మహమ్మారిని తరిమికొట్టేందుకు 'ఆప్త' పోరాటం | Sakshi
Sakshi News home page

మహమ్మారిని తరిమికొట్టేందుకు 'ఆప్త' పోరాటం

Published Fri, Oct 14 2016 8:30 PM

మహమ్మారిని తరిమికొట్టేందుకు 'ఆప్త' పోరాటం - Sakshi

టెక్సాస్: ధ్రంబోసిస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆప్త (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) నడుం బిగించింది. ధ్రంబోసిస్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రపంచంలో ఈ వ్యాధి సోకిన ప్రతి నలుగురిలో ఒకరు మరణిస్తున్నారు. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టుకు పోవడం వలన, గుండెపోటు, ఊపిరితిత్తులు మూసుకు పోయి మరణించే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో ముఖ్యంగా తెలుగు వారిలో ధ్రంబోసిస్ గురించి అవగాహన కలిగించి ఈ మరణాలకు అడ్డుకట్ట వేయడానికి ఆప్త తన వంతుగా కృషి చేస్తోంది. విద్యా, వైద్య రంగాల్లో అనేక సేవలు చేస్తున్న ఈ సంస్థ ప్రపంచ ధ్రంబోసిస్ డే(అక్టోబర్ 13) సందర్భంగా అమెరికా, భారత్లోని అనేక చోట్ల ధ్రంబోసిస్ అవగాహన శిబిరాలను నిర్వహించింది.

ఈ వ్యాధి లక్షణాలు తెలుసు కోవడం, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటి విషయాలపై అవగాహన కలిగించడం ముఖ్య ధ్యేయంగా ఆప్త వైద్యుల బృందం గురువారం ఈ కార్యక్రమాలను నిర్వహించింది.  80 దేశాల్లో ధ్రంబోసిస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా ఆప్త సంస్థ ఒకే రోజు అమెరికా, భారత్లోని 10 ప్రదేశాల్లో ఏకకాలంలో నిర్వహించింది.

అమెరికా, భారత్లో ఆప్త నిర్వహించిన కార్యక్రమాల వివరాలు

విశాఖపట్నం: ఆప్త వైద్యులు  డా. నీరజ ఆధ్వర్యంలో శుభం ప్రేమ హాస్పటల్స్ అధినేతలు డా. అది నారాయణ సుంకర,  డా. శశి ప్రభ, డా. రాజ్ తమ హాస్పటల్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించారు.

విజయవాడ I: ఆప్త సభ్యులు ఎర్రంశెట్టి శ్రీ ,  ఎర్రంశెట్టి శివ  ఆధ్వర్యంలో లిబర్టీ హాస్పిటల్ అధినేత, శివ సోదరులు డా. శ్రీ ఎర్రంశెట్టి రవి , డా. దుర్గా రావు ఈ కార్యక్రమాన్ని  విజయవంతంగా నిర్వహించారు.

విజయవాడ II: ఆప్త సభ్యులు నంబూరి కృష్ణ  విజయవాడలోని డా. ప్రభాకర్ ఆసుపత్రి ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గుంటూరు: స్థానిక అహల్య హాస్పటల్స్లో డా. ఉదయ్ శంకర్,   డా. దుర్గారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దాచేపల్లి: ఆప్త ఎంపైర్ రీజియన్ ఉపాధ్యక్షులు బనారసీ తిప్పా ఆధ్వర్యంలో స్థానిక మండల పంచాయతీ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మండల రెవెన్యూ ఆఫీసర్, ప్రభుత్వ వైద్యులతోపాటూ భారీ ఎత్తున స్థానికులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు.

కాకినాడ: అమృతా హాస్పిటల్ అధినేత డా. కిరణ్, డా. శశిధర్ ఆధ్వరంలో మెగా కార్యక్రమాన్ని నిర్వహించగా, స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభించింది.

తిరుపతి: ఆప్త సభ్యురాలు  సమీరా చవాకుల ఆధ్వర్యంలో ఎలైట్ హాస్పిటల్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది.

నంద్యాల: స్థానిక లైఫ్ హాస్పిటల్లో ఆప్త సభ్యురాలు సమీరా చవాకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

అమెరికాలో...
టెక్సాస్: హ్యూస్టన్లో పెయిన్ మేనేజ్ మెంట్ హాస్పటల్ అధినేత డా. సూర్య రగుతు గారి ఆధ్వర్యంలో పెయిన్ మేనేజ్ మెంట్ హాస్పటల్ ఆవరణలో డా. వెంకట్ వీరి శెట్టి ,  డా. మంజులా రగుతు, ఆప్త అధ్యక్షులు గోపాల్ గూడపాటి, ఆప్త బోర్డు సెక్రటరీ రాజేష్ యాళ్లబండి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

మిస్సోరి: సెయింట్ లూయిస్లో డా. నాగిరెడ్డి హాస్పిటల్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆప్త వైద్యులు డా. రవి ఆకుల, డా.సాయి కొల్ల, డా.నాగి రెడ్డి, డా. సూర్య, డా. నీరజల కృషి వల్లే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగలిగామని వైద్య బృందం నాయకులు, ఆప్త మెడికల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (ఏఎంఏపీ) చైర్ డా. కుమార్ కొత్తపల్లి పేర్కొన్నారు. ఆప్త అధ్యక్షులు గోపాల్ గూడపాటి సారధ్యంలో ఉపాధ్యక్షులు జె.జె.వి సుబ్రహ్మణ్యం, నార్త్ ఈస్ట్ రీజనల్ సమన్వయ కర్త బనారసీ తిప్పా, న్యూ జెర్సీ సమన్వయ కర్త సత్య వెజ్జు ఆప్త వైద్య బృందానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.




Advertisement

తప్పక చదవండి

Advertisement