Sakshi News home page

'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?'

Published Mon, Aug 31 2015 11:59 AM

'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?' - Sakshi

న్యూఢిల్లీ: పర్యాటక స్థలాలు, పార్కులు తదితర ప్రాంతాల్లో జంటగా కనిపించిన ప్రేమికులపై దాడులకు పాల్పడుతూ తమనుతాము సాంస్కృతిక పరిరక్షకులుగా భావించే శ్రీరాం సేనకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులపై తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

గోవా రాష్ట్రంలోకి తన ప్రేవేశాన్ని నిషేధిస్తూ కింది కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీరాం సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా ముతాలిక్ తీరును కోర్టు తప్పుపట్టింది. 'ప్రేమికులపై దాడిచేసే హక్కును మీకు ఎవరిచ్చారు?' అని ప్రశ్నించింది.

గడిచిన జూన్ 2న గోవాలోకి ప్రవేశించరాదంటూ ముంబై కోర్టు శ్రీరామ్ సేన చీఫ్ ముతాలిక్ ను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను కొట్టివేయాల్సిందిగా ముతాలిక్ ఆగస్టులో గోవా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా నిరాశే ఎదురుకావటంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం నాటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ముతాలిక్ ఇక గోవాలో అడుగుపెట్టే అవకాశాలు మృగ్యమైనట్లే.

Advertisement
Advertisement