Sakshi News home page

గ్రహం అనుగ్రహం (24-12-2016)

Published Sat, Dec 24 2016 12:46 AM

గ్రహం అనుగ్రహం (24-12-2016) - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం,
దక్షిణాయనం హేమంత ఋతువు,
మార్గశిర మాసం, తిథి బ.ఏకాదశి రా.3.50 వరకు
నక్షత్రం స్వాతి రా.1.38 వర కు,
వర్జ్యం ఉ.5.18 నుంచి 7.28 వరకు
దుర్ముహూర్తం ఉ.6.29 నుంచి 7.55 వరకు
అమృతఘడియలు ప.3.54 నుంచి 5.39 వరకు

సూర్యోదయం    :    6.28
సూర్యాస్తమయం    :    5.36
రాహుకాలం            :   ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం           :  ప.1.30 నుంచి  3.00 వరకు
 


భవిష్యం

మేషం: రాబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా.  వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: కొన్ని వ్యవహారాలలో అవరోధాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

సింహం: చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య: కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు

తుల: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పనుల్లో పురోగతి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు.

వృశ్చికం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో మార్పులు. వృథా ఖర్చులు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులకు శ్రీకారం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
మకరం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. పలుకుబడి పెరుగుతుంది. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహ వంతంగా ఉంటాయి.

కుంభం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

తప్పక చదవండి

Advertisement