారి వైట్హోస్కు గెలిచినప్పుడు అంటే 2008లో కేవలం 146.3 మిలియన్ రిజిస్ట్రర్ ఓటర్లు మాత్రమే అమెరికా కలిగి ఉంది. డెమొక్రాటిక్కు మద్దతుగా 42.6 శాతం కొత్త ఓటర్లు రిజిస్ట్రర్ చేయించుకోగా, రిపబ్లికన్ పార్టీకి మద్దతు తెలుపుతూ 29 శాతం, స్వతంత్ర అభ్యర్థులకు సపోర్టుగా మరో 28.4శాతం కొత్త ఓటర్లు నమోదైనట్టు టార్గెట్స్మార్ట్ వెల్లడించింది. మొదటిసారి 200 మిలియన్ ఓటర్ల మైలురాయిని చేధించామని బోనియర్ తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది డెమొక్రాటిక్ అభ్యర్థికి మొగ్గుచూపుతున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఈ ఏడాది మొదట్లో ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2016 ఎలక్టోరేట్ ఎక్కువగా జాతి, సాంస్కృతిపరంగా వైవిధ్యభరితంగా సాగనుందని పేర్కొంది.
 
31 శాతం ఓట్లు అల్పసంఖ్యాక వర్గాల నుంచి వస్తాయని ఆ సంస్థ అంచనావేసింది. 2012లో ఆ ఓట్లు 21శాతంగా ఉన్నాయి. అయితే నవంబర్ 8న జరిగే ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతుందా అనేది చెప్పడంలో కొంచెం కష్టతరమైతున్నట్టు పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 2008లో మొదటిసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 131.4 మిలియన్ ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. అదే 2012కి వచ్చేసరికి ఓటర్లు శాతం 129.2 మిలియన్లకు పడిపోయింది. రెండు దశాబ్దాల క్రితం వరకు కనీసం 200 మిలయన్ ఓటింగ్ వయసు జనాభానే అమెరికాలో లేరు. కానీ ప్రస్తుతం రిజిస్ట్రర్ యూజర్లే 200 మిలియన్ గరిష్ట స్థాయికు ఎగబాకారు.  

Advertisement
Advertisement