కొలువుకు హాస్య గుళిక! | Sakshi
Sakshi News home page

కొలువుకు హాస్య గుళిక!

Published Mon, Sep 2 2013 2:51 AM

Want to land a job? Work on your sense of humour!

న్యూయార్క్: జాబ్ కోసం వెతుకుతున్నారా? ఇంటర్వ్యూల్లో మార్కులు కొట్టేసేందుకు పుస్తకాల మీద పుస్తకాలు తిరగేస్తున్నారా? కాసేపు ఆగండి.. ఇదొక్కటే మీకు ఉద్యోగం తెచ్చిపెట్టదు! కాస్త హాస్య చతురత నేర్చుకోండి. దానికి కాస్త కలివిడితనం జోడించండి. అప్పుడే మీరు కోరుకున్న ఉద్యోగం మీ వద్దకు నడిచివస్తుందని చెబుతోంది అమెరికాకు చెందిన ఓ సంస్థ!
 
 ఒక ఉద్యోగానికి సమాన ప్రతిభ ఉన్న ఇద్దరు అభ్యర్థులు పోటీ పడితే వారిలో.. హాస్య చతురత ఉన్నవారికే జాబ్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుందని కెరీర్ బిల్డర్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనితోపాటు సామాజిక అంశాలపై అవగాహన, శారీరకంగా దృఢంగా ఉండడం, చక్కని దుస్తులు ధరించడం వంటి అంశాలు కూడా ఉద్యోగం తెచ్చిపెడతాయని ఆ సంస్థ తెలిపింది. ఇలాంటి అభ్యర్థులనే తాము ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నట్లు ఇంటర్వ్యూలు నిర్వహించేవారు చెప్పినట్లు వివరించింది. దాదాపు 2 వేల మంది మానవ వనరుల విభాగం(హెచ్‌ఆర్) సిబ్బంది, ఇంటర్వ్యూ బోర్డు సభ్యులతో మాట్లాడిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు కెరీర్ బిల్డర్ పేర్కొంది. అలాగే ఆఫీసుకు ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్లిపోవడం, ఇతరులపై చాడీలు చె ప్పడం వల్ల చాలామంది పదోన్నతులు పొందలేకపోతున్నారని సర్వేలో తేలింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement