లండన్ లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి | Sakshi
Sakshi News home page

లండన్ లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి

Published Thu, Jun 22 2017 8:07 PM

NRI TRS and TAUK condolences to Professor Jayashankar



లండన్:  ఎన్నారై టీఆర్ఎస్, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా నివాళి సభ ఏర్పాటు చేశారు.  టాక్ సమస్త కార్యవర్గ సభ్యులు, ప్రవాస తెలంగాణ వాదులు హాజరై జయశంకర్ సార్కు ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో ముందుగా సార్ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, జోహార్ జయశంకర్ సార్... జయశంకర్ సార్ అమర్ రహే అంటూ నివాళుర్పించారు.

ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ... తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని,  చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేశారని, నేడు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు .అనుకున్న ఆశయ సాధనకై ఆయన చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. అలాగే ఇటీవల వరుస దాడులతో యూకే లోని పలు నగరాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు సంస్థ తరుపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

 ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఈవెంట్స్ కో ఆర్డినేటర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జీవితం అందరికి ఒక స్ఫూర్తి సందేశమని, ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భం ఏదైనా మనమంతా తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట ఉండి, జయశంకర్ సార్ ఆశయాల కోసం కృషి చెయ్యాలని, ఇదే మనం వారికిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ సత్యపాల్ పింగిళి, సత్య చిలుముల, రవి ప్రదీప్, నవీన్ భువనగిరి, తదితరులు హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement