ఇంగ్లీష్ కోసం అమెరికన్ ని కిడ్నాప్ చేయించిన దేశాధ్యక్షుడు? | Sakshi
Sakshi News home page

ఇంగ్లీష్ కోసం అమెరికన్ ని కిడ్నాప్ చేయించిన దేశాధ్యక్షుడు?

Published Sun, Sep 18 2016 10:31 AM

Would North Korea Have Abducted An American In 2004 - To Teach Kim English?

సియోల్: ఒక దేశాధ్యక్షుడు తన పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం అమెరికన్ ను కిడ్నాప్ చేయించాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తర కొరియా మాజీ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ ఈ పని చేసినట్లు అంతర్జాతీయంగా రిపోర్టులు వస్తున్నాయి. తన పిల్లలకు ఇంగ్లీష్ భాషను నేర్పించాలనే కోరికతో చైనా సాయం తీసుకుని బర్మా విహారయాత్రకు వచ్చిన ఓ అమెరికన్ విద్యార్ధిని 2004లో ఇల్ కిడ్నాప్ చేయించినట్లు తెలిసింది.
 
ఇల్ కిడ్నాప్ కు పాల్పడినట్లు వస్తున్న వార్తలు నిజమేనని దక్షిణకొరియా అంటుండగా.. కిడ్నాప్ ఉదంతాన్ని అమెరికా ఖండించింది. సియోల్ కు చెందిన ఆచూకీ లేకుండాపోయిన వారి వివరాల యూనియన్ అధ్యక్షుడు చోయ్ సంగ్ యాంగ్ కిడ్నాపైన యువకుడు ఇప్పటికీ ప్యోంగ్ యాంగ్ లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. అతని అసలు పేరు డేవిడ్ స్నెడన్ (36)కాగా, యూన్ బోంగ్ సో(కొరియన్ పేరు)గా మార్చుకున్నట్లు తెలిపారు. కిమ్ ఉన్ హేయీ అనే యువతిని డేవిడ్ వివాహం చేసుకున్నాడని, అతని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ఇందుకు ఆధారాలు కూడా తన వద్ద ఉన్నట్లు చోయ్ పేర్కొన్నారు.
 
పిల్లలకు(ప్రస్తుత ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్) ఇంగ్లీష్ ను భాషను సాధారణ వ్యక్తితో బోధించడంతో కన్నా.. మాతృభాషగా కలిగిన వ్యక్తితో బోధిస్తే బాగుంటుందని ఇల్ అభిప్రాయపడ్డారని అందుకు స్నెడెన్ ను కిడ్నాప్ చేయించినట్లు రిపోర్టుల్లో ఉంది. దీంతో అధ్యక్షుడి ఆదేశాలతో సైనికులు బ్రింగ్ హామ్ యంగ్ యూనివర్సిటీలో చదువుతున్న స్నెడన్ ను కిడ్నాప్ చేసి ఉత్తరకొరియాకు తీసుకువెళ్లారు. తమ కుమారుడు ఆచూకీ కనిపించకుండాపోవడంతో తండ్రి రాయ్ స్నెడన్ చాలా చోట్ల వెతికిచూశారు. చివరకు చనిపోయి ఉంటాడని భావించి వదిలేశారు. అయితే, నాలుగేళ్ల క్రితం డేవిడ్ స్నెడన్ ప్యోంగ్ యాంగ్ లో ఉన్నట్లు వారికి సమాచారం అందింది. 
 
డేవిడ్ ఆచూకీలేకుండాపోవడంలో ఉత్తర కొరియా పాత్ర ఉందనడంలో అర్ధం లేదని వారు భావించారు. కొద్ది రోజుల తర్వాత చైనాలోని బీజింగ్ లో కనిపించిన డేవిడ్ కొరియన్ మహిళతో కనిపించాడు. తన పిల్లలకు కొరియన్ భాషను నేర్పించాలని ఆమె డేవిడ్ ను కోరింది. దీంతో పాటు డేవిడ్ స్నేహితుడు ఒకరు ఉత్తర కొరియాకు దగ్గరలోని యాంజీ పట్టణంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. స్నేహితుడితో కలిసి డేవిడ్ చైనా నుంచి ఉత్తరకొరియాకు అక్రమంగా తరలివెళ్లే వారి సాయం చేస్తున్నట్లు రిపోర్టులు కూడా వచ్చాయి.కిమ్ జోంగ్ ఇల్ నేతృత్వంలో జపనీయులు, రోమేనియన్లు, లేబనీయులను కిడ్నాప్ చేయించినట్లు పలుమార్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement