Sakshi News home page

మాల్యాపై తీర్పు నేడే..!

Published Thu, Jan 19 2017 9:55 AM

మాల్యాపై  తీర్పు నేడే..! - Sakshi

బెంగళూరు:  వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసులో రుణ రికవరీ ట్రిబ్యునల్ ‌(డీఆర్‌టీ) గురువారం  తీర్పును వెలువరించనుంది.   మాల్యా బ్యాంకులకు  చెల్లించాల్సిన  రూ 9,000 కోట్లను రాబట్టేందుకు  ఎస్బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై  ఇవాళ ఆర్డర్ ను పాస్ చేయనుంది.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసుకు సంబంధించిన బ్యాంకుల మధ్యంతర పిటిషన్ పై  తీర్పును వెలువరించనున్నట్టు  డీఆర్ టీ ప్రిసైడింగ్ అధికారి  కె శ్రీనివాసన్   బుధవారం ప్రకటించారు. దీంతో దాదాపు మూడేళ్ల న్యాయపోరాటానికి తెరపడనుంది.  17బ్యాంకులకు చెందిన ఎస్బీఐ ఆధ్వర్యంలోని  బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ను డిసెంబర్ 1994 నుంచి డీఆర్ టీ విచారిస్తోంది. ఎస్‌బీఐతో సహా 17 బ్యాంకుల వద్ద మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ దాదాపు రూ.9 వేల కోట్ల రుణాలను తీసుకుంది. 

కాగా వాటిని తిరిగి చెల్లించడం లేదని బ్యాంకుల కన్సార్టియం డీఆర్‌టీని ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయిందని ఇటీవల ప్రకటించిన ట్రిబ్యునల్‌ తీర్పును మాత్రం పెండింగ్‌లో ఉంచింది. కాగా మాల్యా గత సంవత్సరం మార్చి 2 న దేశం వదిలి  బ్రిటన్ కు చెక్కేశాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  దాఖలు చేసున కేసులో ముంబై పీఎంఎల్ ఏ కోర్టుగా ఉద్దేశ పూర్వగ ఎగవేతదారుడుగా తేల్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement