అందుబాటులోకి వర్చువల్ వీడియోలు! | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి వర్చువల్ వీడియోలు!

Published Tue, Nov 10 2015 7:22 PM

అందుబాటులోకి వర్చువల్ వీడియోలు!

ఉన్నది ఉన్నట్లుగా... కళ్ళకు కట్టినట్లుగా చూపించే వర్చువల్ రియాలిటీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో గాగుల్స్ లేకుండానే చూసే అవకాశం వచ్చేసింది. కేవలం నెట్ కనెక్షన్ ఉంటే చాలు... నట్టింట్లోనే మీక్కావలసిన ప్రదేశాలను వీక్షించే అవకాశం మీ ముందుకొచ్చింది.  గూగుల్ కాడ్డ్బోర్డ్ హెడ్ సెట్  పెట్టుకొని ఊహాలోకంలో విహరించవచ్చు. సుదూర తీరాల్లోని దృశ్యాలన్నీ కళ్ళముందు సాక్షాత్కరించే అవకాశం ఇప్పుడు యూట్యూబ్ కల్పిస్తోంది. ఇక ఆలస్యమెందుకు ఓ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ కొన్నారంటే చాలు...

ఇండియాలో ప్రస్తుతం ఈ హెడ్ సెట్లు దొరకడం కాస్త కష్టంగానే ఉంది. కాబట్టి ఆన్ లైన్ సైట్ల ను ఆశ్రయించి హెడ్ సెట్ లు కొనుగోలు చేయొచ్చు. గూగుల్ కార్డ్ బోర్డ్ కాకుండా వన్ ఇన్ దిస్ వీడియో వంటి మరెన్నో ఇతర లోకల్ మేడ్ హెడ్ సెట్లు కూడ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్లు మరీ అంత ఖరీదు అని కూడ చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు వందల రూపాయలు మొదలుకొని రెండు వేల రూపాయల వరకూ అందుబాటులో ఉంటున్నాయి. హెడ్ సెట్ ను  ఫోన్ లోని కార్డ్ బోర్డ్ కు ఇన్ స్టాల్ చేసుకొని ఫోన్ ను కార్డ్ బోర్డులో అమర్చుకొన్నారంటే ఇక వర్చువల్ వీడియోలతో ప్రపంచాన్నే చుట్టేయొచ్చు. యూట్యూబ్ లోని డ్రాప్ డౌన్ మెనూ ఎంచుకొని ప్లే లిస్ట్ లోని మీక్కావలసిన వీడియోను చూసి ఎంజాయ్ చేయొచ్చు. కేవలం కంప్యూటర్ ముందో, ఫోన్ లోనో వీడియోలు చూడ్డమే కాక, ఆయా ప్రదేశాలకు వెళ్ళిన సమయంలోనూ అక్కడి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునేందుకు యూట్యూబ్ వీడియోలు వినియోగించుకోవచ్చు.

అయితే సాంకేతిక సంస్థలకు ఈ వీడియోలు ఇప్పుడు పెద్ద సవాలుగా మారాయి. ఇప్పటికే మార్కెట్లో సోనీ, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటి వారంతో చేరిపోతున్నారు. ఫేస్ బుక్ ఇప్పటికే వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్లను ఆక్యులస్ రిఫ్ట్ పేరుతో ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదికల్లా వినియోగదాలకు ఎటువంటి ఇబ్బందులు లేని హెడ్ సెట్లను అందించి మొదటి స్థానంలో ఉండేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపింది. త్రీడీ చిత్రాలు చూడ్డం ఇష్టం లేనివారు కూడ ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రయోజనాన్నిపొందే అవకాశం ఉంది. అంతేకాదు విద్యా ప్రయోజనాలకు కూడ ఈ వర్చువల్ వీడియోలు నీటి అడుగు భాగం, ఆకాశం లోని విశేషాలను కూడ వివరించేందుకు అభివృద్ధి పరిచే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement