Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Victory In AP Assembly Elections says Majority Exit Polls 2024
వైఎస్సార్‌సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్‌), చాణక్య (పార్థదాస్‌) తేల్చాయి. జాతీ­య, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టు­లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించా­యి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్‌ నిర్వహించే సర్వే, ఎగ్జిట్‌ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్‌ పోల్, పోస్ట్‌ పోల్‌ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేను ఆరా మస్తాన్‌ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్‌ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్‌ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్‌సీపీ, 10–12 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్‌ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్‌ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పా­రు. ఎన్‌డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవు­తుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్‌ చాణక్య, పోల్‌ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్‌ లాబొరేటరీ, జన్మత్‌ పోల్, సీపీఎస్‌ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీ విజ­యం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్‌ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసు­కుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయ­మ­ని క్యూ మెగా అమేజీ పొలిటికల్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఖాదర్‌ ఖాన్‌ పఠాన్‌ తెలిపారు. 22 పార్లమెంట్‌ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వ­చ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివా­­రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా, ఎన్‌డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్‌ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్‌ఎక్స్, దైనిక్‌ భాస్కర్‌ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్‌డీటీవీ, న్యూస్‌–18 వంటి జాతీ­య మీడియా సంస్థలు ఎన్‌డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్‌డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్‌డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.

Sakshi Editorial On Exit polls 2024
విజయం సరే... విలువలు?

ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్‌ తత్త్వవేత్త హెగెల్‌ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్‌ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్‌ మార్క్స్‌ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్‌ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్‌ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్‌ ది స్టేట్‌’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్‌ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్‌లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్‌ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్‌ హాబ్స్‌ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్‌ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్‌లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌... చార్‌ సౌ పార్‌’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్‌ సౌ పార్‌’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ప్రమోట్‌ చేయలేదు. మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్‌ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్‌ వెల్లడించారు. పండిత్‌ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్‌ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్‌ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్‌ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్‌స్టన్‌ చర్చిల్, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, మార్టిన్‌ లూథర్‌కింగ్, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, అడాల్ఫ్‌ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్‌ మండేలా, పండిత్‌ నెహ్రూ, మదర్‌ థెరిసా, మార్గరెట్‌ థాచర్‌ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్‌ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్‌ శక్తులన్నీ కలిసి ప్రమోట్‌ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్‌ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్‌ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్‌ ట్రిలియన్‌ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్‌ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్‌ సౌ పార్‌’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

AP Elections 2024: 2nd June Political Updates In Telugu
June 2nd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

June 2nd AP Elections 2024 News Political Updates..8:15 AM, June 2nd, 2024ఫ్యాన్‌దే హవా.. ఏపీలో వైఎస్సార్‌సీపీ దెబ్బకు చేతులెత్తేసిన కూటమివైఎస్సార్‌సీపీ భారీ విజయమని తేల్చిన ఎగ్జిట్‌పోల్స్‌వైఎస్సార్‌సీపీ గెలుపు లోడింగ్‌.. విజయం లాంఛనమే ఏపీలో వైయస్‌ఆర్‌సీపీకి మళ్లీ తిరుగులేదని తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్🔥జగనన్న దెబ్బకి చేతులెత్తేసిన కూటమి జూన్ 4న వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఇక లాంఛనమే#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/coTiCq7yz9— YSR Congress Party (@YSRCParty) June 1, 2024 Times Now- @ETG_Research #ExitPoll PredictionsAndhra Pradesh (Total Seats: 25) | Here are seat share projections:- YSRCP: 14- BJP+: 11- Congres : 0- Others: 0@padmajajoshi further takes us through vote share predictions. pic.twitter.com/6R9hAcNQiA— TIMES NOW (@TimesNow) June 1, 2024 8:00 AM, June 2nd, 2024వైఎస్సార్‌సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణఅసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణ94–104 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ‘ఆరా’ మస్తాన్‌50% ఓట్లతో 110–120 స్థానాల్లో ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టిస్తుందని చాణక్య పార్థదాస్‌ వెల్లడివైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని తేల్చిన ఆత్మసాక్షి, జన్మత్, ఆపరేషన్‌ చాణక్య, అగ్నివీర్, పోల్‌ స్ట్రాటజీ గ్రూప్, రేస్‌ తదితర సంస్థలులోక్‌సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా సంస్థలువైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫాలజిస్ట్‌లపై టీడీపీ ఒత్తిళ్లుఒత్తిడి తట్టుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ 7:30 AM, June 2nd, 2024పోస్టల్‌ బ్యాలెట్లపై భద్రం ఏజెంట్లూ.. అవి అత్యంత కీలకం.. లెక్కింపులో జాగ్రత్తలు తప్పనిసరి ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్‌ కేంద్రాలకు రావాలి ఆర్‌వో టేబుల్‌ మీద లెక్కింపు చెల్లుతుందో లేదో నిర్ధారించాకే లెక్కింపు చేపట్టాలి 13ఏ డిక్లరేషన్‌పై ఓటరు సంతకం, అటెస్టింగ్‌ సంతకం తప్పనిసరి అనుమానం వస్తే వెంటనే ఆర్వోకి ఫిర్యాదు చేయాలి 7:00 AM, June 2nd, 2024ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీకి సానుకూలత : సజ్జలసీఎం జగన్‌ పాజిటివ్‌ ప్రచారం ఎన్నికల్లో బాగా పనిచేసింది: సజ్జల మహిళా ఓటర్లు మా వైపే నిలబడ్డారని స్పష్టమైంది ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో పెద్దపీట 4న కౌంటింగ్‌లో మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి సొంతంగా పోటీ చేసే శక్తి లేకనే చంద్రబాబు పొత్తులు పోస్టల్‌ బ్యాలెట్‌పై బాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తాం 6:30 AM, June 2nd, 2024మళ్లీ వైఎస్సార్‌సీపీదే విజయంవైఎస్‌ జగన్‌ పాలన వైపు మహిళలు, గ్రామీణులు, బలహీన వర్గాల మొగ్గు వైఎస్సార్‌సీపీ తన ఓటు శాతాన్ని ఐదేళ్ల తర్వాత కూడా కాపాడుకుంది 94 –104 సీట్లు వైఎస్సార్‌సీపీకి.. 71 – 81 సీట్లు టీడీపీ కూటమికి వైఎస్సార్‌సీపీకి 13–15 ఎంపీ స్థానాలు.. టీడీపీ కూటమికి 10–12 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు బీజేపీ 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్‌ 7–8 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా సర్వే రిపోర్టు ఇచ్చానన్న ఆరా మస్తాన్.

USA vs CAN: Canada Navneet Dhaliwal Score 1st Fifty In T20 WC 2024
T20 WC: తొలి హాఫ్‌ సెంచరీ ‘మనోడి’దే!.. కెనడా భారీ స్కోరు

క్రికెట్‌ చరిత్రలో అతి పురాతన సమరంగా అమెరికా, కెనడా మధ్య పోరుకు గుర్తింపు ఉంది. ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇదే నిజం. 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగినా... దానికి చాలా ఏళ్ల క్రితమే అంటే 1844లో మూడు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌లో అమెరికా, కెనడా తలపడినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇక 180 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా, కెనడా మధ్య టి20 వరల్డ్‌ కప్‌లో పోటీ పడుతున్నాయి. ఇరు జట్లకు టి20 వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం. డాలస్‌కు ఈ మ్యాచ్‌ వేదిక. ఈ నేపథ్యంలో స్థానికంగా క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో మార్కెటింగ్‌ నిపుణులు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్యాడ్‌లు, బ్యాట్‌తో ‘స్కోర్‌ ఫోర్‌’ అని రాసి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ బొమ్మ ముద్రించిన టీ షర్ట్‌లను అమ్ముతున్నారు.పీజే గోడ్‌హాల్స్‌ అనే ఔత్సాహిక వ్యాపారి, క్రికెట్‌ అభిమాని ఈ మ్యాచ్‌ వేదికపై అమ్మకానికి ఉంచాడు. 1849లో చికాగో, మిల్‌వాకీ నగరాల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌కు లింకన్‌ అతిథిగా హాజరయ్యారు. కెనడా భారీ స్కోరుటీ20 ప్రపంచకప్‌ తొమ్మిదో ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా యూఎస్‌ఏతో తలపడుతున్న కెనడా భారీ స్కోరు సాధించింది. డలాస్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. కెనడా బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో ఆరోన్‌ జాన్సన్‌(16 బంతుల్లో 23) రాణించగా.. నవనీత్‌ ధాలివాల్‌ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ 44 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)తొలి హాఫ్‌ సెంచరీతద్వారా టీ20 వరల్డ్‌కప్‌-2024లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా నవనీత్‌ రికార్డు సాధించాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ పగ్రాత్‌ సింగ్‌(5) నిరాశ పరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన నికోలస్‌ కిర్టాన్‌ (31 బంతుల్లో 51) అర్ధ శతకంతో రాణించాడు.ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ మొవ్వా 32 పరుగులు చేసి దిల్లాన్‌ హేలిగెర్‌(1)తో కలిసి నాటౌట్‌గా నిలవగా.. దిల్‌ప్రీత్‌ సింగ్‌ 11 రన్స్‌ స్కోరు చేశాడు. ఈ క్రమంలో కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. యూఎస్‌ఏ బౌలర్లలో అలీ ఖాన్‌, హర్మీత్‌ సింగ్‌, కోరె ఆండర్సన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.చండీగఢ్‌లో జన్మించిఅక్టోబరు 10, 1988లో పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించాడు నవనీత్‌ ధాలివాల్‌. అనంతరం కెనడాకు మకాం మార్చిన 35 ఏళ్ల ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.. గతంలో కెనడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)

Weekly Horoscope 2 June 2024 To 8 June 2024 In Telugu
ఈ వారంలో ఈరాశివారికి అనుకోని లాభాలు.. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి!

మేషం:దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కే సమయం. ఒక ముఖ్య∙సమాచారం అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది. వాహనయోగం. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలలో లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.వృషభం:ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఇతరులకు కూడా సహాయపడతారు. కాంట్రాక్టులు అనూహ్యంగా పొందుతారు. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాల వారు సంస్థల ఏర్పాటు దృష్టి సారిస్తారు. వారం చివరిలో అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. హనుమాన్‌ చాలీసా పఠించండి.మిథునం:ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల కల ఫలించే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. అప్పులు తీరతాయి. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. అయితే కొంత భారం తప్పదు. కళారంగం వారి కృషి ఫలించే సమయం. వారం చివరిలో కుటుంబసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం:పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. అంచనాలు నిజం కాగలవు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభం. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.సింహం:చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు. భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వాహనయోగం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. అప్పులు సైతం తీరుస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో కొన్ని మారుμలు ఉంటాయి. పారిశ్రామికవర్గాల వారు.పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కన్య:కార్యజయం. బంధువర్గం నుంచి శుభవర్తమానాలు. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. రుణబా«ధల నుంచి విముక్తి లభిస్తుంది. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. కళారంగంవారికి కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఎరుపు, పసుపు రంగులు. గణపతిని పూజించండి.తుల:ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. దాతృత్వాన్ని చాటుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారం. బాకీలు కొన్ని వసూలై అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికరంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.వృశ్చికం:కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగే సమయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి ఏర్పడి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాల వారు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఆదిత్యుని పూజించండి.ధనుస్సు:దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆత్మీయులు సహాయసహకారాలు అందిస్తారు. వాహనాలు , భూములు కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగార్ధుల యత్నాలలో కొంత అనుకూలత ఉంటుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి.విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. బంధువులతో తగాదాలు. పసుపు, బంగారు రంగులు. సత్యనారాయణస్వామికి అర్చన చేయించుకుంటే మంచిది.మకరం:చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు ఆదరణ పొందుతారు. కొన్ని సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత చికాకులు . రావలసిన సొమ్ము అందుతుంది. బాకీలు తీరుస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. కొన్ని పదవులు దక్కించుకుంటారు. వారం మధ్యలో ధననష్టం. కుటుంబసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కుంభం:కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. బంధువులతో లేనిపోని విభేదాలు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఇతరులనుంచి రావలసిన సొమ్ము కొంత ఆలస్యమవుతుంది. వ్యాపారాలలో నిదానం అవసరం. లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని పనిభారం మరింత పెరిగి సతమతమవుతారు. కళారంగం వారికి కాస్త నిరాశ తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, గులాబీ రంగులు. హనుమాన్‌ చాలీసా పఠించండి.మీనం:వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆశయాలు సాధనలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. రావలసిన బకాయిలు అందుతాయి. చేతినిండా సొమ్ము ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. మిత్రులతో స్వల్వ వివాదాలు. నీలం, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Sikkim And Arunachal Pradesh Assembly Poll Counting Updates
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: భారీ లీడింగ్‌లో బీజేపీ

Counting Updates అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్‌ పీపుల్స్‌ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్‌ ఫిగర్‌ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ( ఎన్‌పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌​ అరుణాల్‌( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్‌ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్‌Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ( ఎన్‌పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌​ అరుణాల్‌( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్‌ ఒక స్థానంలో లీడింగ్‌Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) ఒక స్థానంలో లీడింల్‌ ఉంది. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో కౌంటింగ్‌ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ) పవన్‌కుమార్‌ సైన్‌ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్‌ యాక్షన్‌ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్‌ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు.

Govt clarification on certificates issued by driving centres
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత

గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్‌ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్‌ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్‌ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది.

Exit Poll 2024: Narendra Modi-led NDA set for hattrick with 355-370 seats
Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్‌

ఎన్డీఏ హ్యాట్రిక్‌ ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజా రిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. బీజేపీ యూపీలో స్థానాలను పెంచుకోవడంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని కర్ణాటకలో హవా కొనసాగించడమే గాక బెంగాల్లో చొచ్చుకుపోతుందని చెప్పాయి. కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి 150 మార్కు దాటొచ్చని తెలిపాయి. న్యూఢిల్లీ: కేంద్రంలో పాలక ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కూటమి హ్యాట్రిక్‌ కొట్టడం, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. శనివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగుస్తూనే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లువెత్తాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని వాటిలో చాలావరకు పేర్కొన్నాయి. కర్నాటకలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని, పశ్చిమబెంగాల్లో మరింతగా చొచ్చుకుపోతుందని వెల్లడించడం విశేషం. బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో మాత్రం ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గుతాయని అంచనా వేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విపక్షాల అవకాశవాద రాజకీయాలను జనం పూర్తి గా తిరస్కరించారన్నారు. వాస్తవ ఫలితాల్లో తమకు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి వస్తాయని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్‌ మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ను మోదీ ప్రభావితం చేశారని ఆరోపించింది. వాస్తవ ఫలితాలు చాలా భిన్నంగా రాను న్నాయని విశ్వాసం వెలిబుచి్చంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడిక అందరి కళ్లూ జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరిగాక రాబోయే అసలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఏ సర్వే ఏం చెప్పింది...? ఇండియాటుడే–మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఎన్డీఏకు 361 నుంచి 401 స్థానాలిచి్చంది. ఇండియా కూటమికి 131 నుంచి గరిష్టంగా 166 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 368 దాకా వస్తాయని రిపబ్లిక్‌ భారత్‌–మారై్టజ్‌ సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి 133, ఇతరులకు 48 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 392 దాకా, ఇండియాకు 161, ఇతరులకు 20 దాకా రావచ్చని జన్‌ కీ బాత్‌ అభిప్రాయపడింది. ఎన్డీఏకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న మేరకు 401 స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ అంచనా వేయడం విశేషం. ఇండియా కూటమికి 139, ఇతరులకు 38 స్థానాలు రావచ్చని తెలిపింది. టుడేస్‌ చాణక్య కూడా కూడా ఎన్డీఏకు 385 నుంచి ఏకంగా 415 సీట్లిచి్చంది! ఇండియా కూటమి 96 నుంచి 118 మధ్య సాధిస్తుందని పేర్కొంది. న్యూస్‌ నేషన్‌ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 స్థానాలిచి్చంది. దైనిక్‌ భాస్కర్‌ ఎన్డీఏ కూటమికి 350 దాకా, ఇండియా కూటమికి గరిష్టంగా 201, ఇతరులకు 49 సీట్లిచి్చంది. రిపబ్లిక్‌ టీవీ సర్వేలో ఎన్డీఏకు 359, ఇండియాకు 154, ఇతరులకు 30 స్థానాలొచ్చాయి. ఏబీపీ న్యూస్‌–సీ వోటర్‌ ఎన్డీఏకు 353–383, ఇండియాకు 152 నుంచి 182 సీట్లిచ్చింది. ఎన్డీఏకు 371, ఇండియాకు 125 రావచ్చని ఇండియా న్యూస్‌ పేర్కొంది. టైమ్స్‌ నౌ–ఈటీజీ సర్వే ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 స్థానాలిచ్చింది. రాష్ట్రాల్లో ఇలా... కేంద్రంలో అధికార సాధనకు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంటోందని సర్వేలన్నీ తెలిపాయి. బీజేపీకి యూపీలో ఏకంగా 67 సీట్ల దాకా రావచ్చని ఇండియాటుడే వెల్లడించింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్లకే పరిమితమవుతాయని తెలిపింది. కర్నాటకలో ఈసారి కూడా బీజేపీకి 23, భాగస్వామి జేడీ(యూ)కు 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పశి్చమబెంగాల్లోనైతే పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ను తోసిరాజని 23 నుంచి 27 స్థానాలతో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో అతి పెద్ద పారీ్టగా అవతరించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఇండియాటుడే అయితే బెంగాల్లో బీజేపీకి 30 పై చిలుకు, తృణమూల్‌కు 11 నుంచి 12 స్థానాలివ్వడం విశేషం. కీలకమైన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సీట్లు 2019తో పోలిస్తే కాస్త తగ్గి 30 నుంచి 32 దాకా రావచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఒడిశాలోనైతే 21 సీట్లకు గాను ఎన్డీఏకు ఏకంగా 18 నుంచి 20 వస్తాయని, అధికార బిజూ జనతాదళ్‌ ఒకట్రెండు సీట్లకు మించబోదని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. దక్షిణాదిన కేరళలోనూ తొలిసారి కమలవికాసం ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. అక్కడ బీజేపీకి 3 సీట్ల దాకా ఖాయమని పేర్కొన్నాయి. లెఫ్ట్‌ ఫ్రంట్‌ కుదేలవుతుందని, కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు వస్తాయని తెలిపాయి. రాజస్తాన్, బిహార్లలో ఎన్డీఏకు ఐదారు స్థానాలు తగ్గి ఆ మేరకు ఇండియా కూటమికి పెరగవచ్చని పేర్కొన్నాయి. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడమే గాక మెజారిటీ లోక్‌సభ స్థానాలూ నెగ్గుతుందని కొన్ని ఎగ్జిట్‌ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమని మరికొన్ని పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ లోక్‌సభ స్థానాలొస్తాయని తెలిపాయి.2019లో ఏం జరిగింది?2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీఏ గెలుస్తుందనే జోస్యం చెప్పాయి. మొత్తం 13 ఎగ్జిట్‌ పోల్స్‌ సగటును చూస్తే ఎన్డీఏకు 306, యూపీఏకు 120 సీట్లొస్తాయని పేర్కొన్నాయి. చివరికి ఎన్డీఏకు 353 స్థానాలు రాగా యూపీఏ కేవలం 93 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు రాగా కాంగ్రెస్‌ కేవలం 53 సీట్లు నెగ్గింది.

Telangana Lok Sabha Elections Exit Poll 2024 Live Updates
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: ఊహించని ఫలితాలు

తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్‌ఎస్‌ కు నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్‌ సర్వేఆరా మస్తాన్‌ సర్వే ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం​.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్‌ లాబొరేటరీపోల్‌ లాబొరేటరీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. కాంగ్రెస్‌ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్‌ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్‌ స్టార్ట్‌ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్‌ చాణక్య ఆపరేషన్‌ చాణక్య ప్రకారం.. కాం‍గ్రెస్‌ 7, బీజేపీ 8, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాటైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్‌ 5-8, బీఆర్‌ఎస్‌ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్‌ సర్వే అయితే కాంగ్రెస్‌, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్‌ 24న్యూస్‌ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్‌ఎస్‌కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది.

Directors and Producer Hit Combination Repeat in Tollywood
లెక్క కుదిరింది

కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ (డైరెక్టర్‌)కి, షిప్‌ ఓనర్‌ (ప్రోడ్యూసర్‌)కి మధ్య మంచి రిలేషన్‌ ఉండాలి. షిప్‌ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్‌ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్‌ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్‌ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌ గురించి తెలుసుకుందాం. ‘దిల్‌’ రాజు, అనిల్‌ రావిపూడిమూడోసారి ‘దిల్‌’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్‌’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్‌ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో సుప్రీమ్‌ (2016), ‘రాజా ది గ్రేట్‌’ (2017), ‘ఎఫ్‌ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్‌ 3’ (2022) వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్‌–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్‌ హీరో. హిట్‌ చిత్రాలు ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్‌ సుకుమార్‌–మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్‌–మైత్రీ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్‌–నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2: ది రూల్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.∙సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్‌ హీరోగా నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సునీల్, రామ్మోహన్‌ రావు, శేఖర్‌ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌), అమిగోస్‌ క్రియేషన్స్ పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్‌ నారంగ్, రామ్మోహన్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్‌లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ (2021) సూపర్‌ హిట్టయింది. నాగ్‌ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్‌ బేనర్‌లో నాగ్‌ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్‌ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి రెండు హోమ్‌ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్‌ ఉన్నాయి. అశ్వినీదత్‌ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్‌ అశ్విన్‌ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్‌ అశ్విన్‌. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘సార్‌’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్‌ జంటగా సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌లో తాజాగా ‘లక్కీ భాస్కర్‌’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్‌ కానుంది. శ్రీకాంత్‌ చెరుకూరి, శ్రీకాంత్‌ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్‌ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్‌ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్‌లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్‌లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్‌ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్‌’ చిత్రం తర్వాత డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని–పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్‌ హీరో, హీరోయిన్లుగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘ఈగల్‌’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్‌–విశ్వప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటిస్తున్న ‘మిరాయ్‌’లో మంచు మనోజ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్‌ 18న రిలీజ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్‌ కానుంది. ప్రశాంత్‌ వర్మ, నిరంజన్‌ రెడ్డిఈసారి ‘జై హనుమాన్‌’తో...సంక్రాంతి అంటే స్టార్‌ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం ‘హనుమాన్‌’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అయింది. ఇక ‘హనుమాన్‌’కి సీక్వెల్‌గా ప్రశాంత్‌ వర్మ–చైతన్య–నిరంజన్‌ రెడ్డి కాంబినేషన్‌లో ‘జై హనుమాన్‌’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్‌ కూడా రిపీట్‌ అవుతున్నాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement