2014 మేటి చిత్రాలు | Sakshi
Sakshi News home page

2014 మేటి చిత్రాలు

Published Sat, Dec 27 2014 5:03 PM | Updated 30 Min Ago

2014 Best Images - Sakshi
1/93

క్రమశిక్షణ సైనికుల్లా రాతి స్తంభాలపై వాలిన ఈ పక్షులు జపం చేయడం లేదు. వేట కోసం వేచి చూస్తున్నాయి. నీటి అడుగున చేప పిల్ల జాడ కోసం చూస్తున్నాయి. వేట దొరికితే కడుపు నిండినట్టే..పొట్ట కూటి కోసం కోటి తిప్పలు (రంగారెడ్డి జిల్లా గాజుల రామారం చెరువులో) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
2/93

చెత్త తీసే కార్మికులం.. 'చెత్త' కార్మికులం కాదు.. పని ఏదైనా కలిసే. మాతో పాటే పిల్లలు.. పాలు తాగే పసికందు ఒడిలో... మరో చిన్నారికి రిక్షాకు కట్టిన చీర ఊయలే దిక్కు.. అయినా శ్రమైక జీవన సౌందర్యం తెలిసిన అమ్మ ప్రేమ నవ్వులు చిందిస్తే హరివిల్లు కూడా చిన్నపోతుంది. (హైదరాబాద్ శివారులోని సూరారం) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
3/93

ఇంట్లో భార్యా పిల్లలు గుర్తుకు రారు.. కష్టాలు అంతకన్నా గుర్తుకు రావు.. మత్తు చిత్తు చేస్తుందనే భయమూ లేదు.. రెండు గ్లాసులు గొంతు దిగితే ఈ పేటకు నేనే రాజును.. (హైదరాబాద్ శివార్లులోని కొంపల్లి) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
4/93

అయ్యో దేవుడా.. ఎంత పని చేశావు.. క్వారీ గుంత కడుపు కోత మిగిల్చితే కన్నీరు వరదవ్వదా (హైదరాబాద్ శివారులోని కొంపల్లి) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
5/93

బొమ్మలతో ఆడుకోవాల్సిన చేతులు అపుడే భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్నాయి, ఇసుకలో ఆడుకోవాల్సిన పాదాలు తల్లి బాటలో నడవటానికి సిద్ధపడుతున్నాయి. శ్రద్ధగా పనిచేస్తున్న ఆ చిన్నారి మోము బడిబాట పడుతుందో..' కూలి'న బతుకవుతుందో (జీడిమెట్ల, హైదరాబాద్) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
6/93

దుమ్ము కొట్టుకు పోయిన దేహాలు, చాలీ చాలీని మెతుకులు.. అదే పరమాన్నం.. ఆకలికి లుంగచుట్టుకు పోయిన కడుపులకి నాలుగు అన్నం మెతుకులు దొరికితే అందరం కలిసి పంచుకుందామనే పెద్ద మనసులు.. (సూరారం, హైదరాబాద్) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
7/93

మాకూ ఓటు హక్కుంది.. మేము వినియోగించుకున్నాం.. మేమూ మనుషులమే.. (షాపూర్ నగర్, హైదరాబాద్ లో ఓటు వేసిన తర్వాత) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
8/93

పంట పొలాలన్నీ నగరాలవుతున్న వేళ.. కాంక్రీట్ వనాలు కోరలు చాచి ఆక్రమిస్తున్న తరుణంలో నలుగురికి తిండి గింజలు అందించాలంటే నాట్లు వేయక తప్పదు కదా!తలపైన వరినాట్లతో హైదరాబాద్ శివారులోని గాజుల రామారం మహిళా రైతు-దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
9/93

స్మార్ట్ గా, స్మార్ట్ ఫోన్ తో.. మునపటి రోజుల్లో కాలక్షేపం కోసం గొంతెత్తి పాడే పల్లెపదాలు.. ఇపుడేమో స్మార్ట్ ఫోనులో సినిమా పాటలు.. ఇవేవి పట్టని తమ తీరు మారని జీవాలు.. (హైదరాబాద్ శివారులోని బౌరంపేట) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
10/93

స్కూలుకు వెళ్లాలంటే ఎన్ని కష్టాలు.. 'టైట్ రోప్ వాక్'.. కాలు జారితే బురదలోనే.. అయినా తప్పదు కదా.. ఒకరికి ఒకరు అండ.. ఒకరి అడుగుజాడల్లో మరొకరు. ఒకరి చేయి మరొకరు ఆలంబన.. 'వంతెన' దాటితో చదువు పోరు మొదలు.. (హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
11/93

శ్రద్ధగా చదువుకో బిడ్డా.. నాలా ఎండకు ఎండి వానకు తడిసి చెట్టునీడలో జీవన సమరం నీకొద్దురా కన్నా.. పెద్ద చదువులకు మొదలు అ ఆలతోనే.. (హైదరాబాద్ సుచిత్రా జంక్షన్) దశరథ్ రజువా

2014 Best Images - Sakshi
12/93

పట్టణాల్లో ఉండి చదువుకునే స్థోమత లేదు.. చదువుకోవాలనే తపన ముందు నదీనదాలు అడ్డంకి కానే కాదు. ప్రయాణంలో ఎదురుపడే ప్రమాదం ఆ పసిహృదయాల సంకల్పం ముందు తలవంచాల్సిందే.. నెల్లూరుజిల్లా పులికాట్ సరస్సు పరివాహక ప్రాంత విద్యార్థులు చదువుకునేందుకు ప్రతీరోజు ఇలా పడవ ప్రయాణం చేయాల్సిందే. ఏ.కమలాకర్

2014 Best Images - Sakshi
13/93

సాగరతీరం.. జనసాగరం.. కడలి అలలతో పోటీ పడుతున్న జనకెరటాలు. జనహోరు ముందు కడలిహోరు చిన్నబోయింది (విశాఖతీరంలో నేవీ డే) ఆకుల శ్రీనివాస్

2014 Best Images - Sakshi
14/93

సాగరతీరం.. జనసాగరం.. కడలి అలలతో పోటీ పడుతున్న జనకెరటాలు. జనహోరు ముందు కడలిహోరు చిన్నబోయింది (విశాఖతీరంలో నేవీ డే) ఆకుల శ్రీనివాస్

2014 Best Images - Sakshi
15/93

అందమైన సీతాకోక చిలుక.. రంగురంగుల రెక్కలు.. విచ్చుకున్న పూరేకులు.. హాయిగా ఆహ్లాదంగా మకరందాన్ని ఆస్వాదిస్తూ.. (నెల్లూరులోని ఒక నర్సరీలో) ఏ.కమలాకర్

2014 Best Images - Sakshi
16/93

బారా షహీద్ దర్గా.. రొట్టెల పండుగ.. అన్ని మతాల వారు దర్శించుకునే పవిత్రమైన చోటు, సందర్భం.. విద్యుత్తు కాంతుల్లో మరింత మనోహరంగా (నెల్లూరు) ఏ.కమలాకర్

2014 Best Images - Sakshi
17/93

రంకెలేస్తూ.. కయ్యానికి కాలు దువ్వుతూ అదుపుతప్పిన వృషభరాజం.. అదుపుచేయాలంటే కండబలమే కాదు.. గుండె నిబ్బరమూ కావాలి (నెల్లూరు) ఏ.కమలాకర్

2014 Best Images - Sakshi
18/93

చిటారుకొమ్మన మిఠాయి పొట్లం.. తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు.. సునాయాసంగా స్కూటర్ నిచ్చెనపై అలవోకగా నిల్చుంటా.. నా పొట్ట నేను నింపుకుంటా (నెల్లూరు) ఏ.కమలాకర్

2014 Best Images - Sakshi
19/93

ఒక్క క్షణం ఏమరుపాటు అంచనాలని తలకిందులుచేస్తే బతుకు బుగ్గిపాలవదా.. ప్రమాదమని తెలిసినా నిర్లక్ష్యం.. అవసరం లేని తొందర.. (నెల్లూరు రంగనాయకులపేట రైల్వే క్రాసింగ్) ఏ.కమలాకర్

2014 Best Images - Sakshi
20/93

అల్లా అని పిలిచినా.. వెంకన్నా అని కొలిచినా.. మతం కాదు మనసు ముఖ్యం.. ఆ మనసు నిర్మలంగా ఉంటే 'దువా' కోరుకునే ఆ చేతులు జోడించి దండాలు కూడా పెడతాయి (నెల్లూరులో సరస్వతీ దేవికి కూతురితో దండం పెట్టిస్తున్న ముస్లిం మహిళ) ఏ.కమలాకర్

2014 Best Images - Sakshi
21/93

ఇద్దరి చేతుల్లోనూ లాఠీ.. ఒకరిది బతుకుపోరు.. మరొకరిది బాధ్యతల బరువు..(నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్) ఏ.కమలాకర్

2014 Best Images - Sakshi
22/93

ఎగసిపడుతున్న కడలి.. ఎదురీదుతున్న పడవ. బ్రతుకుపోరులో ప్రతిరోజూ పునర్జన్మే. గంగమ్మకు మొక్కులు చెల్లించి వేటకు వెళ్తున్న గంగపుత్రులు(నెల్లూరు జిల్లా కావలి) - ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
23/93

టెక్నాలజీ.. జీవితంలో భాగం.. జీవికలో భాగం.. ట్యాబ్లో చూసి భగవద్గీత పారాయణం చేస్తున్న టెక్ సేవీ అర్చకులు(నెల్లూరు రంగనాయకుల దేవస్థాన ఉత్సవాలు -ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
24/93

బ్రతుకు బండిని ఎలా బ్యాలెన్స్ చేయాలో.. ఇద్దరు చిన్నారులను బ్యాలెన్స్ చేస్తూ దయార్ద్ర హృదయులు విసిరే చిల్లర నాణాల కోసం.. కాసులు రాలితే కడుపు నిండుతుంది. లేకపోతే మరోరోజు మరో చోకట..(నెల్లూరు) -ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
25/93

నవ్విపోదుగాక.. నాకేటి(నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం) ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
26/93

ఇద్దరు లేక ముగ్గురు.. కాదు కాదు ఆరుగురు.. అనుకోకుండా ఏమైనాజరిగితే.. (నెల్లూరు జాతీయరహదారి) ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
27/93

విశాలంగా రెక్కలు విప్పుకొని.. ఆకాశపుటంచులను తాకాలనే ఆరాటం(నెల్లూరుజిల్లా నేలపట్టులో విదేశీ పక్షులు) -ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
28/93

రాముడి వేలికొనల స్పర్శ అతిశయమేమో..(నెల్లూరు) -ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
29/93

పలకా బలపం పట్టాల్సిన చిన్ని చేతులు అలవోకగా చెప్పులు కుట్టేస్తున్నాయి. అలసిన తండ్రికి చిరుసాయం అందిస్తున్నాయి. ఎంతటి దీక్ష.. ఎంతటి నైపుణ్యం..(నెల్లూరు) -ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
30/93

నేను పనికి.. నీవు బడికి.. నా భుజాలపై ఉన్న గునపం నీ భుజానికి బరువు కాకూడదనే నా తాపత్రయం(నెల్లూరు) -ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
31/93

అలసిన దేహాలు బ్రతుకు బండిని లాగలేకపోతుంటే కబళించేందుకు దూసుకొస్తున్నట్టు లేదూ ఆ పొగబండి(నెల్లూరు) -ఎం.వెంకటరమణ

2014 Best Images - Sakshi
32/93

మట్టితేలిన వాలీబాల్ కోర్టు.. స్పోర్ట్స్ షూ వేసుకోలేని పేదరికం.. ఇవన్నీ సాకులే కదా.. నైపుణ్యం, పట్టుదల ఉండాలేగానీ శరీరాన్ని విల్లులా వంచి, బాల్ని తదేకంగా చూస్తూ స్మాష్కి రెడీ అవుతున్న వాలీబాల్ ఏకలవ్యుడు(తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ) - వీరభగవాన్

2014 Best Images - Sakshi
33/93

ముద్ద మందారం..'ముగ్ధ' మనోహరం.. గోరింట పండిన చేతుల పూరెక్కల మధ్య నవ్వుల కాంతుల ఉషోదయం(తూర్పుగోదావరి జిల్లా మందపల్లి) - వీరభగవాన్

2014 Best Images - Sakshi
34/93

దరఖాస్తుకే ఇన్ని తంటాలు.. ఇవ్వడానికి.. తీసుకోడానికి కూడా.. అప్లికేషన్ల వరదలో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వ అధికారి.. వీటికి మోక్షం లభించేదెప్పుడు?(తూర్పుగోదావరి జిల్లా కాతేరు) - వీరభగవాన్

2014 Best Images - Sakshi
35/93

అరే.. ఇంత అద్భుతంగా ఉంది.. ఎక్కడ?? ఎత్తైన కొండలు.. పచ్చగా పరుచుకున్న పచ్చదనం.. కొండకోనల్ని విడగొడుతున్నట్లుగా రైల్వేలైన్..గాలితో పోటీపడుతూ దూసుకుపోతున్న చుక్ చుక్ బండి.. ఎక్కడో కాదు.. నల్లమల అడవుల్లో ప్రకాశం జి్లా గిద్దలూరు - కర్నూలు జిల్లా నంద్యాలను కలిపే అడవిదారి ఇది-ఎం.ప్రసాద్

2014 Best Images - Sakshi
36/93

ఒకవైపు ఒడ్డున సేదతీరుతున్న పడవలు.. మరోవైపు భారీ సమావేశానికి సిద్ధమవుతున్న మేఘాలు.. మధ్యలో తుపాను ముందరి మౌనాన్ని ప్రదర్శిస్తున్న కడలి.. ఈ పొద్దు ఎలా గడుస్తుందో.. (ప్రకాశం జిల్లా కొత్తపట్నం) - ఎం.ప్రసాద్

2014 Best Images - Sakshi
37/93

గంగిరెద్దుల విన్యాసాలు దాదాపు కనుమరుగవుతున్న కాలమిది. అందంగా ముస్తాబైన మన చిన్ననాటి నేస్తాలు అక్కడక్కడా ఇంకా కనపడుతున్నాయి. వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తినే ఆసరాగా చేసుకున్న ఇలాంటి యువకులు ఆ కొద్దిపాటి ఆనందాన్ని అందిస్తున్నారు(హైదరాబాద్ శిల్పారామం) -ఎన్. రాజేష్ రెడ్డి

2014 Best Images - Sakshi
38/93

ఇది సెల్ఫీల సీజన్ బాస్.. ముగ్గురు మిత్రులు.. వెనక నాలుగు మినార్ల చార్ మినార్ (హైదరాబాద్) -ఎన్. రాజేష్ రెడ్డి

2014 Best Images - Sakshi
39/93

హే.. హౌ యామ్ ఐ లుకింగ్?(హైదరాబాద్) -ఎన్. రాజేష్ రెడ్డి

2014 Best Images - Sakshi
40/93

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో(హైదరాబాద్) -ఎన్. రాజేష్ రెడ్డి

2014 Best Images - Sakshi
41/93

ప్రతి అమ్మకి, ప్రతి పాపకి ఎదురయ్యే సన్నివేశమే..(జంపన్నవాగు, మేడారం, వరంగల్) -ఎన్. రాజేష్ రెడ్డి

2014 Best Images - Sakshi
42/93

మదినిండా ఆత్మవిశ్వాసం.. గుండెల్లో జాతీయతాభావం.. లేనిది ఒక్క కాలు మాత్రమే.. (గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్) -ఎన్. రాజేష్ రెడ్డి

2014 Best Images - Sakshi
43/93

పూనమ్ కౌర్ మాతో సెల్ఫీ తీసుకుంటోందోచ్!!(హైదరాబాద్) -ఎన్. రాజేష్ రెడ్డి

2014 Best Images - Sakshi
44/93

తల్లి ప్రేమ.. రెక్కలొచ్చేవరకు పసికూనకు ఆసరా.. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతుందని తెలిసి కూడా..(హైదరాబాద్ శివారులోని తట్టి అన్నారం) - సోమసుభాష్

2014 Best Images - Sakshi
45/93

చదువు వస్తుందో రాదో తెలియదు.. అమ్మానాన్నకి చదివించే స్థోమత లేదని తెలుసు.. చిత్తు కాగితాల్లో దొరికిన పుస్తకంలో రిక్షాకు కట్టిన గూడు ఊయల్లో సేద తీరుతూ బొమ్మల్ని చదివేస్తున్న చిన్నారి లోకాన్ని చదవగలదా..(గుంటూరు) - రూబెన్

2014 Best Images - Sakshi
46/93

గంభీరమైన ఆహార్యం.. ఒళ్లు గగుర్పొడిపించే విన్యాసాలు.. చూడకూడదని మనసు చెబుతున్నా కళ్లు తిప్పుకోలేని వైనం(హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయ బ్రహ్మోత్సవాలు) - సోమసుభాష్

2014 Best Images - Sakshi
47/93

పొత్తిళ్లలో బిడ్డ.. కానీ ఓటు వేయాలి కదా!(గుంటూరు జిల్లా ఫిరంగిపురం) - రూబెన్

2014 Best Images - Sakshi
48/93

కడలి గీసిన సైకత చిత్రం(విశాఖపట్నం బీచ్) - పి.ఎన్.మూర్తి

2014 Best Images - Sakshi
49/93

దుస్తులు కుట్టే మిషన్.. దానికి రెండు సైకిల్ చక్రాలు.. రెడీ.. టైలర్ ఎట్ యువర్ డోర్ స్టెప్! కొత్తగా ఉంది కదూ కాన్సెప్ట్!!(విశాఖపట్నం) -పి.ఎన్.మూర్తి

2014 Best Images - Sakshi
50/93

ఆనందం అర్ణవమైతే.. అక్కాతమ్ముళ్ల పారవశ్యం చూడతరమా!(విశాఖపట్నంలో హోలీ సంబరాలు)- పి.ఎన్.మూర్తి

2014 Best Images - Sakshi
51/93

సముద్రాన్ని చదివిన ఆ చేతులు ఒడుపుగా వల విసిరితే కడుపులో దాచుకున్న జలపుష్పాలతో కడలి కరుణించదా..(విశాఖపట్నం) - పి.ఎన్.మూర్తి

2014 Best Images - Sakshi
52/93

హుద్ హుద్ హోరున తీరంవైపు పరుగులు పెడుతుంటే చెలియకట్ట సముద్రానికి తలవంచింది. రాకాసి అలలు విరుచుకపడితే తీరం కన్నీరుపెట్టింది. గుండెకోత మిగిల్చిన సముద్రాన్ని దీనంగా వేడుకొంది...(విశాఖపట్నం) - పి.ఎన్.మూర్తి

2014 Best Images - Sakshi
53/93

మంచుకురిసే వేళలో.. పాడేరు అటవీప్రాంతంలో ఓ చలి వేకువ-పి.ఎన్.మూర్తి

2014 Best Images - Sakshi
54/93

చీకటి కాలం చదువులు.. కరెంటు లేదు. వస్తుందో రాదో తెలియదు. పరీక్షలు కదా..రాయాలి కదా.. ఏం రాస్తారో.. ఎలా పాసవుతారో (హైదరాబాద్) -బి.రాకేశ్

2014 Best Images - Sakshi
55/93

పిల్లకోతి ఇక లేవదని తల్లికి తెలియదు. అయినా తల్లిప్రేమ కదా. చేతుల్లోకి ఎత్తుకొని దూరంగా తీసుకెళ్లి బతికించుకునే నిష్ఫలయత్నం(హైదరాబాద్) -ఎం.రవికుమార్

2014 Best Images - Sakshi
56/93

ట్యాంక్బండ్పై పోలీసు కార్ల పరేడ్(హైదరాబాద్) -పి.మోహనాచారి

2014 Best Images - Sakshi
57/93

మేమూ ఓటు వేశాం.. మొదటిసారి ఓటు వేసిన ఆనందం(హైదరాబాద్) -పి.మోహనాచారి

2014 Best Images - Sakshi
58/93

పట్టణాలన్నీ పల్లెలకు పయనమైన వేళ.. సర్వే కోసం జనం ఉరుకులు పరుగుల పయనం.. బస్సుపైన కూడా కిక్కిరిసిన జనం.. తప్పదు కదా.. రూఫ్ పైనే టికెట్లు ఇస్తే గానీ బస్సు కదలదు కదా.. (హైదరాబాద్) -బి.రాకేశ్

2014 Best Images - Sakshi
59/93

మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లూకున్నా పొదరిల్లూ నాదీ.. అల్లిబిల్లి అల్లికలో గిజిగాడి సాటిలేని నైపుణ్యం(వరంగల్ జిల్లా మల్లారెడ్డిపల్లె) -పి.వరప్రసాద్

2014 Best Images - Sakshi
60/93

రంగురంగుల జాతర.. బీరమ్మ జాతర(వరంగల్) --పి.వరప్రసాద్

2014 Best Images - Sakshi
61/93

ముగ్గురు పసిపిల్లలు ఇంక్యుబేటర్లో.. ఆవల దిగాలుగా అమ్మ కళ్లలో ఆందోళన.. మనసులో బెంగ.. ఈరాత్రి తెలవారుతుందా! పసికూనల్ని ఆప్యాయంగా తడుముతానా!(వరంగల్) --పి.వరప్రసాద్

2014 Best Images - Sakshi
62/93

తరగతి గది వంటగది అయింది.. పుస్తకాలు బెంచీలపైన.. విద్యార్థులు ఆరుబయట.. వంట అవ్వాలి.. తినాలి.. తర్వాత పుస్తకాలు తెరవాలి.. చదువు గట్టెక్కుతుందా!(వరంగల్ జిల్లా గిర్మాజిపేట) --పి.వరప్రసాద్

2014 Best Images - Sakshi
63/93

గుండెలు పిండేసే కన్నీటికష్టం. పడిన శ్రమంతా వర్షపునీటిలో కొట్టుకుపోతే కన్నీటి ధారల ముందు జడివాన చిన్నబోయింది. దేవుడా.. (వరంగల్ మార్కెట్ యార్డు) - పి.వరప్రసాద్

2014 Best Images - Sakshi
64/93

రంజాన్ శోభను సంతరించుకున్న చార్మినార్(హైదరాబాద్) -జి.రాజేష్

2014 Best Images - Sakshi
65/93

స్పందించే హృదయానికి మతం ఉండదు.. మనసు ఉంటుంది. రెండు చేతులు లేని అభాగ్యుడకి దానిమ్మగింజలను తినిపిస్తున్న మనసున్న మనిషి (హైదరాబాద్) -జి.రాజేష్

2014 Best Images - Sakshi
66/93

చెరువులో ప్రసూతివార్డు కాదు.. ప్రసూతివార్డులో వాననీరు(నల్గొండ) - కె.భజరంగప్రసాద్

2014 Best Images - Sakshi
67/93

కడుపునిఒండా తాగి హాయిగా బజ్జోమ్మా.. మన జాతులకు వైరమే కానీ మనకు కాదు(నల్గొండ) - కె.భజరంగప్రసాద్

2014 Best Images - Sakshi
68/93

ఆక్రమిస్తున్న సూర్యుణ్ని తన రెండు చేతులతో నిలిపివేయాలని చూస్తున్నట్టుగా లేదూ.. ఈ విద్యుత్ స్తంభం(కడప) - టి.రమేష్

2014 Best Images - Sakshi
69/93

అందరికీ అందమైన దుస్తులు అందించే నేతన్న.. చీకిపోయిన చితికిన బతుకు(నల్గొండ) - కె.భజరంగప్రసాద్

2014 Best Images - Sakshi
70/93

రెక్కాడితే గానీ డొక్కాడని రైతు.. ఎద్దుల జత లేకపోతే వ్యవసాయం ఎలా సాగేది.. తప్పదు.. ఎలాగో అలాగ బ్రతుకుబండి నడవాల్సిందే.. (నల్గొండ జిల్లా చర్లగౌరారం) - కె.భజరంగప్రసాద్

2014 Best Images - Sakshi
71/93

పైన శివాలయం.. కోనేటిలో ఆలయ ప్రతిరూపం(ఛాయా సోమేశ్వరాలయం, నల్గొండ) - కె.భజరంగప్రసాద్

2014 Best Images - Sakshi
72/93

సాయంకాలం సాగరతీరం... పున్నమి వెన్నెల వెండి కాంతులు చిమ్ముతుంటే నెచ్చెలి తోడుంటే కాలంఅలా పరిగెత్తదా (హైదరాబాద్) - జి. బాలస్వామి

2014 Best Images - Sakshi
73/93

'రోడ్ కింగ్'.. నా సవారికి అందరూ ఆగాల్సిందే. బతుకు పాఠాలు ఇప్పటినుంచే నేర్చకుంటున్న ఆత్మవిశ్వాసం(హైదరాబాద్) - జి. బాలస్వామి

2014 Best Images - Sakshi
74/93

బడబానలం దహించివేస్తే తిరుమలగిరులు అగ్నికీలలుగా మారిపోయాయి. అల్లరి చేష్టలకి విలువైన వృక్ష సంపద, పక్షులు, వన్యమృగాలు బూడిదగా మిగిలాయి(తిరుమల)- మోహనకృష్ణ

2014 Best Images - Sakshi
75/93

కోనేటిరాయుడి కొలువు కొలనైంది. వానదేవుడి పలకరింతలో తిరుమలగిరులు తడిసి ముద్దయిన సుందరదృశ్యం(తిరుమల)- మోహనకృష్ణ

2014 Best Images - Sakshi
76/93

ఎంత లేత వయసు.. ఎంత రాక్షసత్వం.. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన వయసు.. రోడ్డు పక్కన గారడీలో మాయమైపోతే ఎంత కష్టం. గుండెగదుల్లో ఆందోళన నరనరాన పాకితే చూడటానికి కనులు నిరాకరించేంత భయం.. ఆ లేతమనసు ఏమరుపాటున ఉంటే.. చిన్న పొరపాటు దొర్లితే.. ఆలోచనంతా తరువాత తనవైపు ఎగురుకుంటూ వచ్చే చిల్లరనాణాలపైనే కదా! (హైదరాబాద్) -ఆర్.లావణ్యకుమార్

2014 Best Images - Sakshi
77/93

గణేశ్ నిమజ్జనం ఎంత ఘనంగా జరిగినా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనమే ఉత్సవాలకు శోభ, ఆకర్షణ (హైదరాబాద్) -ఆర్.లావణ్యకుమార్

2014 Best Images - Sakshi
78/93

రాష్ట్రాలు వేరు.. సమస్యలు బోలెడు.. కాసేపు కలిసి నవ్వుదాం..(హైదరాబాద్) -ఆర్.లావణ్యకుమార్

2014 Best Images - Sakshi
79/93

నవ్వుల రాజు, తెలుగు చిత్రసీమ మన్మధరాజు.. ఇద్దరూ గుండెలు పొగిలిపొగిలి ఏడ్చినవేళ(హైదరాబాద్) -ఆర్.లావణ్యకుమార్

2014 Best Images - Sakshi
80/93

చాలీచాలని బస్సులు.. కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటం. ఉరకలు వేసే వయసు.. వెనకాముందూ చూసుకోని తొందరపాటు.. వెరసి ప్రతిరోజూ ప్రతిరోజూ ప్రయాణం ఒక యజ్ఞం(హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్) - సోమసుభాష్

2014 Best Images - Sakshi
81/93

గాలిలో తేలిపోయే ఉత్సాహం.. అంబరాన్ని చుంబించే ఆనందం(హైదరాబాద్ కోఠి మహిళా కళాశాల 90వ వార్షికోత్సవ సంబరం) - సృజన్ పున్నా

2014 Best Images - Sakshi
82/93

అసలే ఎండాకాలం.. అందులోనూ అనంతపురం.. గొంతు తడిస్తే కానీ ప్రాణం లేచి రాదుకదా! -జి. వీరేశ్

2014 Best Images - Sakshi
83/93

జాగ్రత్తగా వెళ్లండి తల్లీ.. ఇంటర్ పరీక్షలు ముగిసిన ఆనందంలో సొంత ఊళ్లకు పరుగు తీస్తున్న విద్యార్థినులకు హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ ప్రేమపూర్వక వీడ్కోలు(హైదరాబాద్) - ఎం.రవికుమార్

2014 Best Images - Sakshi
84/93

బడిగంట కొట్టారోచ్.. ఇక ఇంటికి పరుగో పరుగు.. అమ్మచేతి గోరుముద్దలు తినాలి కదా(హైదరాబాద్)

2014 Best Images - Sakshi
85/93

మంచు పరుచుకున్నట్టుగా లేదూ.. హైదరాబాద్లోని ఓ పాఠశాలలో దృశ్యమిది

2014 Best Images - Sakshi
86/93

ఓటు వేయాల్సిందే.. శరీరం సహకరించకపోయినా... రాళ్లు తేలిన దారి ఇబ్బంది పెడుతున్నా.. (కర్నూలు) - డి.హుస్సేన్

2014 Best Images - Sakshi
87/93

కరువు ముంచేసింది. మబ్బుల దాగుడుమూతలో వర్షపు చినుకు జాడలేక నిరాశగా (కర్నూలు) - డి.హుస్సేన్

2014 Best Images - Sakshi
88/93

కష్టానికి కరిగిపోయిన చేతిగీతలు పింఛనుకు అనర్హురాలిని చేస్తే కరకు గుండెల అధికారదర్పం పదేపదే వెనక్కి పంపిస్తే వెక్కివెక్కి ఏడుస్తున్న అవ్వకు దిక్కెవరు(కర్నూలు) - డి.హుస్సేన్

2014 Best Images - Sakshi
89/93

మెరుపుతీగల పందిరి అల్లుకున్న ఆకాశం(విశాఖపట్నం) - షేక్ నవాజ్

2014 Best Images - Sakshi
90/93

గజ్జె గల్లుమంటుంది. డప్పు హృదయ స్పందనని పెంచుతుంది. లయ కాళ్లకి నాట్యం నేర్పుతుంది. తప్పెటగుళ్లు అంటేనే మరో లోకంలో విహరింపజేస్తుంది.(విశాఖపట్నం శిల్పారామం) - షేక్ నవాజ్

2014 Best Images - Sakshi
91/93

లక్షకోట్ల బడ్జెట్ను శాసించే 'సమత' బ్లాక్. అధికారులు తిరగడానికి విలాసవంతమైన కార్లు. నవడానికి కాళ్లులేని అభాగ్యులు మాత్రుం ఇలా వెళ్లాల్సిందే. చక్రాల కుర్చీలు కూడా సమకూర్చలేని నిర్లక్ష్యపు వ్యవస్థపైన ఏవాన కురవాలో!(హైదరాబాద్) - మహ్మద్ రఫీ

2014 Best Images - Sakshi
92/93

బురద కూడా మంచిదే.. ఎందుకంటే బురద పూసుకోవడాన్ని కూడా పండగ చేసుకోవచ్చు(హైదరాబాద్లో ఒక రిసార్టులో మడ్ ఫెస్టివల్) - సృజన్ పున్నా

2014 Best Images - Sakshi
93/93

నమాజ్ కోసం నేను కూడా(రంజాన్ రోజు హైదరాబాద్లో

Advertisement
Advertisement