భూసార పరిరక్షణపై వీడియో పోటీలు | Sakshi
Sakshi News home page

భూసార పరిరక్షణపై వీడియో పోటీలు

Published Tue, Sep 29 2015 12:12 AM

భూసార పరిరక్షణపై వీడియో పోటీలు - Sakshi

భూసారాన్ని పెంపొందించే సుస్థిర సమగ్ర యాజమాన్య పద్ధతుల అంశంపై ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ  వీడియో పోటీలను నిర్వహిస్తున్నది. భూసారాన్ని పెంపొందించే సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తున్న రైతులు, వ్యక్తులు, వ్యవసాయ సేవల్ని అందించే సంస్థలు, పరిశోధకులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. తాము అనుసరించే భూసార సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని వీడియో తీసి ఎఫ్.ఎ.ఓ.కు పంపవచ్చు. ఉత్తమమైన మూడు వీడియోలకు మూడు వేలు, రెండు వేలు, వెయ్యి డాలర్ల చొప్పున నగదు బహుమతులు ఇస్తారు. వీడియోలు పంపాల్సిన చివరి తేదీ : అక్టోబరు 12. మరిన్ని వివరాలకు.. http://www.fao.org/soils2015/news/newsdetail/en/c/3-2-9-2-90

Advertisement

తప్పక చదవండి

Advertisement