అంతా అండ్రాయిడే | Sakshi
Sakshi News home page

అంతా అండ్రాయిడే

Published Thu, Nov 14 2013 2:11 AM

అంతా అండ్రాయిడే - Sakshi

న్యూయార్క్: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల హవా పెరుగుతోంది. మరో వైపు స్మార్ట్‌ఫోన్‌ల ధరలు దిగొస్తున్నాయి. పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్యాబ్లెట్‌ల మోడళ్లు పెరుగుతున్నాయి. ఈ వివరాలన్నింటినీ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. వివరాలు..., 

  • ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి మొత్తం 21.16 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. వీటిల్లో ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న ఫోన్‌ల సంఖ్య 21.1 కోట్లు. చౌక ధరల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ మొబైల్ ఓఎస్ మార్కెట్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్ వాటా 80 శాతానికి మించిపోయింది.  స్వల్పకాలంలోనే ఆండ్రాయిడ్ ఓఎస్ ఈ ఘనత సాధించింది.
  •  అభివృద్ధి చెందిన దేశాల్లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు సంతృప్తి స్థాయికి చేరినప్పటికీ, మొత్తం మీద స్మార్ట్ ఫోన్ విక్రయాలు 40 శాతం వృద్ధి సాధించాయి.
  •   గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 37 లక్షల విండోస్ ఓఎస్ ఫోన్‌లు విక్రయమయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement