విప్రో హిట్టా.. ఫట్టా? | Sakshi
Sakshi News home page

విప్రో హిట్టా.. ఫట్టా?

Published Tue, Jul 19 2016 12:37 PM

విప్రో  హిట్టా.. ఫట్టా?

ముంబై: వరుసగా ఐటి దిగ్గజాలు మార్కెట్ వర్గాలను నిరాశ పరుస్తున్న నేపథ్యంలో  సోమవారం  మరో  సాఫ్ట్ వేర్‌ దిగ్గజం విప్రో  ఆర్థిక ఫలితాలు  ప్రకటించనుంది.  2016 ఆర్థిక సంవత్సరానికి  గాను ఏప్రిల్‌ -జూన్‌ మొదటి త్రైమాసికంలో  రూ 13,794 కోట్ల అమ్మకాలతో  రూ 2,181 కోట్ల నికర లాభం ఆర్జించవచ్చని మార్కెట్ వర్గాల అంచనా.  గత సంవత్సరపు చివరి( ప్రీవియస్) క్వార్టర్ లోరూ. 13,741 కోట్ల అమ్మాకలతో రూ. 2,235   నికర లాభాన్ని ఆర్జించింది.  అటు డాలర్ ఆదాయంలో కూడా 2.4  శాతం జంప్ ఉండొచ్చని భావిస్తున్నారు.  మరోవైపు విప్రో  ప్రకటించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గైడెన్స్ పై విశ్లేషకులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఆదాయ వృద్ధి మార్గదర్శకత్వం,  పెద్ద ఒప్పందం విజయాలపై సంస్థ విశ్లేషణ,  రాంప్ అప్ షెడ్యూల్ తదితర అంశాలకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

విప్రో డాలర్  రెవెన్యూ  1,882 మిలియన్ డాలర్లనుంచి 1,926 మిలియన్ల డాలర్ల వరకు పెరగొచ్చని అంచనా. దాదాపు 2.1 ఆదాయ వృద్ధి నమోదు చేయనుందని భావిస్తున్నారు. అయితే అమెరికా మార్కెట్ లో  2016 మొదటి  క్వార్టర్ లో విప్రో  వ్యాపారం కొద్దిగా నెమ్మదించిందని కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో విప్రో చీఫ్ అజీం ప్రేమ్ జీ సోమవారం ప్రకటించారు. రాబోయే ఆరు నెలల్లో  పుంజుకుంటామని తెలిపారు.  స్థూల లాభం లేదా  ఎబిట్టామార్జిన్ (ఆసక్తి,  పన్నులు ముందు ఆదాయాలు)   హెల్త్ ప్లాన్  సర్వీసెస్ ఇంటిగ్రేషన్ , అధిక వీసా ఖర్చులు కారణంగా  మునుపటి త్రైమాసికంతో 20.1 శాతం పోలిస్తే  18.5 శాతంగా  నమోదు కావచ్చని  భావిస్తున్నారు.

 

Advertisement
Advertisement