బామ్మ బాట.. బంగారం పంట

13 Mar, 2019 13:38 IST|Sakshi
తన తోటలో పండించిన కోకో పండ్లను చూపిస్తున్న మహిళా రైతు లక్ష్మీకాంతం

సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్‌:  ఉద్యోగ విరమణ పొందాక ఆమె విశ్రాంతిని కోరుకోలేదు. వ్యవసాయం చేస్తూ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఎనిమిది పదుల వయస్సులోనూ సాగుబాట పట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమే జంగారెడ్డిగూడెంకు చెందిన కేసనపల్లి లక్ష్మీకాంతం. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా తండ్రి శ్రీరాములు వ్యవసాయదారుడు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయంపై ఆసక్తి ఏర్పడింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో 1954లో ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరాను. పోలవరం, కోండ్రుకోట, లక్ష్మీపురం, పైడిపాక, చేగొండపల్లి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1992లో ఉద్యోగ విరమణ పొందాను.

బాధ్యతలన్నీ తీరిపోవడంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో నాకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించాను. సేంద్రియ ఎరువులతోనే పామాయిల్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు వేసి వ్యవసాయాన్ని ప్రారంభించాను. జామను ఒడిశాలో కటక్‌ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం పామాయిల్, కోకో పంటలు సాగుచేస్తున్నాను. పొలానికి నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం తదితర పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే వ్యవసాయమే నా ఆరోగ్య రహస్యం. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి పనులు ముగించుకుని పొలానికి వెళ్తుంటాను.’ 

మరిన్ని వార్తలు