భర్త హత్యకు కుట్ర:భార్యకు యావజ్జీవం | Sakshi
Sakshi News home page

భర్త హత్యకు కుట్ర:భార్యకు యావజ్జీవం

Published Mon, Dec 16 2013 8:00 PM

Woman gets lifer for plotting to kill husband

పశ్చిమ బెంగాల్: భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నిన భార్యకు యావజ్జీవ శిక్ష పడింది. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఈఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రజీబ్ సాహా తుది తీర్పును వెలువరించారు. కన్న కొడుకే ప్రత్యక్ష సాక్షిగా నిలవడంతో లుట్ఫా బీబీ కు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఆయను తీర్పును ప్రకటించారు. పశ్చిమ బెంగాళ్లోని కృష్ణా నగర్ లో నివాసం ముండే జై రామ్-లూఫాలు భార్య భర్తలు. భర్తతో సరిగా పొసగని ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

 

ఈ క్రమంలోనే 2001వ సంవత్సరంలో ఏప్రిల్ 9 వతేదీన భర్త అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. లుట్ఫా బీబీను జై రామ్ సిఖ్ ఆచూకీ కోసం అతని బంధువులు నిలదీసినా సరైనా సమాధానం రాలేదు. అతని ఆచూకీ కోసం బంధువులు చేపట్టిన ప్రయత్నాలు ఫలించకపోగా, అతను హత్య చేయబడ్డట్లు ఆలస్యంగా తెలిసింది. అనంతరం అమీన్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా ఆమె పట్టుబడింది. ఈ విషయంపై ఆమెను నిలదీయగా హత్య కు కుట్ర పన్నానని తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను 2001, మే 27 వతేదీన అరెస్టు చేసి కేసును కోర్టుకు అప్పగించారు.అనంతరం కోర్టు నుంచి బెయిల్ పొంది గత కొన్నేళ్లుగా బయటే ఉంటుంది.

 

ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ కావడంతో.. కన్న కొడుకే కీలక సాక్ష్యంగా నిలిచాడు. తన తండ్రిని హత్యకు తల్లి లూఫానే కారణమని కొడుకు బొప్పా రెహ్మమాన్ జడ్జికి తెలిపాడు. అమీన్ సిఖ్ అనే వ్యక్తి తల్లి లూఫా అక్రమ సంబంధం పెట్టుకునే తండ్రిని హత మార్చిందని తెలిపాడు. అమీన్-లూఫాలు ఇద్దరు కలిసి హత్య కుట్రకు పన్నినట్లు నిర్థారించిన జడ్జి ఆమెకు జీవిత ఖైదును ఖరారు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు అమీన్ సిఖ్ మృతి చెందాడు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement