వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Published Sun, Jun 4 2017 12:12 PM

వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం - Sakshi

- తుమ్మలగుంటలో అట్టహాసంగా మొదలైన టోర్నీ
- 340 టీమ్‌లు.. భారీ ప్రైజ్‌మనీ
- చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో క్రీడా పండుగ
- ప్రారంభోత్సవానికి హాజరైన పెద్దిరెడ్డి, భూమన, సజ్జల, ధనుంజయ్‌రెడ్డి


తిరుపతి:
గ్రామాల్లోని క్రీడాకారుల క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, పల్లెలమధ్య సత్సంబం ధాలను పెంపొందించేందుకు వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తోన్న వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి-చంద్రగిరి మార్గంలోని తుమ్మలగుంటలోగల వైఎస్సార్‌ క్రీడా మైదానంలో జరుగుతున్న ఈ టోర్నీలో 340 జట్లు పాల్గొంటున్నాయి. ప్రారంభవేడుకలకు చెవిరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ కీలక నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

పార్టీలకు అతీతంగా: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తోన్న ఈ క్రీడా పోటీలకు విశేష ఆదరణ ఉంది. నాకౌ ట్‌ పద్ధతిలో నిర్వహించే ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికీ మెడల్, సర్టిఫికెట్, మెమెంటోలను బహూకస్తారు. ప్రతి జట్టుకు నాణ్యమైన క్రికెట్‌బ్యాట్, బాల్‌ను ఉచితంగా అందించడంతోపాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, చల్లని తాగునీరువంటి సౌకర్యాలను కల్పించారు.

భారీ ప్రైజ్‌ మనీ: తుమ్మలగుంటలోని వైఎస్సార్‌ క్రీడా మైదానంలో ఒకే చోట 10 క్రికెట్‌ గ్రౌండ్‌లను తయారు చేశారు. ఒకేసారి 10 మ్యాచ్‌లు నిర్వహించడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. వీక్షకుల కోసం చలువ పందిళ్లు, భోజనశాల, తాగునీరు క్యాన్ల ను సిద్ధం చేశారు. వైఎస్సార్‌ క్రికెట్‌ టోర్నీ విజేతలకు లక్ష రూపాయల ప్రైజ్‌ మనీని అందజేస్తారు. రన్నరప్‌కు రూ.50 వేలు, మూడో స్థానంలో నిలిచే జట్టుకు రూ.25వేలు బహుమానంగా ఇస్తారు.

Advertisement
Advertisement