18–35 ఏళ్ల మధ్య రాసిన కవిత్వం అంతర్వేది | Sakshi
Sakshi News home page

18–35 ఏళ్ల మధ్య రాసిన కవిత్వం అంతర్వేది

Published Mon, Jan 2 2017 12:30 AM

Opinion on Poetry Antarvedi by Dr.Avadanam RaghuKumar

∙ఐదు ప్రశ్నలు

డాక్టర్‌ అవధానం రఘుకుమార్‌ కవితా సంకలనం ‘అంతర్వేది’ ఇటీవలే విడుదలైంది.
ఆ సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలు...


1. సంకలనం తేవడానికి ఎందుకింత ఆలస్యమైంది?
మా ఫాదర్‌ అనేవారు: ‘పాశ్చాత్యులు కాలేజీ రోజుల్లోనే సంకలనాలు వేస్తారు; అదే మన కవులు మాత్రం అపారమైన కృషి తర్వాత, వారి జీవితాన్ని గాఢంగా అనుభవించిన తర్వాతే కవిత్వాన్ని బయటకు వదులుతారు’. అలా కొంత తటపటాయించాను. అలాగే, నా 57 ఏళ్ల జీవితంలో రకరకాల భావజాలాల్లో కొట్టుకుపోయాను. మార్క్సిజం, క్యాపిటలిజం, గాంధీ, నెహ్రూ, లోహియా... నేను చెప్పేది కరెక్టో కాదో నాకే తెలియనప్పుడు నేను చెప్పకూడదు కదా! అందువల్ల కూడా ఆలస్యమైపోయింది.

2. శీర్షిక అంతర్వేది దేనికి సూచిక?
1980ల్లో యాక్టివిస్ట్‌గా ఉండటం కంటే నన్ను నేను రెట్రాస్పెక్ట్‌ చేసుకోవడం ముఖ్యమన్నదానిలోకి వచ్చాను. అట్లా పూర్తిగా నా రీడింగ్‌ రూమ్‌కే పరిమితమైపోయాను. ఆ ఆలోచనల లోపలి ప్రాసెస్‌ను సూచించేదే ఈ అంతర్వేది.

3. మీ కవిత్వానికి స్త్రీ ప్రధాన ప్రేరణ అన్నారు...
ఒకటి, చలం ప్రభావం నామీద హెవీగా ఉండటం కారణం. రెండోది, ఔన్నత్యంలోనూ, అనుభవంలోనూ స్త్రీ నాకు మరింత ఉన్నతంగా కనబడుతుంది. ఆమె చెప్పే మాటలు, విషయాలు, సమస్యలు అన్నీ ఆసక్తికరమే. ఆమె ఎన్నో రూపాలతో నన్ను పెనవేసుకుంది. అందుకే...

4. ఏమిటి మీ కవితాతత్వం?
కృష్ణశాస్త్రి, తిలక్, ఇస్మాయిల్‌ రాసిన భావకవిత్వ ఒరవడిలో కొనసాగుతున్నాను. ఏ సాహిత్య ప్రక్రియకైనా వ్యక్తిగత ఆనందం, అనుభూతి ఇవే కొలమానాలని నా నమ్మకం.

5. తర్వాతి సంకలనం ఎప్పుడు?
ఈ అంతర్వేదిలోని కవితలన్నీ నా 18–35 ఏళ్ల మధ్య నా స్ట్రగులింగ్‌ పీరియడ్‌లో రాసుకున్నవి. కొంచెం స్టబిలైజ్‌ అయ్యాక, కొంచెం మెచ్యూరిటీ వచ్చాక(నేను మెచ్యూరిటీ అనుకునేది) రాసినవి ఏప్రిల్, మే కల్లా మరో సంకలనంగా తేవాలనుంది.

(డాక్టర్‌ అవధానం రఘుకుమార్‌)
అంతర్వేది; పేజీలు: 88; వెల: 60; ప్రతులకు: ఎ.నాగమణి, ఫ్లాట్‌ 401, శశాంక్‌ రెసిడెన్సీ, స్ట్రీట్‌ 11, తార్నాక, హైదరాబాద్‌–17. ఫోన్‌: 040–27000327
 

Advertisement
Advertisement