Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

CM jagan Slams Chandrababu At mydukur Meeting
75 ఏళ్లు వచ్చినా చం‍ద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్‌

సాక్షి, కడప: చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా.. కనీసం పశ్చాతాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు.కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్‌ మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిపెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోమొస్తుందని విమర్శించారు.  మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని దుయ్యబట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేసిన స్కీములేమిటని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రశ్నలడిగితే ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ5కు, దత్తపుత్రుడికి, వదినమ్మకు పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది.  వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్‌కు  కూడా కోపం వస్తోంది. నేను స్కీమ్ల లిస్ట్ చదివితే వాళ్లు నా మీద తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు గడగడా చదవుతున్నారు.జగన్‌ను ఎందుకు చంపకూడదని ఈ బాబు అంటున్నాడు.చంద్రబాబు సంస్కారానికి ఒక నమస్కారం.చేతకాని వాడికి కోపం ఎక్కువ అనే సామేత ఉంది. పేదలకు చేసిన మంచి ఏంటి అంటే సమాధానం లేదు. జగన్‌ను తిడితే ఏం ప్రయోజనమయ్యా చంద్రబాబు. ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి 2014 లో ఇచ్చిన ఎన్నికల వాగ్దాలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు.బాబు కొత్త మేనిఫెస్టోకు విలువ, విశ్వసనీయత లేదు.మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట.. నమ్ముతారా?  వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమం అందిస్తున్నాం.గతంలో ఎప్పుడూలేనన్ని స్కీమ్‌లు తీసుకొచ్చాం.రూ. 2లక్షల 70 వేల కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో వేశాం.2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.నాడు-నేడుతో ప్రభుత్వ  ఆత్రుల రూపురేఖలుర్చాంఅవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్‌..ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన.ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం.రూ. 2 లక్షల 70 వేల కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో వేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌. కాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం.31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కాచెల్లెమ్మల పేరుపై రిజస్ట్రేషన్‌.ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లినక్‌ పెట్టాం.ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ సైతం తీసుకొచ్చాం.పేషెంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం.పేదవారికి అండగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష.కాపు నేస్త,ఈబీసీ నేస్తం, ఆసరా అందిస్తున్నాం.మహిళల రక్షణ కోసం మహిళా పోలీస్‌ స్టేషన్లు.గ్రామ స్వరాజ్యానికి ప్రతీక గ్రామ సచివాలయాలు.క్లాస్‌రూమ్‌లో డిజిటల్‌ బోర్డులు, విద్యార్థుల చేతిలో ట్యాబ్స్‌ కనిపిస్తున్నాయి.వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌పై నొక్కాలి.పేదవాడి భవిష్యత్‌కోసం రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కాలి.175, 175 అసెంబ్లీ, 3\25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.

Team India T20 World Cup Squad Announced
టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ‍ప్రకటన.. స్టార్‌ ఆటగాళ్లకు దక్కని చోటు

కరీబియన్‌ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్‌ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్‌, అర్ష్‌దీప్‌ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్‌పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న  రింకూ సింగ్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపియ్యాడు.  శుభ్‌మన్‌ గిల్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ కూడా ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎం​పియ్యారు.టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రాట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

Telangana SSC Result 2024 Released
TS SSC Results 2024: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఫాస్ట్‌గా రిజల్ట్‌ను చూసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్‌ వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం క్లిక్‌ చేయండిఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 3927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత  సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.  

AP CM YS Jagan Exclusive Interview: Slams Chandrababu And Sharmila Decision
రెండు పార్టీల రిమోట్‌ బాబు చేతిలో.. షర్మిల నిర్ణయం బాధించింది: సీఎం జగన్‌

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడు.. కూటమి ఇస్తున్న హామీలతో మోసపోవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రజలకు పదే పదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇండియా టుడే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయాలపై ఆయన స్పందించారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో మేం పోరాడుతున్నాం. ఈ రెండు పార్టీల రిమోట్లు చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలను ఆయనే నియంత్రిస్తున్నారు.కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న తన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల గురించి సీఎం జగన్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే కాదు ఆమెకు డిపాజిట్లు కూడా దక్కబోవనే విషయం తనను బాధకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు... ఏపీలో నాకు పోటీగా రాజకీయాలు చేసేలా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, షర్మిలను ప్రభావితం చేశారు. నాపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, చనిపోయాక నా తండ్రి..దివంగత మహానేత వైఎస్సార్‌ పేరును  ఛార్జిషీట్‌లో చేర్చిన పార్టీతో ఆమె చేతులు కలిపారు. ఇదంతా ఎంతో బాధ కలిగిస్తోంది. ఎవరు ఏమిటనేది ఈ ఎన్నికల ద్వారా ప్రజలే నిర్ణయిస్తారు.తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపైనా సీఎం జగన్‌ స్పందించారు. ‘‘ఒకరు తప్పు చేశారా? లేదా? అనేది న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి. జైలుశిక్ష పడిందీ అంటే ఏదో తప్పు చేశారనే అర్థం. చంద్రబాబు తప్పు చేశాడనడానికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.Was the stone attack on @ysjagan stage managed as his critics allege? Listen here: https://t.co/1Zdr4cbRBU— Rajdeep Sardesai (@sardesairajdeep) April 29, 2024జగన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగితేనే ఏపీలో సంక్షేమం ఉంటుందని,  అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు, వలంటీర్ల ద్వారా నెలవారీ సామాజిక పింఛన్లు డోర్ డెలివరీ వంటి కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం జగన్‌ ఆ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు. 

Fake Video Row: Amit Shah Hits Out at Congress
కాంగ్రెస్‌ మరింత దిగజారింది: అమిత్‌ షా మండిపాటు

ఢిల్లీ, సాక్షి: రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి పోరాడాలని, అంతేగానీ తప్పుడు వీడియోలతో కాదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. తనపై ఫేక్‌ వీడియో ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయన.. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ రాజకీయాలు మరింత దిగజారిపోయానని మండిపడ్డారు.మంగళవారం ఢిల్లీలో ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీజేపీ 400 సీట్ల లక్ష్యంపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకే గనుక 400 సీట్లు దాటితే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెబుతోంది. కానీ,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాల్లో కోత విధించింది కాంగ్రెస్సే. ఆంధ్రా, కర్ణాటకలో రిజర్వేషన్లపై కోత పెట్టింది.మాకు(బీజేపీ) గత రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కానీ, కాంగ్రెస్‌ మాదిరిగా మేం ఎమర్జెన్సీ విధించలేదు. ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు కోసం ఆ సంపూర్ణ అధికారాన్ని ఉపయోగించాం.  ఈ దఫా బీజేపీ 400 సీట్లు సాధిస్తుంది. ముగిసిన రెండు విడతల ఎన్నికల్లోనే వందకు పైగా సీట్లు వస్తాయని నమ్మకం ఉంది. దక్షిణ భారతంలోనూ బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి అని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ మరింతగా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఫేక్‌ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం బాధాకరం. కాంగ్రెస్‌ కూటమి ఓటమి భయంలో ఉండి పోయాయి. అందుకే అమేథీలోనూ పోటీకి కాంగ్రెస్‌ భయపడుతోంది అని షా అన్నారు. 

South Africa Announce T20 WC 2024 Squad 2 Uncapped Players In
T20 WC: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు ఛాన్స్‌

టీ20 ప్రపంచకప్‌-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్‌ మార్క్రమ్‌ సారథ్యంలో తలపడే టీమ్‌లో అన్రిచ్‌ నోర్జే, క్వింటన్‌ డికాక్‌లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్‌ ఆన్రిచ్‌ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండగా.. వరల్డ్‌కప్‌-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు డికాక్‌.అన్‌క్యాప్ట్‌ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన ఇద్దరు అన్‌క్యాప్ట్‌ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్‌ రికెల్టన్‌, ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌లు ఏకంగా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు.  ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున రికెల్టన్‌ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ తరఫున బరిలోకి దిగిన బార్ట్‌మన్‌ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతున్న పవర్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్‌ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్‌ 3న సౌతాఫ్రికా న్యూయార్క్‌ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.టీ20 ప్రపంచకప్‌-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్‌ మార్క్రమ్‌(కెప్టెన్‌), ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌, గెరాల్డ్‌ కొయోట్జీ, క్వింటన్‌ డికాక్‌, జోర్న్‌ ఫార్చూన్‌, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, అన్రిచ్‌ నోర్జే, కగిసో రబడ, రియాన్‌ రికెల్టన్‌, తబ్రేజ్‌ షంసీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌.ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: నండ్రీ బర్గర్‌, లుంగి ఎంగిడి. 

Orthopedic doctor family deceased In vijayawada
విజయవాడలో విషాదం.. డాక్టర్‌ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..

ఎన్టీఆర్‌, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివిన శ్రీనివాస్‌.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో  ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెష‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.మంగళవారం ఉదయం గురునానక్‌ నగర్‌లోని ఇంట్లో శ్రీనివాస్‌ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్‌ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది.  దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్‌ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అ‍న్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్‌ బాక్స్‌లో డాక్టర్‌ శ్రీనివాస్‌ పేరిట ఒక లెటర్‌ దొరికింది. దీంతో ఇది సూసైడ్‌ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్‌ తానూ ఆత్మహత్యకు పాల్పడి   ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు 

Ileana Comments On South Indian Movie Chance
అలాంటి 'దర్శకనిర్మాతల' వల్లే తెలుగులో ఛాన్సులు రాలేదు: ఇలియానా

'దేవదాసు'లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు  దగ్గరైన ఇలియానా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్‌ హీరోయిన్‌గా కొనసాగింది.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్‌లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో మళ్లీ మెరిసింది. సౌత్‌ ఇండియా చిత్రాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. ఇక్కడ ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా ఓపెన్‌గానే చెప్పింది.2012లో ఇలియానాకు బాలీవుడ్‌లో నటించేందుకు అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఇలియానా ఇలా చెప్పింది. 'అనురాగ్‌ బసు' దర్శకత్వం నుంచి 2012లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయానికి దక్షిణాదిలో చాలా సినిమాలతో బిజాగా ఉన్నాను. కానీ 'బర్ఫీ' కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదలుకోవాలనిపించలేదు. నా అంచనా నిజమైంది. సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ వార్తతో ఇక సౌత్‌ ఇండియాలో నేను సినిమాలు చేయనని అందరూ భావించారు. ఆపై నేను బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయ్యానని కూడా అనుకున్నారు. ఈ కారణంతో దక్షిణాది నిర్మాతలతో పాటు దర్శకులు కూడా నా పట్ల ఆసక్తి చూపించలేదు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఏ సినిమా అయినా సరే చాలా నిజాయితీగా నేను పనిచేశాను. కానీ నాకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ విషయంపై ఇన్నేళ్లైనా నాకు క్లారిటీ రాలేదు. దో ఔర్ దో ప్యార్, తేరా క్యా హోగా లవ్లీ వంటి బాలీవుడ్‌ చిత్రాలతో ఏడాదిలో ఇలియానా నటించింది.

India T20 WC 2024 Squad: BCCI Jay Shah To Meet For Final Call On Selection
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్‌.. అతడిపై వేటు తప్పదా?

టీ20 ప్రపంచకప్‌-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్‌లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్‌ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్‌మెంట్‌కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ ఫిట్‌నెస్‌, వికెట్‌ కీపర్‌ ఎంపిక గురించి మేనేజ్‌మెంట్‌ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్‌ చేస్తే అదనపు పేసర్‌ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్‌నెస్‌ దృష్ట్యా బౌలర్‌గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్‌ కీపర్‌ కోటాలో రిషభ్‌ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్‌ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్‌ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్‌ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్‌ స్లాట్‌లో రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్‌ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం ఈ విషయంలో జైస్వాల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది.

India slams USA media linking RAW officer to Pannun plot unwarranted
పన్నూ హత్యకు కుట్ర.. యూఎస్‌ మీడియా రిపోర్డును ఖండించిన భారత్‌

ఢిల్లీ: అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూను హత్యచేసేందుకు భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రణాళికా రచించాడని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించిన నివేదికను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత రా(RAW)మాజీ అధికారి విక్రమ్‌ యాదవ్‌ అమెరికాలో గురుపత్వంత్ సింగ్‌ను హత్య చేయాలని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారని వాషింగ్టన్‌ పోప్ట్‌ తన రిపోర్టులో తెలిపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్ స్పందించారు. ‘వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్‌, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు.  ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ అని అ‍న్నారు. ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తాకు  సీసీ-1 అనే పేరు తెలియని  అధికారి సాయం చేసినట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్‌పోస్ట్‌ ఆ అధికారిని  విక్రమ్‌ యాదవ్‌గా గుర్తించింది. ఈ కేసులో అమెరికా తరచూ చేస్తున్న ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్‌ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement