బ్రాండెడ్‌కు బదులుగా... | Sakshi
Sakshi News home page

బ్రాండెడ్‌కు బదులుగా...

Published Mon, Feb 5 2018 1:11 PM

adulterated products kakatiya university mess - Sakshi

కేయూ క్యాంపస్‌: టెండర్లలో పేర్కొన్న విధంగా బ్రాండెండ్‌ నిత్యావసర వస్తువులు కాకుండా వేరే కల్తీ వస్తువులను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కేయూలోని కామన్‌ మెస్‌ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సంబంధిత కాంట్రాక్టర్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి లారీలో కామన్‌మెస్‌కు వివిధ రకాల నిత్యావసరాల వస్తువులను తీసుకొచ్చారు. వాటిని కామన్‌ మెస్‌లోని స్టోర్‌కు తరలిస్తుండగా మెస్‌ కమిటీ బాధ్యులు పరిశీలించారు. టెండర్‌లో పేర్కొన్నట్లు కారం, పసుపు, ధాన్యాలు, గోదుమ పిండి బ్రాండెండ్‌వి కాకుండా ఇతర కంపెనీలకు చెందినవి తీసుకొచ్చారు. ఆగ్రహం చెందిన విద్యార్థులు సరుకులను లోనికి తీసుకెళ్లకుండా అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఆ కాంట్రాక్టర్‌ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లారీని కామన్‌ మెస్‌లోనికి వెళ్లనీయకుండా గేట్‌కు తాళం వేయడంతో వాటర్‌ క్యాన్లు బయటే ఉన్నాయి. దీంతో కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌ డాక్టర్‌ ఇస్తారి వచ్చి గేట్‌ తాళం పగలగొట్టించి నీటి క్యాన్లను లోనికి పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డైరెక్టర్‌ ఇస్తారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు విద్యార్థుల సమాచారంతో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వచ్చి నిత్యావసర వస్తువుల శాంపిళ్లనుతీసుకెళ్లారు. కాగా టెంటర్లలో పేర్కొన్న బ్రాండెడ్‌ వస్తువులను రెండు రోజుల్లో  తీసుకురాకుంటే కాంట్రాక్టర్‌ టెండర్‌ను రద్దు చేస్తామని డైరెక్టర్‌ హామీ ఇవ్వ డంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు.

నాలుగు రకాల వస్తువుల్లో వ్యత్యాసం 
టెండర్‌లో పేర్కొన్న విధంగా 36 రకాల సరకులను కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తారు. ఆదివారం తీసుకొచ్చిన సరకుల్లో కారం, పసుపు, గోదుమ పిండి, ధనియాలు బ్రాండెడ్‌వి తీసుకురాలేదు. మెస్‌ కమిటీ బాధ్యులు గుర్తించగా నేను వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాను. రెండురోజుల్లో మళ్లీ  బ్రాండెండ్‌ వస్తువులు తీసుకురాకుంటే టెండర్‌ను రద్దుచేస్తాం.                   
కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌ డాక్టర్‌ ఇస్తారి 

Advertisement

తప్పక చదవండి

Advertisement