గర్భిణీ చేతులు వెనక్కి విరిచి.. కిందపడేసి | Sakshi
Sakshi News home page

గర్భిణీ చేతులు వెనక్కి విరిచి.. కిందపడేసి

Published Fri, May 29 2015 6:49 PM

గర్భిణీ చేతులు వెనక్కి విరిచి.. కిందపడేసి - Sakshi

న్యూయార్క్: అమెరికాలో పోలీసుల దుశ్చర్యలకు ఇదొక పరాకాష్ట. ఇప్పటికే నల్లజాతిపై అమెరికా పోలీసులు తీవ్ర వివక్ష చూపిస్తున్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజా చర్య వింటే అది నిజమేనేమో అని కూడా అనిపించక మానదు. ఎనిమిది నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ఓ నల్ల జాతికి చెందిన స్త్రీని నడి రోడ్డుపై పోలీసులు అరెస్టు చేశారు. అది కూడా చేయాల్సిన పద్ధతిలో కాకుండా ఆమెకు డెలివరీ సమయానికి సమస్యలు తలెత్తేలాగా ప్రవర్తించారు. చేతులు వెనుకకు విరిచి కిందపడేసి మరీ ఈచర్యకు పాల్పడ్డారు.

ఆమె పలుమార్లు ఇబ్బంది పడుతూ వారి నుంచి చేతులు విదిల్చిన ఏమాత్రం జాలి చూపించకుండా వెనక్కి విరిచి మరి హ్యాండ్ కప్స్ వేశారు. ఆమెను అరెస్టు చేస్తున్న తీరును పోలీసులే వీడియో తీయడం గమనార్హం. అదంతా కావాలని చేశారా అన్నట్లుగా ఆ వీడియో చూస్తే ఇట్టే బోధపడుతుంది. ఇంతకీ ఆమె చేసిన నేరమేమిటంటే మరో మహిళతో ఆమె గొడవ పడిందట.

Advertisement
Advertisement