మహా స్వాప్నిక విజేత | Sakshi
Sakshi News home page

మహా స్వాప్నిక విజేత

Published Wed, Jul 27 2016 2:59 AM

మహా స్వాప్నిక విజేత - Sakshi

కష్టించే ప్రజల స్వేదం, శ్రమశక్తి ఎటువంటి దుష్టత్వా న్నయినా ఎదిరించగల అగ్నిని సృష్టించగలదని అబ్దుల్ కలాం విశ్వసించారు.
 
డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం లోకాన్ని విడిచిపెట్టి వెళ్లి అప్పుడే సంవత్సరం అయింది. భారతదేశపు అత్యు న్నత పురస్కారమైన భారతరత్న గుర్తింపు వరించిన ఐదేళ్ల అనంతరం ఏపీజే అబ్దుల్ కలాం, పదకొండవ దేశాధ్య క్షుడయ్యారు. అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు పూర్తి అయిన వెంటనే దాదాపు ఎనిమిదేళ్లు తనకు అత్యంత జీవిత లక్ష్యమైన టీచింగ్‌లోనే ఆఖరి శ్వాస విడిచిపెట్టారు. మధ్యతరగతి కుటుంబంలో ‘పేపర్ బోయ్’గా ఆరంభ మైన బాల్యం రామే శ్వరం నుంచి ఢిల్లీ వరకు 83 ఏళ్లపాటు సాగించిన జీవన ప్రస్థానంలో ఏపీజే అబ్దుల్ కలాం, నిత్య కర్మిష్టిగా దేశ సౌభా గ్యాన్ని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తగా క్రమేపీ దేశాధ్యక్షునిగా పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, భారత ప్రజాస్వామ్య యువపథ నిర్దేశకునిగా మార్గ దర్శకులయ్యారు.
 
అబ్దుల్ కలాం జీవితంలో స్ఫూర్తిదాయకమైన ఉదంతా లెన్నో ఉన్నాయి. తన వ్యక్తి త్వంపై ప్రగాఢ ముద్ర వేసిన దేశ, విదేశీ మేధావులైన సత్పు రుషుల ప్రస్తావనలు ఉపన్యా సాలలో, రచనలలో సాక్షాత్క రిస్తాయి. ‘ది వింగ్స్ ఆఫ్ ఫైర్’, ‘మై జర్నీ’, ‘ఇగ్నై టెడ్ మైండ్స్’, ‘యూఆర్ బోర్న్ టు బ్లోసమ్’ వంటి రచనలు ఆయన అపూర్వ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటంతో భవిష్యత్ భారత యువతరా నికి కరదీపికలుగా ఉపకరిస్తున్నాయి. యువజనులే జాతి సంపదగా, భారత భవితవ్యాన్ని నిర్మించగలరని ఆయన కలలు కన్నారు. అపజయాలను ఎదుర్కొంటున్న సామాజిక వైరుధ్యాలను, నిరాశా నిస్పృహలు, దిశా నిర్దేశంలేని అస్పష్టత, సంక్లిష్టతా వైఖరులకు ఆయన తపించి, శ్రమించిన తీరుతెన్నులే ఆయన జీవ నయానం.
 
ఆయన తత్వవేత్త కాదు. భారతదేశ పౌరునిగా మహత్తర గర్వంతో జీవితం చాలించాలని, తిరిగి మాతృ దేశం సౌభాగ్యవంతమైన జనావళి సుఖసంతోషాలతో బతికే శాస్త్రీయ సాంకేతిక పురోగతి సాధించేటట్టు ఆశీర్వదించాలని సర్వేశ్వరున్ని ప్రార్థించేవారు. ప్రజలు కష్టించే స్వేదం, శ్రమశక్తి ఎటువంటి దుష్టత్వాన్నయినా ఎదిరించగల అగ్నిని సృష్టించ గలదని ‘మిస్సైల్స్ మేన్ ఆఫ్ ఇండియా’ క్షిపణి పిత విశ్వసించారు. విరామ మెరుగని బోధనా పథికునిగా శ్రమించారు.
 
ఉద్యోగాన్వేషిగా తొలి ఇంటర్వ్యూ వైఫల్యంతో ఋషీకేశ్‌లో స్వామీ శివానంద వద్ద పొందిన విద్యా సందేశ స్ఫూర్తి తోడుగా సాగిన యువ అబ్దుల్ కలాం జీవన యానం.. స్వామి నారాయణ్ గురు సంప్రదాయ యోగి ప్రముఖ్ స్వామీజీ దివ్యాను భవ చైతన్యం వరకు కొనసాగింది. ‘ట్రాన్సండెన్స్’గా ఆఖరి రచన మరణానంతరం విడుదల అయింది. 2020 టెక్నాలజీ విజన్ విజయవంతం కావాలని శ్రమించిన స్వాప్నిక జీవి అబ్దుల్ కలాం 2015 జూలై 27న మేఘాలయలోని షిల్లాంగ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కన్నుమూసారు. యువతీ యువకుల స్వప్నాలు చెదిరిపోకుండా. చిరునవ్వులు చెరిగిపోకుండా, కళ్ళల్లో కాంతులు సన్నగిల్లకుండా 54 కోట్ల మంది యువతీ యువకుల ఆకాంక్షలకు, జీవన సంక్షోభానికి సత్వరం జాతి సర్వశక్తులు కేంద్రీకరిం చాలని సాగించిన శాశ్వత స్వప్నాన్వేషణలో ఏపీజే అబ్దుల్ కలాం సాగిపోయారు.

ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే మాటేమో గానీ ఆయ నకు ఒక అపురూపమైన స్మృతి చిహ్నాన్ని నిర్మించే విషయంలో కూడా మన పాలకులు సంవత్సర కాలంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుం డటమే అసలు విషాదం.
 (డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా)



(వ్యాసకర్త : జయసూర్య, సీనియర్ జర్నలిస్టు  మొబైల్ : 94406 64610)

Advertisement

తప్పక చదవండి

Advertisement