'ఒంగోలు గిత్తలను కాపాడండి' | Sakshi
Sakshi News home page

'ఒంగోలు గిత్తలను కాపాడండి'

Published Wed, Apr 22 2015 6:10 PM

లోక్ సభలో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒంగోలు గిత్తలను సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లోక్ సభలో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు.

ఒంగోలు గిత్త బ్రిడ్ ను బ్రెజిల్ కు ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మనదేశంలో ఒంగోలు గిత్తలు వెయ్యి మాత్రమే ఉన్నాయని, అదే బ్రెజిల్ లో వీటి సంఖ్యల్లో ఉందని వెల్లడించారు. మనదేశంలో వీటి సంఖ్య పెంచేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు.

తెలుగువారు పౌరుషానికి ప్రతీకగా భావించే ఒంగోలు జాతి గిత్తలు సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒంగోలు గిత్తలు అంతరించిపోవడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement