ఆ ఘటనలు సమాజానికి మాయని మచ్చ:వెంకయ్య | Sakshi
Sakshi News home page

ఆ ఘటనలు సమాజానికి మాయని మచ్చ:వెంకయ్య

Published Fri, Jul 18 2014 5:59 PM

ఆ ఘటనలు సమాజానికి మాయని మచ్చ:వెంకయ్య - Sakshi

హైదరాబాద్: నేటి సమాజంలో మహిళలపై, చిన్నారులపై రోజురోజుకూ శృతిమించుతున్ననేరాలను అరికట్టాలంటే పాలనను మరింత పటిష్టం చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశంలో మహిళలపై, బాలికలపై యధేచ్ఛగా అత్యాచారాలు చోటు చేసుకోవడం  నిజంగా సిగ్గు చేటన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి 'మిడ్-కెరీర్ ట్రైనింగ్' శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయడు మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీలో చోటు చేసుకున్న 'నిర్భయ' తరహా ఘటనలు ప్రతీ రోజూ దేశంలో ఏదో మూలన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.

 

కొన్ని రోజుల క్రితం బెంగళూర్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సమాజానికి మాయని మచ్చని వెంకయ్య తెలిపారు. మహిళలు ప్రజాజీవితంలో స్వేచ్ఛగా మెలగాలంటే పాలనా పరంగా కూడా మార్పు తీసుకురావాలన్నారు.

Advertisement
Advertisement