రేప్ కేసు పెట్టినందుకు కాల్చేశాడు.. | Sakshi
Sakshi News home page

రేప్ కేసు పెట్టినందుకు కాల్చేశాడు..

Published Sat, Sep 12 2015 7:37 PM

Woman shot dead by rape accused

సీతాపూర్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. అత్యాచార కేసు పెట్టిన బాధితురాలిని నిందితుడు కాల్చిచంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గతేడాది 23 ఏళ్ల మహిళ.. ప్రదీప్ అనే యువకుడు తనను అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ దశలో ఉంది. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలయిన ప్రదీప్.. కేసును ఉపసంహరించుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. భర్తతో కలసి బైకుపై వెళ్తున్న మహిళను ప్రదీప్ కాల్చిచంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement