మట్టి ముంతలతో డ్రిప్పు! | Sakshi
Sakshi News home page

మట్టి ముంతలతో డ్రిప్పు!

Published Tue, Apr 26 2016 12:20 AM

మట్టి ముంతలతో డ్రిప్పు!

గోనె సంచులతో షేడ్‌నెట్!!  
 
 ఇంటిపంటలకు వేసవికాలంలో అధిక వేడి, నీటి కొరత రూపంలో పెనుముప్పు పొంచి ఉంటుంది. షేడ్‌నెట్ ద్వారా నీడను కల్పించడం, తమకు తోచిన పద్ధతుల్లో డ్రిప్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వేసవి బెడద నుంచి కొందరు టై ఆర్గానిక్ ఫార్మర్స్ స్వల్ప ఖర్చుతోనే తమ పంటలను కాపాడుకుంటున్నారు.

 ప్లాస్టిక్ బ్యాగులు లేదా ప్లాస్టిక్ డబ్బాలతో ఏర్పాటు చేసుకునే డ్రిప్ కన్నా.. మట్టి ముంతలతో డ్రిప్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అదెలాగంటే.. ముందుగా చిన్న మట్టి ముంతను తీసుకొని అడుగున జాగ్రత్తగా రంధ్రం చేయాలి. సరిపడా కొబ్బరి పీచును తీసుకొని ఈ రంధ్రంలో దూర్చాలి. ఇలా దూర్చిన పీచు ముంత లోపలా.. బయటా కనీసం రెండు అంగుళాల పొడవు ఉండేలా చూడాలి. కొబ్బరి పీచు ద్వారా ముంతలో ఉన్న నీరు చుక్కలు చుక్కలుగా కిందకు జారుతూ ఉంటుంది. తగినంత ఎత్తున్న మూడు రాళ్లను తీసుకొని, వాటిని మొక్క పాదులో ఉంచి.. వాటిపై నీటి ముంతను ఉంచితే చాలు. నీటి చుక్కలు మొక్కల వేళ్లకు నిరంతరం అందుతూ ఉంటాయి. ముంతపై మూత పెడితే.. నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. మొక్కకు రోజంతా తేమ అందుతూ ఉంటుంది. ముంతను నీటితో నింపితే.. రోజంతా మొక్కలకు నీరందుతుంటుంది.  

 ఎండల నుంచి మొక్కలకు పాక్షిక నీడను కల్పించేందుకు గార్డెనింగ్ షాపులలో అమ్మే షేడ్‌నెట్‌ను వాడ టం మామూలే. దీనికి బదులు పల్చని పాత గోనె సంచులను ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతోనే ఇంటిపంటలపై షేడ్‌నెట్‌ను ఏర్పాటు చే సుకోవచ్చు. కత్తిరించిన గోనె సంచులను కలిపి దబ్బళంతో కుట్టి.. పరదాలా రూపొందించాలి. దీన్ని ఇంటిపంటలున్న కుండీలు, మడులపైన తాళ్లతో కట్టాలి. దీనివ ల్ల తక్కువ ఖర్చుతోనే మొక్కలను ఎండ బారి నుంచి కాపాడుకోవచ్చు. గోనె సంచుల పందిరి ఏర్పాటుకు చదరపు అడుగుకు ఒక్క రూపాయి ఖర్చవుతుందని ఒక అంచనా. మీరూ ప్రయత్నించి చూడండి..!
  - ఇంటిపంట డెస్క్

Advertisement

తప్పక చదవండి

Advertisement