కశ్మీర్ ప్రజల హక్కులేవి? | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ప్రజల హక్కులేవి?

Published Fri, Apr 24 2015 1:39 AM

where is kashmir people rights

జకార్తా: భారత అభ్యంతరాలను తోసిరాజని అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ మరోసారి ప్రస్తావించింది. కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయాధికారం ఇప్పటికీ నెరవేరకపోవడం విచారకరమని, అది ఆమోదనీయం కాదని వ్యాఖ్యానించింది. ఇండోనేసియాలోని జకార్తాలో జరుగుతున్న ఆసియాన్-ఆఫ్రికన్ సదస్సులో పాక్ ప్రతినిధిగా పాల్గొన్న సర్తాజ్ అజీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన గురువారం ఈ సదస్సు జరిగింది. అజీజ్ వ్యాఖ్యలపై భారత్ ఇదే సదస్సులో స్పందించింది. కశ్మీర్ ప్రస్తావనను అంతర్జాతీయ వేదికపై లేవనెత్తడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ ప్రతినిధి అనిల్ వెంటనే బదులిచ్చారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement