Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm Jagan May 3 Election Campaign Schedule ongole narasaraopeta
సీఎం జగన్‌ నేటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారానికి సంబంధించిన ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురామ్‌ ‌విడుదల చేశారు. సీఎం జగన్‌ నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం స్టీమెర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట  పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో  పామురు బస్ స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

Jagan Kosam Siddham YSRCP Taking Manifesto To Every House
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో

గుంటూరు, సాక్షి: పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల  ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా  ఉంటున్నాయి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్‌ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్‌ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు   మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్‌ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్‌ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్‌ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎ‍స్సార్‌సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్‌ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన.  దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని  వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

Top leaders of national parties coming for Telangana
హస్తిన ‘దండు’యాత్ర

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. జాతీయ పార్టీల ఢిల్లీ నేతలు తెలంగాణ గల్లీలకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో దూకుడుగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు మార్లు రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అగ్రనేతలు ఆదివారం నుంచి విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు ఖరారయ్యాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాందీ, ప్రియాంకా గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయా పార్టీల నేతలు తెలిపారు. మరో వైపు రాష్ట్రంలో కీలకమైన బీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కూడా ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఆదివారం నుంచి మొదలు.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు తగినట్టుగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ నేతలు గత నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చారు. పోలింగ్‌కు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోమారు ముందుకు వస్తున్నారు. ప్రధాని మోదీ 8, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి.. బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 5న అమిత్‌షా, ఆరో తేదీన జేపీ నడ్డా వస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరిలలో అమిత్‌ షా... పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండల్లో నడ్డా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ నుంచీ అతిరథ మహారథులు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తెలంగాణలో ప్రియాంకా గాంధీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని.. వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను ప్రచారానికి తీసుకురావాలని టీపీసీసీ భావించింది. కానీ ఇతర రాష్ట్రాల ప్రచార షెడ్యూల్‌ కారణంగా సాధ్యం కాలేదు. అయితే పోలింగ్‌ సమీపిస్తున్న సమయంలో ఈ నెల 6, 7 తేదీల్లో ఆమె నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 6న ఎల్లారెడ్డి, తాండూరు, సికింద్రాబాద్‌.. 7న నర్సాపూర్, కూకట్‌పల్లిలలో ప్రియాంక ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మరోవైపు 5వ తేదీన నిర్మల్, గద్వాలల్లో పర్యటించనున్న రాహుల్‌గాందీ.. 9న కరీంనగర్, సరూర్‌నగర్‌ సభల్లో ప్రసంగించనున్నారు. వీరితోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎన్నికల ప్రచారానికి హాజరవుతారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్‌ షెడ్యూల్‌ యథాతథం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన 48 గంటల నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. దీంతో ఆయన శుక్రవారం రాత్రి నుంచే తిరిగి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. గతంలో రూపొందించిన షెడ్యూల్‌కు అనుగుణంగానే ఈ నెల 10వ తేదీ వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఈనెల 10న సిరిసిల్లలో రోడ్‌ షో, సిద్ధిపేటలో బహిరంగ సభతో ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగుస్తుందని వెల్లడించాయి.   

Sakshi Guest Column On CM YS Jagan Govt
సాంఘిక విప్లవ నాయకుడు

ఎన్నికల ప్రచారంలో జగన్‌మోహన్‌ రెడ్డికి లభి స్తున్న అపూర్వ ప్రజా స్పందనను చూస్తుంటే...  తెలుగు రాష్ట్రాలను ఇంతవరకూ పాలించిన ముఖ్యమంత్రులెవరికీ ఇంతటి ప్రజాదరణ లేదని పిస్తోంది. దీనికంతటికీ ఆయన ప్రజల కోసం చేసిన పనులే కారణం అన్నది స్పష్టం.  ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సంక్షేమ పథకా లను ప్రవేశపెట్టి వాటిని అవసరమున్న ప్రజలకు అందజేయడం మంచి పాలకుల లక్షణం. మధ్య దళారుల వ్యవస్థ లేకుండా వారికి అందజేయవలసిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసి అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసిన ఘనత జగన్‌దే. ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనమైన ‘ప్రజల యొక్క, ప్రజల కొరకు. ప్రజల చేత’ పాలన సాగించడం జగన్‌ సాధించిన అద్భుత విజయం. గ్రామ వలంటీర్‌  వ్యవ స్థను ప్రవేశపెట్టి ప్రజల ముంగిట్లోకి పాలనను, ప్రభుత్వ పథకాలను చేరేట్టు చేయడం మరో గొప్ప విజయం. కార్పొరేట్‌ శక్తులు, రాజకీయ అహంభావ నిరంకుశ శక్తులను మినహాయిస్తే... జగన్‌ వల్ల లాభపడని ఒక్క కుటుంబమూ ఆంధ్రప్రదేశ్‌లో కనబడదు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిన కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా... పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్లమాధ్యమ విద్యను అందిస్తున్న ఘనత జగన్‌దే. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కార్పొరేట్‌ విద్యను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించడం ఏపీలోనే కనిపిస్తున్నది. ఇది ప్రభుత్వ విద్యా విధానానికీ గౌరవం కల్పించడంతోపాటూ బహుజన వర్గాలకు పట్టాభిషేకం చేయడం లాంటిదే. సామాజిక న్యాయం తద్వారా సామాజిక మార్పుకు దోహదం చేసే అందరికీ ఉచిత కార్పొరేట్‌ విద్య, ఉచితౖ వెద్యం, పాలనా రంగంలో బహుజన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం లాంటివన్నీ ఈ ఐదేళ్ళ పాలనలో సాగాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఎన్నికల ప్రచారానికి జగన్‌ ఎక్కడికి వెళ్ళినా అసంఖ్యాక జనం! మండుటెండ ల్లోనూ రోడ్లపై నిలబడి ఎదురుచూస్తూ నీరాజనాలు!!బసవేశ్వరుడు, నారాయణగురు, రవిదాస్‌ చమార్, పెరియార్‌ రామ స్వామి, ఫూలే, అంబేడ్కర్‌ లాంటి తత్త్వవేత్తలను చూశాము. జాషువా లాంటి సాంఘిక విప్లవ కవులను చూశాము. సాహు మహరాజ్‌ లాంటి సామాజిక విప్లవ పాలకులను చూశాము. నెహ్రూ లాంటి సెక్యులర్, సెమీ సోషలిస్ట్‌ నాయకులను చూశాము. జగన్‌ ఐదేళ్ల పాలన వీళ్లందరి సమాహారంగా కనిపిస్తోంది. అందుకే ఏపీలో సామాజిక మార్పుల దిశగా బలమైన పునాదులు పడి గుణాత్మక మార్పులు వస్తున్నాయి.  అయితే టీడీపీ–జనసేన–బీజేపీల కూటమికి జగన్‌ పాలన నచ్చడంలేదు. ఆయనపై అసత్య ప్రచారంతో దాడి చేస్తోంది. తమ అసంబద్ధ మేనిఫెస్టోతో ప్రజ లను మభ్యపెడుతోంది. జగన్‌ మాత్రం ఐదేళ్ళలో తాను చేసిన పనులను నమ్ముకొనే ప్రజాస్వామిక పద్ధతిలో ప్రచార రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు జగన్‌ మరోసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌ సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నమ్మి జగనన్ననే అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్‌కు లభిస్తున్న జనాదరణను సహించలేక ఆయన్ని భౌతికంగా తొలగించాలనుకునే రాజకీయ దివాలాకోరుతనాన్ని ప్రతిపక్షాలు ప్రదర్శించడం శోచనీయం. ఎవరెన్ని దాడులు చేసినా, రాజనీతిని రాజభీతిగా మార్చినా జగన్‌ విజయాన్ని ఆపలేవు. ఎందుకంటే జగన్‌  ‘సెక్యులరిజం, సోషలిజం’ భావాలను హృదయానికి హత్తుకొని అన్ని వర్గాల, అన్ని వర్ణాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం ప్రజాస్వామిక పాలనను అందిస్తున్న సాంఘిక విప్లవ నాయకుడు!!డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ కథారచయిత ‘ 91829 18567

Old People Problems For Pension Due To Chandrababu Conspiracies
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు

ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా  బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు... అయన వచ్చి డబ్బులిస్తే మందులు... పప్పు ఉప్పు...సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు... చేతిలోకి పైసలు పడలేదు... ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం.. ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ )లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. కొన్నాళ్లపాటు ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు మూసేస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు..మగ నంగనాచి చంద్రబాబు..ఊళ్లలో కొంతమంది నంగనాచి లేడీస్ ఉంటారు.. వాళ్ళో గదిలో మొగుణ్ణి చావచితక్కొట్టి మళ్ళీ వీధుల్లోకి వచ్చి.. అయ్యో నా మొగుడు నన్ను చంపేసినాడమ్మో... నా మొగుడు.. కొట్టీసినాడమ్మో అంటూ వీధిలోకి వచ్చి వీరంగం వేస్తారు... ఇప్పుడు చంద్రబాబు సైతం మగ నంగనాచి పాత్రలో జీవిస్తున్నారు... మార్చి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్షన్లు అందించే వాలంటీర్లను కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు అయ్యో వృద్ధులు అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తే అది సీఎం వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశం అవుతుంది కాబట్టి.. ఆ డోర్ డెలివరీకి ఆపాలంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబుకు వెనువెంటనే విషయం అర్థమైంది. ఏప్రిల్లో ఇలాగే ఎండల్లో లబ్ధిదారులు బ్యాంకులు.. సచివాలయాలు వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకుంటూ... చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు.. దీంతో ఇదేదో తనకు వ్యతిరేకత అయ్యేలా ఉందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదంతా జగన్ కుట్ర అని, పెన్షన్లు ఎగ్గొట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఎదురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ మేలో కూడా మరింత మండుతున్న ఎండల్లో వృద్ధులు మళ్ళీ బ్యాంకులవద్ద పడిగాపులు కాయడం.. దీనికి చంద్రబాబే కారణం అని వాళ్ళు గుర్తించి ఆయన్ను తిడుతుండడంతో ఏమి చేయాలో తెలియక చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు..-సిమ్మాదిరప్పన్న 

Adivi Sesh About Allari Naresh Aa Okkati Adakku movie
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్‌

‘‘నా తొలి సినిమా ఆడియో లాంచ్‌కి నరేశ్‌గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకకి నేను రావడం హ్యాపీగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని మనమంతా థియేటర్లో చూసి హాయిగా నవ్వుకుందాం’’ అని హీరో అడివి శేష్‌ అన్నారు.‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చిలకప్రోడక్షన్స్‌పై రాజీవ్‌ చిలక నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి అడివి శేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ– ‘నేను ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో ఉండటానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ డైరెక్టర్‌ మల్లి అంకంతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 30 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను.ఈ మండు వేసవిలో మీ బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా మా సినిమాతో ఎంజాయ్‌ చేయండి’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి మంచి మూవీ చేయడం మా అదృష్టం’’ అన్నారు రాజీవ్‌ చిలక. ఈ వేడుకలో సహ నిర్మాత భరత్, దర్శకులు విజయ్‌ కనకమేడల, విజయ్‌ బిన్నీ, దేవా కట్టా, రచయితలు బీవీఎస్‌ రవి, అబ్బూరి రవి, నటి జామి లివర్‌ మాట్లాడారు.

ESI scam: TDP MLA Atchannaidu
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక

కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు న్యాయం చేయాలి. కానీ అచ్చెన్నాయుడు రూటే సెప‘రేటు’. శ్రామిక సోదరుల కోసం కొనాల్సిన మందుల్లోనూ దందా నడిపారు. వైద్యపరికరాలు ఎక్కువ ధరకు కోట్‌ చేసి, బినామీలను తెర మీదకు తెచ్చి, మందు బిల్లుల్లో మాయలు చేసి రూ.150 కోట్ల అక్రమానికి పాల్పడి అవినీతి మంత్రిగా ముద్ర పడ్డారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టయ్యి జిల్లా పరువు తీసేశారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దొరికిందే చాన్స్‌ అంటూ దోచుకున్నారు.  సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్‌ఐ స్కామ్‌.. అచ్చెన్నాయుడు ఎన్నటికీ చెరపలేని అవినీతి మరక. మన జిల్లాకు చెందిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారం మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల  కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. కారి్మకుల సొమ్ము కాజేసిన అచ్చెన్న బండారం విజిలెన్స్‌ అధికారుల విచారణలో  బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖతో మొత్తం గుట్టు రట్టయ్యింది. వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132శాతం అధికంగా చెల్లించి కోట్లు కొట్టేశారు.    అచ్చెన్న అవినీతి మార్క్‌ కారి్మక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్న తన మార్క్‌ అవినీతిని చూపించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్‌ను తాను చెప్పిన సంస్థకు నామినేటేడ్‌ కట్టబెట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వగా ఆర్డర్‌ జారీ చేశారు. సిఫార్సుకు ముందు వారితో ఏ లాలూచీలు పడ్డారో తెలీదు గానీ తన లెటర్‌ హెడ్‌ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తూచా తప్పకుండా అధికారులు పాటించారు. నామినేటేడ్‌లో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ ఇండెంట్లతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు కూడా చేశారు.  అవినీతి జరిగిందిలా... 👉రూ. 293.51కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్‌ కాంట్రాక్ట్‌ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36కోట్లు విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు.   👉శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62కోట్లు మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70శాతం అధికం. 👉ఫ్యాబ్రికేటేడ్‌ కొటేషన్స్‌ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. రాశి ఫార్మా, వీరేష్‌ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ. 15.93కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70కోట్లు మేర అదనంగా చెల్లించినట్టు తేలింది.  👉 కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలనపడేశారు. జెర్సన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే బినామీ సంస్థకు ఈఎస్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ సీకే రమే‹Ùకుమార్‌ రూ. 9.50కోట్లు చెల్లించారు.  👉 ఒక్కో బయోమెట్రిక్‌ పరికరం ధర రూ.16,992 అయితే రూ.70,760చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి కొనుగోలు చేశారు.  👉 ఈ క్రమంలో రశీదులు ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్‌లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ల్యాబ్‌ కిట్లు, ఫరీ్నచర్, ఈసీజీ సరీ్వసులు, బయోమెట్రిక్‌ పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయి.  👉 లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం రూ.89కోట్లు చెల్లిస్తే అందులో రేట్‌ కాంట్రాక్ట్‌లో ఉన్న సంస్థలకు రూ. 38కోట్లు చెల్లించారు. మిగతా రూ.51కోట్లను దారి మళ్లించారు.  👉టెండర్లు లేకుండా నామినేషన్‌ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దురి్వనియోగమైంది. అవుట్‌ సోర్సింగ్‌ దందా సాధారణంగా ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని కలెక్టర్‌ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్‌ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఏజెన్సీలుగా నియమించి దందా చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి స్థాయిలోనే ఏ శాఖకు, ఏ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ ఎవరి చేతిలో ఉండాలన్నది ఫిక్స్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగలేదు. బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కో పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి.    అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 👉అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్‌ నంబర్‌ 04/ఆర్‌సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్‌ 13(1), (సీ), (డీ), ఆర్‌/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్‌ 408, సెక్షన్‌ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు.  👉రూ. 975.79కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. 👉ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్‌ కిట్స్, ఫరీ్నచర్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ. 975.79కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు.  👉నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్‌ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.  మొదటి నుంచీ అదే బాగోతం  రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్‌ రుణాల్లో అక్రమాలు, సింగిల్‌ టెండర్‌ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్‌ టెండర్‌ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, దివాకర్‌ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను అచ్చెన్న మూటగట్టుకున్నారు.  

Sakshi Editorial On T20 World Cup Indian Cricket Team
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...

రానున్న టీ20 వరల్డ్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్‌ జట్టు ఎంపిక జరిగింది. అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా జూన్‌ 2 నుంచి జరిగే పోటీలకు రోహిత్‌ శర్మ సారథిగా 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్ళను రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అజిత్‌ అగర్కర్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ ప్యానెల్‌ చేసిన ఎంపికలో కొందరు స్టార్‌ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు. అలాగని, ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన ఎంపికలూ లేవు. విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌ రింకూ సింగ్‌కు చోటివ్వకపోవడం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబయ్‌ ఇండియన్స్‌ (ఎంఐ) జట్టు సారథిగా విఫలమైనా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను వైస్‌ కెప్టెన్‌ను చేయడం విమర్శలకు తావిచ్చాయి. అలాగే, స్పిన్నర్లనేమో నలుగురిని తీసుకొని, జస్ప్రీత్‌ బుమ్రా నేతృత్వంలో ముగ్గురు పేసర్ల బృందానికే పరిమితం కావడమూ ప్రశ్నార్హమైంది. కొంత ఇష్టం, కొంత కష్టం, మరికొంత నష్టాల మేళవింపుగా సాగిన ఈ ఎంపికపై సహజంగానే చర్చ జరుగుతోంది.గత ఏడాదంతా టీ20లలో పాల్గొనకపోయినా సీనియర్లు రోహిత్‌ శర్మ, కోహ్లీలకు సెలక్షన్‌ ప్యానెల్‌ పెద్దపీట వేసింది. నాలుగు గ్రూపుల్లో 20 జట్లతో, మొత్తం 55 మ్యాచ్‌లు సాగే ఈ స్థాయి భారీ పోటీలో, అమెరికాలోని అలవాటు లేని పిచ్‌లలో సీనియర్ల అనుభవం అక్కరకొస్తుందని భావన. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అబ్బురపరిచేలా ఆడుతున్న వికెట్‌కీపర్‌ – బ్యాట్స్‌ మన్‌ రిషభ్‌ పంత్‌ ఎంపికతో గత రెండు వరల్డ్‌కప్‌లలో లేని విధంగా మిడిల్‌ ఆర్డర్‌లో లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ ఆప్షన్‌ జట్టుకు దక్కింది. ఈసారి ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తూ, రాజస్థాన్‌ రాయల్స్‌ను అగ్రపీఠంలో నిలిపిన సంజూ శామ్సన్‌కు జట్టులో స్థానం దక్కింది. వెరపెరుగని బ్యాటింగ్‌తో, అలవోకగా సిక్స్‌లు కొట్టే అతడి సత్తాకు వరల్డ్‌ కప్‌ పిలుపొచ్చింది. మిడిల్‌ ఆర్డర్‌లో అతడు జట్టుకు పెట్టని కోట. స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్లుగా శామ్సన్, పంత్‌లను తీసుకోవడంతో కె.ఎల్‌. రాహుల్‌కు మొండి చేయి చూపక తప్పలేదు. ఒకప్పుడు ఎగతాళికి గురైన ముంబయ్‌ కుర్రాడు శివమ్‌ దూబే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టులో మిడిల్‌ ఆర్డర్‌లో సిక్సర్ల వీరుడిగా, ప్రస్తుతం భారత వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కీలక భాగస్వామిగా ఎదగడం గమనార్హం.క్లిష్టమైన వేళల్లో సైతం బ్యాటింగ్‌ సత్తాతో జట్టును విజయతీరాలకు చేర్చే సత్తా, స్వభావం ఉన్న ఆటగాడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాతికేళ్ళ రింకూ సింగ్‌కు పేరు. అయితే, ఏ స్థానంలో ఆడించా లని మల్లగుల్లాలు పడి, చివరకు ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్‌కు జట్టులో చోటే ఇవ్వలేదు. రిజర్వ్‌ ఆట గాడిగా మాత్రం జట్టు వెంట అమెరికా, వెస్టిండీస్‌లకు వెళతాడు. పరుగుల సగటు 89, స్ట్రయిక్‌రేట్‌ 176 ఉన్న రింకూ లాంటి వారికి తుది జట్టులో స్థానం లేకపోవడం తప్పే. ఈ ఏడాది ఐపీఎల్‌లో బాగా ఆడుతున్న స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌కు జట్టులోకి మళ్ళీ పిలుపు వచ్చింది. అయితే, నలు గురు స్పిన్నర్లతోటి, అందులోనూ ఇద్దరు ముంజేతితో బంతిని తిప్పే రిస్ట్‌ స్పిన్నర్లతోటి బరిలోకి దిగడంతో మన బౌలింగ్‌ దాడిలో సమతూకం తప్పినట్టుంది. ప్రధాన పేసర్లు ముగ్గురే కావడం, బౌలింగ్‌లో హార్దిక్‌ ఫామ్‌లో లేకపోవడం, సీఎస్‌కేలో శివమ్‌కు గతంలో బౌలింగ్‌ ఛాన్స్‌ ఆట్టే రాకపోవడంతో టీ20 వరల్డ్‌ కప్‌లో మన పేసర్ల విభాగం బలహీనంగా కనిపిస్తోంది. వివరణలేమీ ఇవ్వకుండానే మే 23 వరకు ఈ ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకొనే అవకాశం సెలక్టర్లకుంది. కానీ, ఫైనల్‌ 15 మందిని మార్చడానికి అగర్కర్‌ బృందం ఇష్టపడుతుందా అన్నది అనుమానమే. అది అటుంచితే, 2007 తర్వాత భారత్‌ టీ20 టైటిల్స్‌ ఏవీ గెలవలేదు. నిజానికి, ధోనీ సారథ్యంలోని యువకుల జట్టు 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన తీరు మన క్రికెట్‌లో కొత్త మలుపు. టీ20లకు భారత్‌ అడ్డాగా మారిందంటే దాని చలవే. ఆ వెంటనే 2008లో ఐపీఎల్‌ ఆరంభంతో కథే మారిపోయింది. ఇవాళ ప్రతి వేసవిలో పేరున్న అంతర్జాతీయ ఆటగాళ్ళు భారత్‌కు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్స్‌ వచ్చినా, ఐపీఎల్‌దే హవా. ఇంతవున్నా 2014లో ఒక్కసారి శ్రీలంకతో ఫైనల్స్‌లో ఓడినప్పుడు మినహా ఎన్నడూ విజయం అంచుల దాకా మనం చేరింది లేదని గమనించాలి. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. యువ ప్రతిభను ప్రోత్సహించడం, ఆటకు తగ్గ ఆటగాళ్ళను ఎంచుకోవడమనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే కష్టం. ఆ సూత్రాన్ని పాటించడం వల్లే 2007లో మనకు కప్పు దక్కిందని గుర్తుంచుకోవాలి.గమనిస్తే, దశాబ్దిన్నర పైగా క్రికెట్‌ స్వరూప స్వభావాలే మారిపోయాయి. మిగతావాటి కన్నా టీ20లు పాపులరయ్యాయి. బంతిని మైదానం దాటించే బ్యాటింగ్‌ విధ్వంసాలు, స్కోర్‌ బోర్డ్‌ను పరి గెత్తించే పరుగుల వరదలు, మైదానంలో మెరుపు లాంటి ఫీల్డింగ్‌ ప్రతిభలు సాధారణమై పోయాయి. టెస్ట్, వన్డే క్రికెట్‌లు సైతం తమ పూర్వశైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగానే కాక అనేక విధా లుగా వాటిని టీ20 మింగేసే పరిస్థితీ వచ్చింది. బ్యాట్స్‌మన్ల వైపు మొగ్గుతో ఈ పొట్టి క్రికెట్‌ పోటీలు బౌలర్లకు నరకంగా మారి, ఆటకు ప్రాణమైన పోటీతత్వాన్ని హరిస్తున్నాయి. అందుకే, 2008లో ఆరంభమైన ఐపీఎల్‌ ఏటికేడు క్రమంగా మునుపటి ఆసక్తినీ, ఆదరణనూ కోల్పోతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌ల తయారీ మొదలు టీ20 ఫార్మట్‌లో, ఐపీఎల్‌లో కొన్ని నియమ నిబంధనల సవరణ దాకా అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపిరులూదాలి. టీ20 వరల్డ్‌ కప్‌లో విజయం సాధించాలంటే ఆటలోనే కాదు... ఎంపికలోనూ దూకుడు అవసరం. రిస్క్‌ లేని సేఫ్‌ గేమ్‌తోనే పొట్టి క్రికెట్‌లో కప్పు కొట్టగలిగితే అది ఓ కొత్త చరిత్ర! 

Sakshi Guest Column On Pakistan
గెలవలేని యుద్ధం చేసిన పాక్‌

కార్గిల్‌ యుద్ధం జరిగి పాతికేళ్లవుతోంది. మే 3న పాక్‌ చొరబాట్లను మొదటిసారి కనుగొన్న తర్వాత, జూలై 26న భారత్‌ తన విజయాన్ని ప్రకటించ డానికి ముందు దాదాపు మూడు నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో, ఎన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రాంతంలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ సైనిక పంథాను అనుసరించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్‌ విధ్వంసం గట్టిగా బయటపెట్టింది. స్థాయిలోనూ, విస్తృతిలోనూ పరిమితమే అయినప్పటికీ, కార్గిల్‌ రెండు దేశాలలో లోతైన విశ్లేషణను ప్రేరేపించింది.1999 ఫిబ్రవరి 20న, నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆహ్వానం మేరకు పాకిస్తాన్‌లో చరిత్రాత్మక దౌత్య పర్యటనకు బయలుదేరారు. మరుసటి రోజు, ఇద్దరు ప్రధానులు లాహోర్‌ డిక్లరేషన్‌ పై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, తమ ప్రజల పురోగతి, శ్రేయస్సు గురించిన భాగస్వామ్య దార్శనికతను ఇరువురు నేతలూ ప్రతిబింబించారు.ఉద్రిక్తతలను పెంచిన 1998 అణు పరీక్షల ఛాయల నుండి ఉద్భవించిన ఈ ప్రకటన, సరిహద్దుకు ఇరువైపులా చక్కటి ప్రశంసలు పొందింది. అయితే విచారకరంగా, ఈ ఆశావాదం భ్రమగా మారింది. వాఘా సరిహద్దులో వాజ్‌పేయికి షరీఫ్‌ అభివాదం చేస్తున్నప్పుడే, పాకిస్తాన్‌ సైనికులు కార్గిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను దాటి ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన టోలోలింగ్, టైగర్‌ హిల్‌ వంటి పర్వత శిఖరాల్లో కందకాలు తవ్వుతున్నారు.18,000 అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్‌ భౌగోళికపరంగా అసాధారణమైన సవాళ్లతో కూడినది. అటువంటి విపరీతమైన పరిస్థి తులలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అయితే అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది.మే 3న పాక్‌ చొరబాట్లను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత, జూలై 26న భారతదేశం విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు మూడు నెలల కాలం కార్గిల్‌లో నెత్తుటి యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్‌ సైన్యం ఈ పోరాటంలో తన ప్రమేయాన్ని నిరాకరించింది, నేలకొరిగిన తన సైనికులను గుర్తించడానికి నిరాకరించింది. ఇది వారి త్యాగానికి అంతిమ అవమానం అని చెప్పాలి.స్థాయిలోనూ, భౌగోళిక విస్తృతిలోనూ పరిమితమే అయినప్ప టికీ, కార్గిల్‌ యుద్ధం రెండు దేశాలలో లోతైన వ్యూహాత్మక విశ్లేషణను ప్రేరేపించింది. వేసుకున్న లెక్కలు తప్పడంపై పాక్‌లోనూ; నిఘా వైఫల్యం కారణంగా చొరబాట్లను గుర్తించలేక పోవడంతో సహా, జాతీయ భద్రతా అంతరాలపై భారత్‌లోనూ పెద్ద చర్చ జరిగింది.యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత, పాకిస్తాన్‌ దురాక్ర మణకు దారితీసిన సంఘటనలను సమీక్షించడానికీ, సాయుధ చొర బాట్లకు వ్యతిరేకంగా జాతీయ భద్రతను కాపాడే చర్యలను సిఫార్సు చేయడానికీ భారత ప్రభుత్వం కార్గిల్‌ సమీక్షా కమిటీ (కేఆర్‌సీ)ని ఏర్పాటు చేసింది. రాజకీయ, అధికార, సైనిక, నిఘా సంస్థలు యథా తథ స్థితిపై స్వార్థ ఆసక్తిని పెంచుకున్నాయని ఈ కమిటీ పేర్కొంది. కార్గిల్‌ అనుభవం, కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, అణుబాంబుతో కూడిన భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ భద్రతా వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరమని కమిటీ నొక్కి చెప్పింది.కేఆర్‌సీని అనుసరించి వచ్చిన మంత్రుల బృందం నివేదిక, జాతీయ భద్రతా సమస్యలపై స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన అత్యంత సమగ్ర పరిశీలన అని చెప్పవచ్చు. గూఢచార యంత్రాంగం, అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ. రక్షణ నిర్వహణను అంచనా వేయడానికి నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.ఈ రెండు నివేదికలు జాతీయ భద్రతా నిర్వహణలో అనేక మార్పులకు దారితీశాయి. కేంద్రీకృత కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్ను నిర్వహించడానికి 2004లో జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థను ఏర్పర్చారు. సైన్యం నిర్దిష్ట గూఢచార అవసరాలను తీర్చడానికి రక్షణ నిఘా సంస్థ ఏర్పడింది. మెరుగైన ఇంటర్‌–ఏజెన్సీ సమాచారం భాగస్వామ్యాన్ని, సమన్వయాన్ని పెంపొందించడానికి బహుళ ఏజెన్సీ కేంద్రం కూడా ఏర్పాటయింది. రక్షణ వ్యవస్థ కొంత పునర్ని ర్మాణానికి గురైంది. ఇందులో సమీకృత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడం, వ్యూహాత్మక బలగాలు, అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ల స్థాపన, త్రివిధ బలగాలకు ఆర్థిక, పరిపాలనా అధికారాలు పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి. మంత్రుల బృందం సిఫార్సు చేసిన విధంగా 2020లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ నియామకం జరిగింది.కొన్ని సిఫార్సులు పాక్షికంగా మాత్రమే అమలైనాయి. ‘ఒకే సరి హద్దులో అనేక బలగాలు ఉండటం కూడా బలగాల జవాబు దారీతనం లోపానికి దారితీసిం’దని మంత్రుల బృందం నివేదిక పేర్కొంది. ‘జవాబుదారీతనాన్ని తేవడానికి, సరిహద్దు వద్ద బలగాల మోహరింపును పరిగణనలోకి తీసుకునేటప్పుడు ‘ఒక సరిహద్దు, ఒక బలగం’ సూత్రాన్ని అవలంబించవచ్చు’ అని సూచించింది. ఈ సూత్రాన్ని ఇంకా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర వర్తింపజేయాల్సే ఉంది. ఇక్కడ భారత సైన్యం, ఇండో–టిబెటన్‌ సరిహద్దు పోలీసులు వేర్వేరు కమాండ్‌ ఏర్పాట్లలో మోహరించారు.జాతీయ భద్రతా సిద్ధాంతం లేకపోవడం, ఆర్థిక సంవత్సరానికి మించి సైన్యానికి నిధుల నిబద్ధత లేకపోవడం వంటి బలహీనతలను మంత్రుల బృందం ఎత్తి చూపింది. పరిష్కరించాల్సిన ఇతర సమస్యలు ఏవంటే, త్రివిధ బలగాల హెడ్‌క్వార్టర్స్‌ను ప్రభుత్వంలో మరింతగా ఏకీకృతం చేయడం, సాయుధ దళాలు ఉమ్మడిగా ఉండటం. ఇప్పటికీ ఈ లోటుపాట్లు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌ వైపు కూడా, కార్గిల్‌ పరాజయంపై చాలా బహిరంగ చర్చ జరిగింది. ఆ యుద్ధం పౌర–సైనిక సంబంధాల వక్ర స్వభావాన్ని బహిర్గతం చేసింది. సైనిక లక్ష్యాలను రాజకీయ, దౌత్యపరమైన పరిశీలనలు లేకుండా రూపొందించారు. నసీమ్‌ జెహ్రా రాసిన ‘ఫ్రమ్‌ కార్గిల్‌ టు ది కూ’ పుస్తకంలో, మే 17న సైన్యం అప్పటి ప్రధాని షరీఫ్‌కు కార్గిల్‌ సైనిక చర్యపై తొలి వివరణాత్మక సమాచారాన్ని అందించిందని రాశారు. ఆ సమయానికి, సైనికులు అప్పటికే నియంత్రణ రేఖ వెంబడి స్థానాలను ఆక్రమించారు.యుద్ధం తరువాత, దానికి పన్నాగం పన్నిన జనరల్స్‌ పాత్ర పరిశీలనలోకి రావాలి. దీనికి బదులుగా, పాకిస్తాన్‌ సైన్యం రాజకీయ నాయకత్వానికి నిందను ఆపాదించడానికి ప్రయత్నించింది. పెరుగుతున్న ఈ అపనమ్మకం చివరకు 1999 అక్టోబర్‌లో షరీఫ్‌ను అధికారం నుండి తొలగించిన సైనిక కుట్రకు దారితీసింది.భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ సైనిక పంథాను ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్‌ విధ్వంసం గట్టిగా బయట పెట్టింది. భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్గాలను కనుగొనే బదులు, పాకిస్తాన్‌ సైన్యం వెనక్కితగ్గి ఉగ్రవాదులను ఉపయోగించింది. యుద్ధం తర్వాత జమ్మూకశ్మీర్‌లో హింస పెరిగింది. కశ్మీర్‌పై మక్కువ పెంచుకోవడం మానుకోవాలనీ, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై పాకిస్తాన్‌ దృష్టి పెట్టాలనీ పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశం తన పరిమితులు, ప్రాధాన్యతల గురించి నిర్దాక్షిణ్యంగా వాస్తవికంగా మారాలని పాకిస్తాన్‌ మాజీ దౌత్యవేత్త షాహిద్‌ అమీన్‌ రాశారు. ఏమైనప్పటికీ, పాకిస్తాన్‌ను గెలవలేని సంఘర్షణలోకి నెట్టిన ప్రధాన సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. సైన్యం ఇప్ప టికీ దేశ పగ్గాలను నియంత్రిస్తోంది. కశ్మీర్‌పై వాగాడంబరం కొనసాగు తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పైగా, ఉగ్రవాద సంస్థ లకు పాక్‌ ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది.నేడు, భారతదేశం చాలా శక్తిమంతమైన దేశం. ఇప్పుడు కార్గిల్‌ తరహా ఘటన అసంభవంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 1999 సంఘర్షణ పాకిస్తాన్‌ రాజ్యయంత్రాంగపు నిర్లక్ష్య స్థాయిని వెల్లడి చేసింది. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఆ ముద్రను తొలగించ డానికి పెద్దగా అనుకూలించవు.లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా (రిటైర్డ్‌) వ్యాసకర్త మాజీ నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Katrina Kaif And Vicky Kaushal Asks Paparazzi To Delete Their Pics
భ‌ర్త‌తో ఉన్న ఫోటోలు డిలీట్ చేయ‌మ‌న్న క‌త్రినా!

సెల‌బ్రిటీలు క‌నిపిస్తే చాలు వ‌ద్దంటున్నా వినిపించుకోకుండా కెమెరామ‌న్లు వారిని క్లిక్‌మ‌నిపిస్తుంటారు. అందులోనూ ప్రేమ ప‌క్షులు క‌నిపించారంటే వెంట‌ప‌డి మ‌రీ ఫోటోలు తీస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే! అలా ఎంతోమంది ఫోటోగ్రాఫ‌ర్లు చిన్న‌పాటి తార‌ల నుంచి పెద్ద పెద్ద సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రినీ ఫాలో అవుతూ త‌మ కెమెరాల‌కు ప‌ని చెప్తుంటారు. క‌త్రినా- విక్కీ దొరికిపోయారుబాలీవుడ్‌లో అయితే మ‌రీనూ..  అన‌న్య పాండే, జాన్వీ క‌పూర్‌, అదితిరావు హైద‌రి.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు వారి ప్రియుల‌తో అడ్డంగా దొరికిపోయారు. అలా అప్ప‌ట్లో క‌త్రినా కైఫ్‌- విక్కీ కౌశ‌ల్ కూడా దొరికిపోయారు. అయితే త‌మ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయ‌మ‌ని కోరార‌ట‌!ఫోటోలు తీయొద్దుఈ విష‌యాన్ని ఫోటోగ్రాఫ‌ర్స్ స్నేహ్‌, విశాల్ వెల్ల‌డించారు.  'ఒక‌సారి కత్రినా.. త‌మ ఫోటోలు తీయొద్ద‌ని కోరింది. కావాలంటే నెక్స్ట్ టైమ్ పిలుస్తాన‌ని త‌న మేనేజర్ నా ఫోన్ నెంబ‌‌ర్ తీసుకున్నాడు. త‌ర్వాత య‌ష్ రాజ్ స్టూడియోస్‌కు ర‌మ్మ‌ని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు. విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసుండ‌గా కూడా ఫోటోలు తీశాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారుకానీ ఆమె కేవ‌లం త‌న ఫోటోలు మాత్ర‌మే తీయ‌మంది. మిగ‌తావి డిలీట్ చేయ‌మ‌ని కోరింది.. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే అన‌న్యను కూడా ఆదిత్య రాయ్ క‌పూర్‌తో ఉన్న‌ప్పుడు ఫోటోలు తీశాం. కానీ అప్ప‌ట్లో వాటిని త‌ను కూడా డిలీట్ చేయించింది' అని చెప్పుకొచ్చారు.చ‌ద‌వండి: అభిమానికి రూ.22వేల ఖరీదైన షూ గిఫ్ట్‌.. అంతేకాదు!

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all