Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Ola Cabs Ceo Hemant Bakshi Quits In Three Months
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్‌ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం.  దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్‌ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్‌ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్‌ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్‌ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

కావ్యా మారన్‌ (PC: IPL)
ఎంత పనిచేశావు కమిన్స్‌!.. కావ్య రియాక్షన్‌ వైరల్‌

పవర్‌ హిట్టింగ్‌తో దుమ్ములేపుతూ ఐపీఎల్‌-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్‌ కమిన్స్‌ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో చిత్తైంది.చెపాక్‌ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్‌ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్‌ చేసేది సన్‌రైజర్స్‌ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్‌ సాగింది. Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్‌ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్‌ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ సహ యజమాని కావ్యా మారన్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్ 98 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్‌ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్‌ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.కానీ సన్‌రైజర్స్‌ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్‌ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా.. ఆఫ్‌ కట్టర్‌గా సంధించగా..  గైక్వాడ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.బంతిని అందుకున్న కమిన్స్‌ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్‌ రెండు పరుగులు తీసుకుని సింగిల్‌ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్‌ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.pic.twitter.com/eBuDpO6WgK— Cricket Videos (@cricketvid123) April 28, 2024

శివం దూబే (PC: IPL.com)
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్‌ కూడా కాదనలేడు!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(98), డారిల్‌ మిచెల్‌(52)తో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్‌పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్‌-2024లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే తరఫున మిడిలార్డర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్‌కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్‌ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్‌మెంట్‌ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్‌ ఆడే బ్యాటర్‌ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ.  

SC stays CBI probe against Bengal officials teachers recruitment case
సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట

ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా  రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  సవాల్‌ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌లో  అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు  ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్‌ చేయటం గమనార్హం.

IPL 2024 Dc vs KKR: Delhi capitals won the toss elected to bat First
ఢిల్లీతో ​మ్యాచ్‌.. కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్‌ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్‌ స్టార్క్‌, వైభవ్‌ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్ 

Bjp Is Scared Of Mulayam Family, Shivpal Yadav Claimed
ములాయం సింగ్‌ కుటుంబం అంటే బీజేపీకి భయం

దివంగత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తరుణంలో శివపాల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్‌పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు.  శివపాల్ యాదవ్‌కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్‌ యాదవ్‌ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మెయిన్‌పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్  స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్‌కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. 

Amit Sha Helicopter Just Missed Crashing
అదుపుతప్పిన అమిత్‌ షా హెలికాప్టర్‌.. నేలను తాకబోయి...

పాట్నా: కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాకు పెద్ద ప్రమాదం తప్పింది. షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతుండగా అదుపుతప్పి నియంత్రణ కోల్పోయింది. బిహార్‌లోని బెగుసరాయ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు సోమవారం(ఏప్రిల్‌29) ఈ ఘటన జరిగింది.ప్రచారం ముగించుకుని అమిత్‌ షా హెలికాప్టర్‌ ఎక్కారు. హెలికాప్టర్‌ గాల్లోకి లేచే సమయంలో ఊగిసలాడి కుడివైపుకు వెళ్లింది. ఒక దశలో కిందకు వచ్చి నేలను తాకే దాకా వెళ్లింది. ఇంతలో అప్రమత్తమైన హెలికాప్టర్‌ను పైలట్‌ నియంత్రణలోకి తీసుకోవడంతో సరైన దిశలో ప్రయాణించింది. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.— Dr. Abhishek Verma (@AbhishekVermaX) April 29, 2024

Kuldeep yadav Fighting knock, Delhi Capitals post 153 runs total in 20 overs
కుల్దీప్‌ యాదవ్‌ ఫైటింగ్‌ నాక్‌.. కేకేఆర్‌ టార్గెట్‌ ఎంతంటే?

ఐపీఎల్‌-2024లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆఖరిలో స్పిన్నర్‌ కుల్దీప్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడడటంతో ఢిల్లీ.. 150 ప్లస్‌ మార్క్‌ను దాటగల్గింది. 26 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్‌.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌దే టాప్‌ స్కోర్‌ కావడం విశేషం. కెప్టెన్‌ పంత్‌ రిషబ్‌ పంత్‌ 27 పరుగులతో పర్వాలేదన్పించాడు.ఇక కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్‌ ఆరోరా, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా కేకేఆర్‌ బౌలర్లు ఎక్స్‌ట్రాస్‌ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు. 

CM Jagan Campaign Schedule in three constituencies in 30th april
సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్‌ ఇదే..

సాక్షి,  గుంటూరు:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 30వ తేదీన(మంగళవారం) మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం జగన్‌ రేపు(మంగళవారం) పాల్గొనే ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను విడుదల చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు  ఒంగోలు పార్లమెంట్ పరుధిలో  కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు  నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో  జరిగే  ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

IPL 2024: Kolkata Knight Riders beat Delhi Capitals by 7 wickets
ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్‌

ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయభేరి మోగించింది.154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(33), వెంకటేశ్‌ అయ్యర్‌(26) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. విలియమ్స్‌ఒక్క వికెట్‌ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్‌ కుల్దీప్‌ యాదవ్‌(35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్‌ ఆరోరా, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా కేకేఆర్‌ బౌలర్లు ఎక్స్‌ట్రాస్‌ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement