అమ్మకి అనారోగ్యం: సిటిజన్లకు ఎమర్జెన్సీ వార్నింగ్ | Sakshi
Sakshi News home page

అమ్మకి అనారోగ్యం: సిటిజన్లకు ఎమర్జెన్సీ వార్నింగ్

Published Mon, Dec 5 2016 2:41 PM

అమ్మకి అనారోగ్యం: సిటిజన్లకు ఎమర్జెన్సీ వార్నింగ్ - Sakshi

చెన్నై : అమ్మ జయలలిత ఆరోగ్యం విషమించిందనే వార్తను ఆపోలో వైద్యులు వెల్లడించడంతో ఒక్కసారిగా తమిళనాడులో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కన్సలేట్ తన సిటిజన్లకు అత్యవసర సందేశాన్ని జారీచేసింది. స్థానికంగా నెలకొన్న ఈ పరిస్థితుల్లో అమెరికన్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రతా ప్లాన్స్ను ఎప్పడికప్పుడూ సమీక్షించుకుంటూ ఉండాలని ఆదేశించింది. అమ్మ ఆరోగ్య పరిస్థితుల్లో చెలరేగే ఆందోళనల ప్రాంతాలకు దూరంగా ఉండాలని అమెరికన్లకు సూచించింది. అమెరికన్ సిటిజన్లకు, వీసా దరఖాస్తుదారులకు అందించే సాధారణ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు కూడా ప్రకటించింది.
 
అమ్మ జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో గోపాలపురం ప్రాంతం జెమినీ సర్కిల్లో యూఎస్ కన్సలేట్ జనరల్ ఉంది. దీంతో తమ సేవలను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడులోని టోల్ప్లాజాలు, హైవేలపై భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అపోలో చుట్టుపక్కల ప్రాంతాల షాపులను భద్రతా సిబ్బంది ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. కర్నాటక, చిత్తూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. పెట్రోల్బంక్లు, విద్యాసంస్థలు మూసివేశారు. 

Advertisement
Advertisement