Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm Jagan Speech In Kanigiri Public Meeting
చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు: సీఎం జగన్‌

సాక్షి, ప్రకాశం జిల్లా:  ఒక్క నెల ఓపిక పట్టండి.. మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా.. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు.‘‘రూ.వెయ్యి పెన్షన్‌ను రూ.3వేలు చేసింది మీ బిడ్డ జగన్‌. 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్‌ ఇచ్చాడు.. మీ బిడ్డ జగన్‌.. 66 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాడు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ ఇస్తున్నాం. చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్‌ అడ్డుకున్నాడు. బాబు హయాంలో పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సివచ్చేది. చంద్రబాబు చేసిన పనివల్లే అవ్వాతాతలు ఎండలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు.. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పెన్షన్లు ఇచ్చాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ పంపించాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.‘‘పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకు అన్యాయం జరిగింది. ఆ నెపాన్ని కూడా దుర్మార్గ చంద్రబాబు మనపై నెడుతున్నాడు. పెన్షన్ల విషయంలో రాజకీయం జరుగుతోంది. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. పెంచిన అమ్మ ఒడి. మీ  జగన్‌ అధికారంలో ఉంటేనే.. కాపునేస్తం, ఈబీసీ నేస్తం. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. రైతు భరోసా, సున్నావడ్డీ. చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు. అప్పుడే సూపర్‌ సిక్స్‌లో పెన్షన్‌ హామీని ఎత్తేశాడు. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమే.. లకలకా లకలకా అంటూ పసుపుపతి రక్తం తాగుతాడు’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.         

Australia World No1 Crown in Tests India Remains No1 in ODIs T20Is
ICC: నంబర్‌ వన్‌గా ఆసీస్‌.. అందులో మాత్రం టీమిండియానే టాప్‌

ఐసీసీ మెన్స్‌ టీమ్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్‌ వన్‌ ర్యాంకు సొంతం చేసుకుంది.ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 టైటిల్‌ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్‌ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్‌ ర్యాంకు పదిలంగా ఉంది.పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మెన్స్‌ టీమ్‌ టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌-51. ఆస్ట్రేలియా- 124 రేటింగ్‌ పాయింట్లు2. ఇండియా- 120 రేటింగ్‌ పాయింట్లు3. ఇంగ్లండ్‌- 105 రేటింగ్‌ పాయింట్లు4. సౌతాఫ్రికా- 103 రేటింగ్‌ పాయింట్లు5. న్యూజిలాండ్‌- 96 రేటింగ్‌ పాయింట్లు.మెన్స్‌ టీమ్‌ వన్డే ర్యాంకింగ్స్‌ టాప్‌-51. ఇండియా -122 రేటింగ్‌ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్‌ పాయింట్లు3. సౌతాఫ్రికా- 112 రేటింగ్‌ పాయింట్లు4. పాకిస్తాన్‌- 106 రేటింగ్‌ పాయింట్లు5. న్యూజిలాండ్‌- 101 రేటింగ్‌ పాయింట్లుమెన్స్‌ టీమ్‌ టీ20 ర్యాంకింగ్స్‌ టాప్‌-51. ఇండియా- 264 రేటింగ్‌ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్‌ పాయింట్లు3. ఇంగ్లండ్‌- 252 రేటింగ్‌ పాయింట్లు4. సౌతాఫ్రికా- 250 రేటింగ్‌ పాయింట్లు5. న్యూజిలాండ్‌- 250 రేటింగ్‌ పాయింట్లుచదవండి: 

Revanna File Petition For Pre Arrest Bail In Bengaluru Court
ముందస్తు బెయిల్‌ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్‌

బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్‌ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్‌ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్‌ స్కాండల్‌) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్‌ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. 

Aa Okkati Adakku Movie Review And Rating In Telugu
ఆ.. ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ

టైటిల్‌: ఆ.. ఒక్కటి అడక్కునటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులునిర్మాత: రాజీవ్‌ చిలకరచన-దర్శకత్వం: మల్లి అంకంసంగీతం: గోపీ సుందర్‌సినిమాటోగ్రఫీ:సూర్యవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే..గణ అలియాస్‌ గణేష్‌(అల్లరి నరేశ్‌) ప్రభుత్వ ఉద్యోగి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్‌ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్‌.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్‌ కానీ.. త్రివిక్రమ్‌ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్‌ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్‌ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్‌ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకపోయాడు. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్‌.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్‌ కానీ.. త్రివిక్రమ్‌ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలిగించాయి.  ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్‌ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్‌ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్‌ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకఓ యాక్షన్‌ సీన్‌తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్‌ హీరో రేంజ్‌లో బిల్డప్‌ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. బీచ్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్‌ మూడ్‌లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్‌ రివీల్‌ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. ఫేక్‌ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్‌ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్‌ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు.  కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్‌ ఉన్నా.. డైరెక్టర్‌ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..అల్లరి నరేశ్‌కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్‌ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్‌ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.  బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్‌ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్‌, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది.  గోపీసుందర్‌ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  

My Heart Bleeds for Woman Molested at Raj Bhavan Says Mamata Banerjee
బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి: మండిపడ్డ మమతా బెనర్జీ

కోల్‌కతా: రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించారని గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిపైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం 'మమతా బెనర్జీ' మండిపడ్డారు.పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో మహిళ వేధింపుకు గురికావడం సిగ్గు చేటు అని అన్నారు. రాజ్‌భవన్‌లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్‌ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదు? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. స్కూల్ సర్వీస్ కమిషన్ కేసులో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా బీజేపీయే కారణమని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఒక మహిళ తనపై వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత టీఎంసీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి కథనాలకు భయపడబోమని.. సత్యం గెలుస్తుందని గవర్నర్ ఆనంద బోస్ అన్నారు.Smt. @mamataofficial strongly condemned the appalling incident in Raj Bhavan!It's deeply disturbing that the same Governor who showed great urgency in reaching Sandeshkhali now stands accused of molesting a female staff member.PM @narendramodi's spent the night there and his… pic.twitter.com/b07DXs1LNp— All India Trinamool Congress (@AITCofficial) May 3, 2024

AP Politics And Election Live Updates May 3rd
AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 3rd May..4:15 PM, May 3rd, 2024కనిగిరి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌ స్పీచ్‌ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపుపొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేబాబుని నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమేలకలకా లకలకా అంటూ పసుపుపతి రక్తం తాగుతాడుచంద్రబాబు హయాంలో పెన్షన్‌ వెయ్యి రూపాయలురూ. వెయ్యి పెన్షన్‌ను రూ. 3 వేలు చేసింది మీ బిడ్డ జగన్‌39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్‌ ఇచ్చాడుమీ బిడ్డ జగన్‌.. 66  లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాడులంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ ఇస్తున్నాంచంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వా తాతలపై పడ్డాయిఎండలో క్యూలో నిలబడి నానా అగచాట్లు పడుతున్నాడుఈ దుర్మార్గ బాబు ఆ నెపాన్ని మనపై వేస్తున్నాడునిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్‌ను అడ్డుకున్నాడుఅవ్వా తాతలు బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేశాడుఅవ్వా, తాతలు ఒక నెల ఓపెక పట్టండిమీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతావాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇస్తారు3:50 PM, May 3rd, 2024175కి 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు: సీఎం జగన్‌ ట్వీట్‌వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్షలేని పాలన కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను… pic.twitter.com/srQcYkFPcd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2024 3:40 PM, May 3rd, 2024కృష్ణాజిల్లా:మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన అల్లరిమూకల దాడిదాడి ఘటన లో జనసేన నాయకుడు కర్రి మహేష్‌తో పాటు మరో ముగ్గురి పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు3:00 PM, May 3rd, 2024కృష్ణాజిల్లా :గన్నవరంలో టీడీపీకి మరో షాక్.గన్నవరం మండల టీడీపీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ మోదుగుమూడి రాజేశ్వరితో పాటు మరో 30 మంది మహిళా కార్యకర్తలు వైసీపీలో చేరిక.పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.2:59 PM, May 3rd, 2024వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడునరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో  సీఎం జగన్‌  ఎన్నికల‌ ప్రచార సభ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన నేరెళ్ల సురేష్‌2:58 PM, May 3rd, 2024కృష్ణాజిల్లాఅవనిగడ్డ మండలం పాతఎడ్లంకలో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశంపాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు, కుమారుడు వికాస్ బాబుసమావేశానికి భారీగా హాజరైన గ్రామస్తులుసింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరిన పాత ఎడ్లంక గ్రామానికి చెందిన 100 కుటుంబాలువారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు2:53 PM, May 3rd, 2024విజయవాడబెజవాడ బార్ అసోసియేషన్ లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఆత్మీయ సమావేశంతూర్పు, పశ్చిమ, సెంట్రల్ అభ్యర్థులు అవినాష్, ఆసిఫ్, వెల్లంపల్లికి మద్దతు తెలిపిన న్యాయవాదులుతమ సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల న్యాయవాదుల హర్షం2:51 PM, May 3rd, 2024తిరుపతి జిల్లా:పిచ్చాటూరు సచివాలయం పరిధిలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాఎంపీడీఓ కార్యాలయానికి వాలంటీర్లు చేరుకొని తమ రాజీనామా పత్రాలను ఏఓ రాధా రాణికి సమర్పించారు.ప్రజలకు అంకిత భావంతో సేవలు  అందిస్తున్న తమను తెలుగుదేశం, జనసేన పార్టీలు తమను కించపరిచే విధంగా మాట్లాడడం జీర్ణించుకోలేక తాము రాజీనామా నిర్ణయం తీసుకున్నాం..వాలంటీర్లుజగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటననరసాపురం రోడ్‌ షోలో సీఎం జగన్‌ కామెంట్స్‌..1:00 PM, May 3rd, 2024పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే.మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్‌ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్‌. బాబు పాలనలో ఇంటికే పెన్షన్‌ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, బైజూస్‌ కంటెంట్‌. ఇంగ్లీష్‌ మీడియంతో అడుగులు సీబీఎస్‌సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. ఆరో తరగతి నుంచే క్లాస్‌రూమ్‌లో డిజిటల్‌ బోధన అందుతోంది. ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్ధులకు బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌. రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం.మీ బిడ్డ జగన్‌.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం.రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిబీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం.పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌. వారిద్దరి వల్లే పెన్షనర్లకు అవస్థలు: మల్లాది విష్ణు12:30 PM, May 3rd, 2024నేటి నుంచి స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి పార్టీ పిలుపునిచ్చిందిప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రమంతా ప్రచారం చేస్తారుఇంటివద్దకే పెన్షన్‌ను సీఎం జగన్ ఐదేళ్ల పాటు అందించారుచంద్రబాబు దుర్భుద్ధితో పెన్షన్లు అందకుండా చేశాడుఈరోజు పెన్షనర్లు బ్యాంకుల వద్ద నానా అవస్థలు పడుతున్నారుఈ పాపం చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లదే.  వంగా గీత గెలుపు ఖాయం: నటి శ్యామల11:50 AM, May 3rd, 2024వైఎస్సార్‌సీపీ నాయకురాలు, సినీ నటి శ్యామలవంగా గీత గెలుపు ఖాయం అయిపోయింది.అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు మిగితా సినిమా వాళ్ళని తీసుకొస్తున్నారు.చాలా సీనియర్ నాయకురాలు వంగా గీత.ఆమెను ఓడించడం ఎవరి వల్ల కాదు.వంగా గీత ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారో అందరికీ తెలుసు.వంగా గీతకు భారీ మెజారిటీ కోసం నేను కూడా ప్రచారం చేస్తున్నాను.పిఠాపురం ప్రజలు అభివృద్ది చేసే వారికి ఓటు వేయండి.ఆ అభివృద్ది సీఎం జగన్, వంగా గీత వల్లనే సాధ్యం.  టీడీపీ నేతల కారణంగానే వృద్దులకు ఇబ్బందులు..10:30 AM, May 3rd, 2024దేవినేని అవినాష్ కామెంట్స్‌..డివిజన్‌లోని ప్రతీ గడపలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారువైఎస్సార్‌సీపీకి ఓటు వేయడానికి సిద్ధం అని ప్రతీ మహిళా చెబుతున్నారుపెన్షన్ కోసం వృద్దుల ఇబ్బందులకు చంద్రబాబు కారణం కాదా?.టీడీపీ నేతల ఫిర్యాదు వలనే నేడు వృద్ధులకు ఇబ్బందులు.ఈనాడును అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే టీడీపీ నేతల లక్ష్యంస్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే ప్రజలు తిరగబడుతున్నారుప్రజలు ఏం తప్పు చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారుటీడీపీ హయాంలో నియోజకవర్గంలో ప్రతీ కాంట్రాక్టు ఎంఎల్ఏ తమ్ముడు రమేష్‌వే కాంట్రాక్టులుకరకట్ట ప్రాంతంలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టింది జగన్ ప్రభుత్వమేరానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం8:30 AM, May 3rd, 2024తాడేపల్లి :రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభంఇంటింటికీ బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారంఐదేళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులుపేదలే వైఎస్సార్‌సీపీ స్టార్ క్యాంపెయినర్లుఇప్పటికే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీవారితో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్న పార్టీ బూత్ కమిటీలుపవన్‌కు పిచ్చి పీక్స్‌లో..7:45 AM, May 3rd, 2024పదవి వస్తుందో రాదో అని పవన్‌కళ్యాణ్‌ నిర్వేదంయువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..వైఎస్సార్‌సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలువిశాఖ ఎన్నికల సభలో పవన్‌కళ్యాణ్‌   హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..7:25 AM, May 3rd, 2024హిందూపురంలో టీడీపీ నేతల దౌర్జన్యంవైఎస్ జగన్ పాటలు పెట్టారన్న కారణంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలుఆసుపత్రికి తరలింపుటీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..7:10 AM, May 3rd, 2024మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్‌ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచార సభమధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానంలోని కనిగిరిలో ప్రచారం.   దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’ నోట్లే7:00 AM, May 3rd, 2024 కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్‌తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనేలెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శిబాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేతతిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠాబరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబుఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్‌అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణఅసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహంమార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికిఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుంపంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటినియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్‌పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే   మోసాల బాబు మరో అబద్ధం..6:50 AM, May 3rd, 2024ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది ఇంటర్‌ విద్యార్థులు మరో 10,52,221 మంది.. ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం  ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు  ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం  పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం    ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రెస్‌ మీట్‌6:40 AM, May 3rd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో  మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు,  అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత  కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల‌కమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల  తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం   చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి6:30 AM, May 3rd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర  ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి

Pm Modi Big Shock To Chandrababu And Pawan Kalyan
కూటమి అంటేనే ఎలపరమబ్బా....

అసలు చేయితగిలితేనే ఒప్పుకోని మనిషి కాలు తగిల్తే ఊరుకుంటుందా ? అసలే ఊరుకోదు... ఇల్లుపీకి పందిరిస్తుంది.. ఊరంతా గాయి గత్తర చేస్తుంది. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది... మ్యానిఫెస్టోలో చంద్రబాబు బాటు పక్కనే తన ఫోటో ఉంచితేనే వద్దన్నా ప్రధాని మోడీ ఇప్పుడు చంద్రబాబు... పవన్ తో కలిసి ప్రచారం చేస్తారా? చేయనే చేయరు. వాస్తవానికి టీడీపీ జనసేన...బీజేపీల ఉమ్మడి మ్యానిఫెస్టో మొన్న విడుదల చేసారు. వాస్తవానికి మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు... సీట్లు కూడా పంచుకుని మరీ బరిలోకి దిగుతున్నపుడు మ్యానిఫెస్టోలో కూడా మూడుపార్టీల ఫోటోలు ఉండాలి.కానీ దీనికి బిజెపి పెద్దలు నో అన్నారని, అందుకే మోడీ పేరు, ఫోటో లేకుండానే కేవలం చంద్రబాబు, పవన్ ఫొటోలతో మ్యానిఫెస్టో విడుదల చేసారు.. ఆ మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేదని, దాని అమలు అనేది వాళ్లదే బాధ్యత అని బీజేపీ తేల్చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం అనేది తుది అంకానికి చేరిన తరుణంలో మోడీ మరోమారు ఆంధ్రాలో ప్రచారానికి వస్తున్నారు. గతంలో వచ్చి  పవన్, చంద్రబాబులతో కలిసి చిలకలూరిపేటలో బహిరంగ సభలో మాట్లాడారు. అప్పుడు కూడా మా ఎన్డీయేను గెలిపించండి అన్నారు తప్ప మాటవరసకు ఐన జగన్ను విమర్శించలేదు... బాబును నెత్తికి ఎత్తుకుని గెలిపించాలని ప్రజలను కోరలేదు. వాస్తవానికి బీజేపీ ఆంధ్రాలో ఆరు లోక్‌సభ ...పది అసెంబ్లీ  స్థానాల్లో పోటీ చేస్తోంది.ఇప్పుడు మళ్ళీ మోదీ రెండోవిడత ప్రచారానికి వస్తున్నారు., ఇందులో భాగంగా 7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వస్తున్నారు.  ఏదో తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి నియియోజకవర్గంలో ని వేమగిరిలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆ తరువాత అదేరోజు సాయంత్రం సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తున్న అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పీలేరులో పాల్గొంటారు... ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు... అదేరోజు రాత్రి రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారువాస్తవానికి ఈ కార్యక్రమాలకు కూటమి భాగస్వాములు అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం హాజరవ్వాలి... కానీ మోడీ తీరు, బిజెపి విధానం చూస్తుంటే అసలు వాళ్లతో మాట్లాడేందుకు సైతం ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదు.. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుపెట్టుకున్నాం తప్ప మాకు వాళ్ళిద్దరంటేనే చిరాకు.. చూస్తుంటేనే ఎలపరం వస్తోంది అన్నట్లుగా ఉన్నారు.. అందుకే ఈ ప్రచార సభల్లో టీడీపీ, జనసేన నేతలు పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మోడీ కూడా కేవలం తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోటనే ప్రచారం చేసేలా టూర్ షెడ్యూల్ రూపొందించారు..-సిమ్మాదిరప్పన్న 

Misa Bharti Comments On Pm Photo On Covid Vaccine Certificates
వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి

పాట్నా: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని  ఫొటోవ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్‌ యాదవ్‌ కుమార్త్‌ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్‌లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా  మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్‌ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్‌ చేశారు. కాగా, ఎన్నికల కోడ్‌ ఉన్నందు వల్లే కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్‌ ఇస్తున్నారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       

TS High Court Verdict Invalidated Election Of BRS MLC Vital
బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు ఊహించని షాక్‌ తగిలింది. విఠల్‌ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెల్లడించింది.కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా దండె విఠల్‌ ఎన్నికపై కాంగ్రెస్‌ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విఠల్‌కు రూ.50వేలు జరిమానా కూడా విధించింది.అయితే, 2022లో ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దండె విఠల్‌ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్‌ విత్‌ డ్రా చేయలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్‌ రెడ్డి ఎన్నికల అనంతరం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్‌లో విఠల్‌ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఇదే సమయంలో ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరోవైపు.. విఠల్‌ లాయర్‌ అభ్యర్థనతో తీర్పును కోర్టు.. నాలుగు వారాలు సస్పెండ్‌ చేసింది. 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all