Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishnareddy Counter To Amit Sha
‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’

సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు చెప్పిందే కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ధర్మవరం సభలో మాట్లాడారని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం(మే5) సజ్జల మీడియాతో మాట్లాడారు.‘పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని అమిత్‌ షాకు తెలుసు. కూటమిలో పార్ట్‌నర్‌ కాబట్టే అమిత్‌ షా ధర్మవరంలో ఏదో మాట్లాడారు. పోలవరాన్ని టడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు?  కేంద్రం సరిగ్గా నిధులిస్తే పోలవరం రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది. పోలవరాన్ని సీఎం జగన్‌ పూర్తిచేసి చూపిస్తారు. ఆ శక్తి సీఎం జగన్‌కు ఉంది.  పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్‌ రివర్స్ టెండరింగ్‌ ద్వారా రూ.850 కోట్లు ఆదాచేశారు. కేంద్రం ముందుగానే నిధులను ఇస్తే సీఎం జగన్ ఎప్పుడో పోలవరాన్ని పూర్తి చేసేవారు. రూ.12 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించినా కేంద్రం నిధులివ్వలేదు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు వల్ల జరిగిన నష్టాల్లో ఇది కూడా ఒకటి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా నివ్వకుండా ఆపుతున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై  తప్పుడు ప్రచారం..ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి చంద్రబాబు, పవన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కడుపులో ఇంత కుట్రలు ఉన్నందునే ఒళ్లంతా బాబు రోగాలతో ఉన్నాడు. చెత్తబుట్టలో,మురికిగుంటలో ఉండే క్రిములలాగా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడ ఇలాంటి చట్టం వస్తే రామోజీ అక్రమాలన్నీ బయటపడతాయి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం వ్యవహారంలో చంద్రబాబు మీద సీఐడీ కేసు పెట్టటం హర్షనీయ పరిణామం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌  యాక్ట్‌  భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందితప్పుడు ప్రచారాలు చేసే వారికి ఇదొక హెచ్చరికగా ఉండాలి.దోషులను సీఐడీ వెంటనే అరెస్టు చేయాలి.ఇంగ్లీషు మీడియం అనేది సంపన్నవర్గాలకే పరిమితం చేయాలని బీజేపీ కూడా చూస్తోంది. అందుకే అమిత్ షా కూడా చంద్రబాబు తరహాలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టటం వల్ల తెలుగుకు ఎక్కడైనా నష్టం జరిగిందా’ అని సజ్జల ప్రశ్నించారు.టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన సజ్జలల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్‌ని  మెచ్చుకున్న  పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి వీడియోని బయటపెట్టిన అనంతరం సజ్జల ఏమన్నారంటే..ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణచంద్రబాబు రాజకీయ వ్యభిచారి అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి?ల్యాండ్ టైటలింగ్ లాంటి పవిత్రమైన  చట్టంపై బురద టీడీపీ నేతలు బురద చల్లారు2019 జులై 29వ తేదిన అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటలింగ్ చట్టానికి మద్దతు ఇచ్చిందిల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ దొంగ నాటకం బయట పడిందిప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై బురద చల్లుతున్నారుపయ్యావుల కేశవ్ అసెంబ్లి వేదికగా టీడీపీ తరఫున లాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కు మద్దతు తెలిపారుచట్టానికి టీడీపీ పూర్తిగా మద్దతు తెలిపింది5 కొట్ల మందిని భయబ్రాంతులకు గురి చేసేలా టీడీపీ వ్యవరించింది.టీడీపీ నేతల లాంటి నీచులు రాజకీయ వ్యభిచారులు  ఎవరైనా ఉంటారా.?వెలుగులోకి వచ్చిన వీడియోతో టీడీపీ అస్సలు నగ్న స్వరూపం బయట పడింది.రాష్ట్ర ప్రజలు అందరికీ టీడీపీ గురించి తెలియాలిచంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ అనడానికి ఇదే ఉదాహరణటీడీపీది దంధ్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలిబిల్లుకు అసెంబ్లీలో నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే రద్దు చేస్తాను అంటున్నావ్రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .సంజాయిషీ ప్రజల ముందుకు చంద్రబాబు వెళ్ళాలి.పురంధరేశ్వరి బీజేపీలో లేదు టీడీపీ ఏజెంట్ గా ఉంది.దేశం అంతా బీజేపీ ఒకలా ఉంటే ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది?  

Sakshi Guest Column On AP CM YS Jagan
జగన్‌ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...

పేదరికం అత్యంత బాధాక రమైనది. ప్రపంచంలో అత్యధి కులు పేదవారే. వారిని పేద రికం నుండి బయట పడేయ గలదీ, అభివృద్ధి వైపు నడప గలిగేదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే. దీనిని అర్థం చేసుకొన్నారు కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు. ఇప్పుడు మరోమారు ప్రజా సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల బరిలో దిగారు. పలు పబ్లిక్‌ మీటింగులూ, సుదీర్ఘ రాజకీయ యాత్రలతో విజయం వైపు నడుస్తున్నారు.ఇక ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మాత్రం అభద్రతా భావంతో ఎన్నికల్లో నానా తిప్పలు పడుతున్నారు. చెప్పుకోవడానికి ప్రజలకు తాను చేసింది ఏమీ లేదు కాబట్టి జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్ర చారాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. జనసేన – బీజేపీ నాయకులూ, ఆ యా పార్టీల పరిస్థితీ కూడా ఇదే. అందుకే, టీడీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా మరలా ఓడిపోవడం తథ్యం. పెన్షనర్లలో 90 శాతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతున్న 40–60 ఏళ్ల వయస్సు స్త్రీలలో 90 శాతం, డ్వాక్రా మహిళల్లో 80 శాతం, మొత్తంగా స్త్రీలలో 90 శాతం వైఎస్సార్‌సీపీకే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్‌లు, ముస్లింలు, రెడ్లు, బ్రాహ్మణులు, అత్యధిక మంది బీసీలు వైఎస్సార్‌సీపీకే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కొంతమంది మధ్యతరగతి అర్బన్‌ ఓటర్లు మాత్రమే టీడీపీ కూటమికి ఓట్లు వేస్తారని అంటున్నారు. కాంగ్రెస్‌కు గతం కంటే అర శాతం మాత్రమే ఓట్లు పెరగవవచ్చు.అయోధ్యలో గుడి నిర్మాణం, కొన్ని జాతీయ రహదారులను నిర్మించడం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏపీకి సంబంధించి... ఏపీకి స్పెషల్‌ స్టేటస్, రాయలసీమ – ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, పోల వరానికి  ని«ధులు వంటి అనేక వాగ్దానాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు. ఇదీ బీజేపీ క్రెడిబిలిటీ!జVýæన్‌ మాత్రం పేదల ముఖ్య అవసరాల్ని తీరుస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు. పేదల కొనుగోలు శక్తిని కోవిడ్‌ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా పెంచగలిగారు. అందుకే 2019లో 12 శాతం ఉన్న పేదరికం 2024 నాటికి దాదాపు 4 శాతానికి తగ్గిపోయింది. జీఎస్టీ చెల్లింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు జగన్‌. జగన్‌ ప్రభుత్వం పేదలకు డీబీటీ కింద రూ. 2,70,000 కోట్లను, నాన్‌–డీబీటీ కింద ఇండ్లు, స్థలాలు వంటి రూపాల్లో రూ. 1,00,000 కోట్లకు పైగా ఇచ్చారు. మొత్తంగా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్‌ ప్రభుత్వం. అంతేగాక పాలనా వ్యవస్థలో, సంక్షేమ సేవల్లో, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచేట్లు చేశారు వైఎస్‌ జగన్‌. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ, ఆరోగ్య శ్రీకి రూ. 25 లక్షల వరకూ ప్రభుత్వ సాయాన్ని పెంచడం, వృద్ధాప్య పింఛన్‌ను రూ. 3 వేల వరకు పెంచడం, స్త్రీ సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం; రాజకీయాల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టుల్లోనూ... మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం; వలంటీర్‌ వ్యవస్థ, రైతుభరోసా, ఉచిత పంటల భీమా, ఆక్వా రైతులకు తక్కువ ధరకు విద్యుత్, అమూల్‌ ద్వారా ఎక్కువ పాల ధర ఇవ్వడం, భూముల సర్వే, భూపట్టాల ధ్రువీకరణ, నాడు – నేడుతో పాఠశాలల రూపు మార్చడం, ఇంగ్లీష్‌ మీడియం విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యా కానుక... ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మనసులను జగన్‌ దోచుకున్నారు.మరి చంద్రబాబు ఇలాంటి వేటినీ చేపట్టలేదు. ఇలాంటివి ఏ ఒక్కటీ చేశానని ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ప్రతి ఎన్నికలప్పుడూ పలు పథకాల్ని ప్రకటించడం, ఎన్నికలు అయిపోయాక వాటి అమలు మరచిపోవడం చేసేవారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల విషయంలో మాట్లాడ కూడని మాటలు మాట్లాడేవారు. అందుకే ఆయన జనంతో సంబంధాల్ని మానసికంగా కోల్పోయారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయక పోవడం, పొదుపు సంఘాలకు రుణమాఫీ అమలు పరచక పోవడం, కొత్తగా జన్మించిన ఆడబిడ్డకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఇస్తానన్న డబ్బు ఇవ్వక పోవడం, ఇంటింటికీ ఒక ఉద్యోగం – ఉద్యోగం ఇవ్వలేకుంటే నెలకు రూ. 2 వేలు ఇస్తానని ఇవ్వక పోవడం; పేదలకు మూడు సెంట్ల నేల, ఇల్లు, బీసీలకు సబ్‌ ప్లాన్, స్త్రీ రక్షణ ఫోర్స్‌ ఏర్పాటు, పసుపు–కుంకుమ పథకం లాంటి వాటిని అమలు చేయకుండా జనాన్ని మోసగించారు. విద్యను, వైద్యాన్ని వ్యాపారీకరణ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వైఫల్యాలు ఎన్నో!బాబు ఘోర వైఫల్యం చెందిన అనంతరం పరి పాలనా పగ్గాలు చేపట్టిన జగన్‌ ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు చేశారు. అందుకే తాను ఏదైనా మేలు చేశానని నమ్మితేనే తనకు ఓటు వేయమని ఆయన ధైర్యంగా ప్రజలను అడుగు తున్నారు.ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర శాఖవిశ్రాంత ఆచార్యులు ‘ 98495 84324

Sakshi Editorial On Mayabazar Movie Summer
వేసవి అభ్యాసం

‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్‌’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్‌.ఆర్‌. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్‌’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్‌’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్‌ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్‌’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు.  తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్‌ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్‌’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్‌... నమో నమః 

Kolkata Knight Riders Beat by LSG 98 runs
ల‌క్నోను చిత్తు చేసిన కేకేఆర్‌.. 98 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌-2024లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 98 ప‌రుగుల తేడాతో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో కేకేఆర్ త‌మ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్న‌ట్లే. కేకేఆర్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో 16.1 ఓవర్లలో 137 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా మూడు వికెట్ల ప‌డ‌గొట్ట‌గా.. ర‌స్సెల్ రెండు, స్టార్క్‌, న‌రైన్ చెరో వికెట్ సాధించారు. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిష్‌(36) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లు ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ ప్ర‌దర్శ‌న చేయ‌లేక‌పోయారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్‌(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్‌(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్‌, యుద్దవీర్‌, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. 

Dk Shivakumar Slaps Congress Worker Again
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్‌

బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన దురుసుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి డీకే వెళ్లారు. అక్కడ కారు దిగగానే ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు.దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్‌ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ వీడియో కాంగ్రెస్‌ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డీకే పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి.  — BJP Karnataka (@BJP4Karnataka) May 5, 2024

​​Harish Rao Counter To Rahulgandhi Nirmal Meeting Comments
రాహుల్‌ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్‌(ట్విటర్‌)లో హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 

Blue corner notice issued against Prajwal Revanna
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్‌ నోటీసులు

బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూ కార్నర్‌  నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్‌ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్‌ రేవణ్ణ ఎక్కడ  ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్‌  ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్‌ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్‌ నోటీసు పంపాలని సిట్‌(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్‌.. ప్రజ్వల్‌ రేవణ్ణపై రెండుసార్లు లుక్‌ అవుట్‌ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్‌ కేసులో ప్రజ్వల్‌ తండ్రి హెడ్‌డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినవి వైరల్‌ అయిన  అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్‌, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్‌ నోటీసులు అంటే?బ్లూ కార్నర్‌ నోటీసు ఇంటర్‌ పోల్‌  నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా  నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్‌, ఎల్లో, బ్లూ, బ్లాక్‌, గ్రీన్‌, ఆరెంజ్‌, పర్పుల్‌. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి  సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్‌ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్‌’ నోటీసులు జారీ చేస్తారు.

Land Titling Act: Cid Investigation On Tdp Fake Campaign
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌.. టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ

సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్‌ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్‌సీపీ  ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్‌ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్‌ సెల్‌) అడిషనల్‌ డీజీకి అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరీంధర ప్రసాద్‌ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్‌ కాల్స్‌ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్‌ చేయగానే.. ‘వైఎస్‌ జగన్‌ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్‌ కాజేస్తాడు, ఒరిజినల్స్‌ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్‌ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్‌ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులను వైఎస్సార్‌సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తన ఫిర్యాదులో కోరింది        ‌              

Samantha Ruth Prabhu Shocking Pic Trending In Twitter
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?

ఉన్నఫలంగా హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఓ మహిళ నగ్నంగా ఉన్న ఫొటోని వైరల్ చేస్తున్న నెటిజన్స్.. ఇందులో ఉన్న సమంతనే అంటున్నారు. ఈ ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలేం జరిగింది?హీరోయిన్‌గా స్టార్ హోదా అనుభవించిన సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని మూడేళ్ల క్రితం బయటపెట్టింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, దాన్ని నుంచి కోలుకోవడానికి అవసరమైన చికిత్సలు తీసుకుంటోంది. కొన్నాళ్ల క్రితం అమెరికా కూడా వెళ్లొచ్చిందని అన్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)తాజాగా సమంత.. 'ఫార్ ఇన్ఫ‍్రారెడ్ సౌనా' అనే చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ ఇన్ స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. అలానే దీని వల్ల ఎలాంటి  ఉపయోగాలు ఉంటాయనేది కూడా రాసుకొచ్చింది. ఇదే టైంలో సమంత.. నగ్నంగా ఉన్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అది ఇదేనంటూ ఓ పిక్ వైరల్ చేశారు.అయితే ఇందులో ఎవరో ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అది సమంతనా కాదా అనేది మాత్రం తెలియలేదు. మెడలో ఉన్న చైన్ ఒక్కటే అని అంటున్నారు. కానీ ఆ ఫొటో ఫేక్ అని సామ్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో అసలు నిజమేంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

Fake Surveys By Outdated Journalists On Ap Elections
కొత్త పగటివేషగాడు వచ్చాడు

ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ? అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు. దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్‌ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి  బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి. --సిమ్మాదిరప్పన్న-- 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all