Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm jagan Serious Comments On Chandrababu At Eluru Meeting
పేదల గురించి మాట్లాడుతుంటే బాబుకు కోపం వస్తుంది: సీఎం జగన్‌

సాక్షి, ఏలూరు: బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ఆగిపోతాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావు.. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవని పేర్కొన్నారు. ఇది కులాల మధ్య యుద్దం కాదు.. క్లాస్‌ వార్‌ అని తెలిపారు. ఈ యుద్ధంలో ఓ వైపు పేదలు ఉంటే మరోవైపు పెత్తందార్లు ఉన్నారని అన్నారు.ఏలూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సీఎం జగన్‌ ప్రచార సభకు ప్రజాభిమానం పోటెత్తింది. జై జగన్‌ నినాదాలతో ఏలూరు మార్పోగిపోయింది. ఈ సందర్భంగా సభకు హాజరైన జనసమూహాన్ని ఉద్ధేశిస్తూ సీఎం మాట్లాడారు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు.. అయిదేళ్ల భవిష్యత్త్‌ను నిర్ణయిస్తాయని చెప్పారు.. మంచి చేసిన జగన్‌ పేదల పక్షాన ఉన్నాడని తెలిపారు. పేదల పక్షాన ఉన్న జగన్‌ను చూసి బాబుకు కోపమొస్తుందని దుయ్యబట్టారు. తాను పేదల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు కోపం వస్తుందని మండిపడ్డారు.సీఎం జగన్‌ ప్రసంగం..మన రాష్ట్రంలో దాదాపు 90 శాతం తెల్ల రేషన్‌కార్డు దారులే.కోటి 44  లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.వీళ్లందరికీ పథకాలు అందాలంటే మీ జగన్‌కు తోడుగా ఉండాలి.కోటి 5 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్నారు.పొదుపు సంఘాల మహిళలు పేదలు కాదా, వారికి పథకాలు అందొద్దా? పేదలకు పథకాలు అందాలా లేదా?పిల్లల చదవుుల కోసం అమ్మ ఒడి తీసుకొచ్చి ప్రోత్సహించాం.93 శాతం మంది పిల్లలకు విద్యాదీవెనచ వసతి దీవెన అందుతోంది.ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.అక్కాచెల్లెమ్మల కోసం అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ.మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకొచ్చాం.అక్కాచెల్లెమ్మలకు 50శాతం నామినేటెడ్‌ పదవులిచ్చాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం.పెట్టుబడి సాయంతో రైతన్నకు అండగా నిలబడ్డాం.వాహన మిత్రతో ఆటోడ్రైవర్లకు తోడుగా ఉన్నాం.వాలంటీర్‌ వ్యవస్థతో పౌరసేవలుగ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు.గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చాం.నాడు, నేడుతో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చాం.సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం.పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం.రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం.59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలురద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటికోఉద్యోగం అన్నాడు ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నాడు.. నమ్ముతారా?కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తానంటాడు.. నమ్ముతారా?ఇలాంటి మోసగాళ్లు నమ్మొద్దు.. జాగ్రత్తగా ఉండండివాలంటీర్ల సేవలు కొనసాగాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి.పేదల భవిష్యత్‌ కోసం ఫ్యాన్‌ గుర్తు ఓటేయండి.

Vasireddy Padma Comments On Sharmila And Sunitha
చంద్రబాబు చేతిలో షర్మిల రిమోట్ కంట్రోల్: వాసిరెడ్డి పద్మ

సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒకరి చేతిలోని రిమోట్‌లాగా జగన్ వ్యవహరిస్తారా? ఆ సంగతి మీకు తెలీదా? అంటూ దుయ్యబట్టారు.చంద్రబాబు జేబు బొమ్మలులాగా షర్మిల, సునీత మాట్లాడుతున్నారు. వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అవినాష్‌రెడ్డికి సీటు ఇస్తే ఇంత విషం చిమ్మాలా?. వైఎస్సార్‌సీపీ ఓటు చీల్చటమే పనిగా షర్మిల పెట్టుకున్నారు. ఆమె టార్గెట్ వెనుక చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్ షర్మిల’’ అంటూ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.‘‘ఎన్నో కోట్లమంది ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. జగన్‌కి చెల్లెళ్లు అనే హోదా తప్ప షర్మిల, సునీతలకు ఈ రాష్ట్రంలో ఏముంది?. వారు మాట్లాడేవన్నీ ఎల్లో మీడియా హైలెట్ చేస్తోంది. వారం తర్వాత ఎల్లోమీడియా మీ ముఖాలను టీవీలో చూపించదు. ఆ సంగతి గుర్తు పెట్టుకోండి. ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఎల్లోమీడియా అసలు పట్టించుకోదు.షర్మిల, సునీత చూపుతున్న ఉన్మాదం వలన వారికే నష్టం’’ అని వాసిరెడ్డి పద్మ చెప్పారు.వైఎస్సార్‌కుటుంబం ఎటుపోయినా పర్లేదు అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. వివేకా పరువు నడిరోడ్డు మీద పెట్టారు. షర్మిలకి మెదడు పని చేస్తుందా?. కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని ఇప్పుడు షర్మిల అనటం వెనుక కారణం ఏంటి?. వైఎస్సార్ పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారనే బాధతో లాయర్ సుధాకర్ రెడ్డి కేసు వేశారు. ఆ కేసులో వైఎస్సార్ పేరు ప్రస్తావన ఉందా?. అవినాష్‌కి సీటు ఇస్తే షర్మిలకు ఎందుకు అంత కోపం?. మీరు చెప్పినట్టు జగన్ వినలేదని చంద్రబాబు జేబులో బొమ్మలుగా మారుతారా?. జగన్ చెల్లెల్లు కాకపోతే అసలు షర్మిల, సునీతలను ఎవరు పట్టించుకుంటారు?’’ అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. 

Rohit Sharma and Ajit Agarkar accused openly for making Rinku Singh a SCAPEGOAT
'అత‌డేం త‌ప్పు చేశాడు.. ఎవ‌రి కోస‌మో బ‌లి ప‌శువు చేశారు'

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.అయితే ఈ జ‌ట్టు ఎంపికపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌, న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌ల‌ను ఎంపిక చేయ‌కపోవ‌డాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు త‌ప్పుబడుతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు కేఎల్ రాహుల్‌ను పూర్తిగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని సెల‌క్ట‌ర్లు.. రింకూను మాత్రం స్టాండ్ బైగా ఎంపిక చేశారు.  ఈ క్ర‌మంలో రింకూకు ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ఇవ్వ‌కపోవ‌డాన్ని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా వ్య‌తిరేకించాడు. రింకూ సింగ్ లాంటి ప‌వ‌ర్ హిట్ట‌ర్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డం సెల‌క్ట‌ర్లు తీసుకున్న చెత్త నిర్ణ‌య‌మ‌ని శ్రీకాంత్ మండిప‌డ్డాడు.'రింకూ సింగ్ ఏం త‌ప్పు చేశాడు. సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యం న‌న్ను షాక్‌కు గురిచేసింది.ప్ర‌స్తుతం ఇదే విష‌యం గురించి ప్రపంచవ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు. త‌ను ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ త‌ర‌పున ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ స‌త్తాచాటాడు. అత‌డు గ‌తంలో ద‌క్షిణాణ‌ఫ్రికాతో సిరీస్‌లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు.అటువంటి అద్భుత ఆట‌గాడిని ఎందుకు వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయ‌లేదు? అత‌డి బదులు జైశ్వాల్‌ను ప‌క్క‌న పెట్టాల్సింది. నా వ‌ర‌కు అయితే రింకూ సింగ్ క‌చ్చితంగా వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో ఉండాల్సిందే. అస్స‌లు న‌లుగురు స్పిన్న‌ర్ల‌ను ఎంపిక చేయాల్సిన అవ‌స‌రం ఏముంది? కొంతమందిని సంతోషపెట్టడానికి రింకూ సింగ్‌ను బ‌లి ప‌శువు చేశారని' త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో శ్రీకాంత్ పేర్కొన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్‌ సిరాజ్. 

Sanjay Leela Bhansali Heeramandi The Diamond Bazar Streaming In Telugu
తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్‌ వెబ్ సిరీస్‌..!

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయి కతియావాడి మూవీతో సూపర్  హిట్‌ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం మరో విశేషం.ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మే 1వ తేదీ నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్‌ ఇదివరకే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లతో పాటు 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‍లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పోషించారు.కాగా.. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1940 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరామండిని తెరెకెక్కించారు. పాకిస్తాన్‌లోని  రెడ్‍లైట్‍ ప్రాంతంలో జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. హీరామండి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనలను ఈ సిరీస్‌లో చూపించారు. కాగా.. హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‍లోని లాహోర్‌లో ఉంది. 

prajwal revanna responds on hasan video controvercy First Time
Hasan Sex Scandal: తొలిసారి స్పందించిన ప్రజ్వల్‌ రేవణ్ణ

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్‌ సెక్స్‌ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్‌ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.సెక్స్‌ స్కాండల్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్‌ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్‌ 27న ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్‌ వీడియోలు హసన్‌ ప్రాంతంలో వైరల్‌ అయ్యాయి.ప్రజ్వల్‌ లోక్‌సభ ఎన్నికల్లో హసన్‌ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్‌, బెంగళూరుల్లోని ప్రజ్వల్‌ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్‌డ్రైవ్‌ బయటికి రావడంతో సెక్స్‌ స్కాండల్‌ వెలుగులోకి వచ్చింది. 

KSR Comment On Why BJP Distanced From TDP Jana Sena Manifesto
బీజేపీని డిఫెన్స్‌లో పడేసిన సీఎం జగన్‌!

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం కూటమిని ముందుగానే క్లీన్ బౌల్ చేసేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు బీజేపీతో కలిసి అట్టహాసంగా విడుదల చేయాలని అనుకున్న మేనిఫెస్టో విడుదల తుస్సు మంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆ మానిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడక పోవడమే. ఇది జగన్ కొట్టిన దెబ్బే కదా!ఆయన గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో 2014 శాసనసభ ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో గురించి, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీల ఫోటోలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు చూపుతూ అందులో ఇచ్చిన  వాగ్దానాల అమలు తీరు గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో ఇది విస్తృతంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ఈ ముగ్గురు మళ్లీ జనం ముందుకు వస్తున్నారని అంటూ అందులో ఉన్న అంశాలను చదివి వినిపించి ప్రజలతో సమాధానాలు ఇప్పిస్తున్నారు. అది ఈ మూడు  పార్టీలకు బాగా డ్యామేజీగా మారింది. వాటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబు నాయుడు సమధానం ఇవ్వలేకపోతున్నారు. అంతేకాక తన సభలలోకాని, తన ఎన్నికల ప్రణాళిక విడుదలలో కాని జగన్ ఒక మాట చెబుతున్నారు.2019లో తాను ఇచ్చిన మానిఫెస్టోని, అమలు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు ఇస్తూ, 2024లో తాను చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు.  పాతవాటిని కొనసాగిస్తూ,కొత్తవి పెద్దగా ఇవ్వకుండా  చాలా జాగ్రత్తగా మేనిఫెస్టోని రూపొందించి దానికి అయ్యే వ్యయాన్ని వివరిస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేసిన వాగ్దానాలకు అయ్యే ఖర్చును లెక్కేసి చెబుతున్నారు. వాటి ప్రకారం చూస్తే చంద్రబాబుది పూర్తిగా ఆచరణసాధ్యం కాని మేనిఫెస్టో అని తేలిపోతుంది. ఈ పరిస్థితిలోనే తమ పరువు చంద్రబాబు చేతిలో మరింతగా  పోగొట్టుకోవడం ఇష్టం లేక ప్రధాని మోదీ వంటి బీజేపీ నేతలు తమ పేర్లు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టవద్దని చెప్పారట.  బీజేపీ పెద్దలు  ఈ మేనిఫెస్టోకి దూరం అయితే, పవన్ కల్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊగొట్టే స్థితిలో ఉన్నారు.  చంద్రబాబు తన పాత మేనిఫెస్టో ఊసుకాని, జగన్ అమలు చేసిన మేనిఫెస్టో సంగతులు కాని చెప్పకుండా ఆకాశమే హద్దుగా కొత్త హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తన సభలలో మళ్లీ ఈ ముగ్గురూ  చంద్రబాబు, పవన్,మోదీ మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని,  ఇంటింటికి బెంజ్ కారు ఇస్తామంటున్నారని, కిలో బంగారం ఇస్తామని చెబుతున్నారని నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది బాగా క్యాచీ డైలాగుగా మారడంతో బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది.చంద్రబాబు ఇచ్చే తప్పుడు  వాగ్దానాలకు తాము కూడా బాధ్యులవుతున్నామని, ఏ రాష్ట్రంలో లేని  విధంగా ఏపీలో చంద్రబాబు వల్ల అప్రతిష్టపాలు అవుతున్నామని అనుకున్నారేమో  కాని, కనీసం మోదీ , జేపీ నడ్డా, అమిత్ షా ,దగ్గుబాటి పురందేశ్వరి వంటి ఏ ఒక్క నేత ఫోటో మానిఫెస్టో పై వేయలేదు. టీడీపీ,జనసేనల రెండు  పార్టీల మేనిఫెస్టోగానే ప్రకటించవలసి వచ్చింది. కాకపోతే బతిమలాడి బీజేపీ ఇన్ చార్జీ సిద్దార్ద్  నాధ్ సింగ్ ను తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనేమో మేనిఫెస్టో కాపీ పట్టుకోకుండా తిరస్కరించారు. పురందేశ్వరిని ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ నిలువరించినట్లుగా ఉంది.లేకుంటే ఇంత ముఖ్యమైన  కార్యక్రమానికి రాకుండా ఉంటారా?  దీంతో మొత్తం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భం కాస్తా తుస్సు అంది.  ఇదంతా జగన్ ఎఫెక్ట్ అన్న అభిప్రాయం కలుగుతుంది.చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ సుమారు 1.65 లక్షల కోట్ల విలువ అని ఒక అంచనా. అదే జగన్ ఇచ్చిన హామీల వ్యయం రూ. 70 వేల కోట్లు. ఇంతకాలం జగన్ బటన్ నొక్కుడుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు యు టర్న్ తీసుకుని ఇంకా తాము ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అప్పట్లో జగన్ పై అడ్డగోలుగా రాసిన రామోజీ,రాధాకృష్ణలు, ప్రస్తుతం చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై విశ్లేషించడానికే భయపడుతున్నారు. ఇంత మొత్తం డబ్బు ఎక్కడనుంచి వస్తుందని అడిగితే చంద్రబాబు కు ఇబ్బందిగా ఉంటుందని  భావించి వారు దానికి జోలికి పోవడం లేదు.  కానీ పేజీల కొద్ది ఆ వాగ్దానాలను పరిచి తాము టీడీపీ పక్కా ఏజెంట్లమని ప్రజలకు మరోసారి తెలియచేశారు.తెలంగాణ, కర్నాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలతో పాటు ఏపీలో జగన్ అమలు చేస్తున్న స్కీముల్ని కాపీ కొట్టి కొంత అదనంగా ఇస్తామని చంద్రబాబు  చెప్పారు.  కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేక సతమతం అవుతున్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు చేసినా..  దానివల్ల ఆర్టీసీకి పెద్ద నష్టమే వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎంత శ్రద్ద చూపుతుందన్నది అనుమానమే. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కూడా కష్టమే అవుతుంది.చంద్రబాబు ఇచ్చిన కొన్ని హామీలను చూద్దాం. వాటికి అయ్యే వ్యయం ఎంతో లెక్కగడదాం.ఉదాహరణకు ఏపీలో 19-59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రెండున్నర  కోట్ల మంది మహిళలు ఉన్నారనుకుంటే.. అందులో కోటి మంది 19 ఏళ్లలోపు వారు, 59 ఏళ్ల పైబడిన వారిని తీసివేస్తే దాదాపు కోటిన్నర మందికి ఈ  స్కీం అమలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.2,250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అంటే ఏడాదికి 27వేల కోట్ల రూపాయల ఖర్చు అన్నమాట.నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. వారి సంఖ్య ఎంతో చెప్పలేదు. పోని ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కనుక,ఆ సంఖ్యనే ఆధారంగా తీసుకుంటే నెలకు రూ.600 కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 7,200 కోట్లు అన్నమాట.రైతులకు రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం 13 వేల  రూపాయలు ఇస్తోంది. దానిని 16 వేలు చేశారు. కాని చంద్రబాబు ఏకంగా ఇరవైవేలు ఇస్తామని అంటున్నారు.  ఆ ప్రకారం ఏడాదికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పోనీ ఇందులో సగం కేంద్రం వాటా అనుకున్నా, ఐదువేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఖర్చు పెట్టాలి.అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున జగన్ ప్రభుత్వం ఇస్తోంది. దానిని 17వేలకు పెంచుతామని జగన్ తెలిపారు. చంద్రబాబు గతంలో తన ప్రభుత్వంలో ఈ స్కీమును  అమలు చేయకపోయినా, ఇప్పుడు ఇంటిలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి 15వేల రూపాయలు ఇస్తానంటున్నారు. ఇద్దరు పిల్లలనే లెక్కవేసుకుంటే పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది.వృద్దాప్య పెన్షన్ లను నెలకు నాలుగువేలు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు ఈ స్కీం అర్హతకు వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తామని టీడీపీ  చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 65లక్షల మంది పేదలకు వీరు తోడవుతారు. దీని ప్రకారం నెలకు రూ.2,600 కోట్లు వ్యయం అవుతుంది.అంటే సంవత్సరానికి రూ.31 వేల కోట్లు అన్నమాట.ల్యాండ్‌ టైటిలింగ్ చట్టంపై మళ్లీ అబద్దాలు ఆడారు. ఇది కేంద్ర ప్రతిపాదిత చట్టం అని పలువురు చెబుతున్నా వినకుండా చంద్రబాబు ఇదే ప్రచారం చేస్తున్నారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంత పాడుతున్నాయి. గతంలో పురందేశ్వరి  పొత్తు రాకముందు, టీడీపీ ఈ చట్టంపై చేస్తున్నది దుష్ప్రచారం అని స్పష్టంగా చెప్పారు. నిజంగానే  జగన్ ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టం తెచ్చి ఉంటే,  కేంద్రానికి లేఖ రాసి వివరణ కోరవచ్చు కదా!. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆస్తులను  లాక్కోవడానికి చట్టాలు చేస్తుందా? ఈ చట్టం ద్వారా ప్రజలకు  మరింత సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం అన్ని రాష్రాల కోసం  దీనిని ప్రతిపాదిస్తే, అంతతటిని జగన్ కు ఆపాదించి, నానా చెత్త ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే మోదీ ఉఏపీలో ఆస్తులను లాక్కోవడానికి ఈ చట్టం తెచ్చారని చంద్రబాబు అనాలి. ఒకప్పుడు తాను గొప్ప సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్న  చంద్రబాబు నిజ స్వరూపం ఇది . కేంద్రాన్ని దీనిపై అడగకపోతేమానే.. సిద్దార్ద్ సింగ్ ,పురందేశ్వరిలలో ఎవరో ఒకరితో ఈ చట్టం గురించి మాట్లాడించి ఉండవచ్చు కదా! ఆయన అదేమీ చేయలేదంటే దాని అర్దం బీజేపీ ఇలాంటి పిచ్చి ఆరోపణలను పట్టించుకోదనే కదా! ఏదో మొక్కుబడికి  సిద్దార్ద్ నాద్ సింగ్ కూటమి మేనిఫెస్టోకి మద్దతు అని చెప్పారు. అది నిజమే అయితే ఎందుకు మోదీ ఫొటో ఈసారి వేయవద్దని ఎందుకు  చెప్పారో వివరణ ఇవ్వాలి కదా!చంద్రబాబు చేసిన అన్ని హామీలను అమలు చేస్తే అసాధ్యం కనుకే, మరోసారి నవ్వుల పాలు కాకుండా ఉండడానికి మోదీ తన ఫొటో ప్రచురించడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. అందుకే జగన్ తన స్పీచ్ లలో ఢిల్లీ పెద్దలు, బీజేపీ వారు కూడా చంద్రబాబును నమ్మడం లేదని తేల్చేశారు. బీజేపీతో కలిశాం కనుక ప్రత్యేక హోదా,విభజన హామీలు, తెలంగాణ నుంచి రావల్సిన బకాయిలు, ఆస్తుల విభజన సాధిస్తామని ఒక్క మాట చెప్పకుండా ఎన్నికల ప్రణాళికను పూర్తి చేశారు. అంటే వాటి ఊసే టీడీపీ ఎత్తొద్దని బీజేపీ కండిషన్ పెట్టినట్లే కదా! ఏ రకంగా చూసినా, ఇది ప్రజల మేనిఫెస్టో కాదు. కేవలం అధికారం కోసం చంద్రబాబు ఆడే రాజకీయ నాటకపు మోసఫెస్టో తప్ప ఇంకొకటి కాదని ఘంటాపధంగా చెప్పవచ్చు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏపీ మేలు కోరుకునేవారు ఎవరూ అంగీకరించకూడదు కూడా.విద్య రంగంలో అమలు లో ఉన్న సిలబస్ ను రివ్యూ చేస్తారట. అంటే దాని అర్ధం ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్ మీడియం ను రద్దు చేస్తామని చెప్పడమా?. అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఇస్తున్న ఐబీ సిలబస్ ను ఎత్తివేస్తారా?. విద్యార్ధులకు టాబ్ లు వంటి వాటిని ఇవ్వడం ఆపివేస్తారా? మళ్లీ ప్రైవేటు స్కూళ్లకే పేదలు వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారా? .. .. ముస్లిం రిజర్వేషన్ లను కొనసాగిస్తారా?లేదా? బీజేపీ స్పష్టంగా రిజర్వేషన్ లు రద్దు చేస్తామని చెబుతుంటే.. దానిని చంద్రబాబు గట్టిగా ఖండించలేక పోతున్నారు. NDA కూటమి ఎజెండాలో ఇది ముఖ్యమైనదిగా ఉంది. దానిపై బీజేపీవాళ్లతో ఎందుకు మాట్లాడించడం లేదు.పోనీ తాను బీజేపీని ఎదిరించి రిజర్వేషన్ లను కొనసాగిస్తానని కూడా ప్రణాళికలో హామీ ఇవ్వలేదు.177 రకాల హామీలు ఇవ్వడం ద్వారా అన్ని వర్గాల వారి ఆదరణ చూరగొనాలన్నది చంద్రబాబు ఆలోచన. కాని అన్ని వర్గాల వారు టీడీపీ మేనిఫెస్టోని చూస్తే, పూర్తిగా వ్యతిరేకిస్తారు.  ఇంతకాలం ఈ పాయింట్ మీద జగన్‌ను వ్యతిరేకించేవారు.. ఇప్పుడు జగనే బెటర్ అనే పొజిషన్‌కు చంద్రబాబు తీసుకొచ్చారు.ఇలా.. కూటమి మేనిఫెస్టో వాగ్దానాలను గమనిస్తే, ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఇచ్చేశారు. వీటిని అమలు చేయడానికి రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ లు కూడా సరిపోవు. అంటే ఈ స్కీములను ఎగవేయడం తప్ప మరో దారి ఉండదు. లేదంటే ఈ స్కీము లబ్దిదారులలో జాబితాలో కోత పెట్టి వ్యయం అంచనాను బాగా తగ్గించుకోవాలి.దీనిపై లబ్దిదారులంతా మండిపడతారు. ఏ రకంగా చూసినా చంద్రబాబు మోసం చేసినట్లే అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Telangana High Court Stayed Sirpurkar Commission Report In Disha Case
‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై  పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంజ్ స్టే ఇచ్చింది.10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని గతంలో క‌మిష‌న్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని క‌మిష‌న్‌ తెలిపింది. ఈ నివేదికపై అప్పటి షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌తో పాటు తహసీల్దార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఎన్‌కౌంటర్‌ తర్వాత జరగాల్సిన ప్రొసిజర్స్‌లో లోపాలు ఉన్నాయన్న కమిషన్‌..‘దిశ’ నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని  రిపోర్టు ఇచ్చింది. ఎన్‌కౌంటర్‌ వాడిన పిస్తోళ్ల వివరాలు కూడా సరిగ్గా లేవని నివేదికలో పేర్కొన్న కమిషన్‌.. అప్పటి ఎన్‌కౌంటర్‌ను పూర్తిగా తప్పుబట్టింది. కమిషన్‌ రిపోర్ట్‌పై ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది

AP Politics: Babu Dirty Politics PCC Sharmila Audio Clip Viral
ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల

అల్లూరి,సాక్షి: వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే విపక్షాల కుట్రగా కనిపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల కూడా ఈ చీఫ్‌ ట్రిక్స్‌లో భాగం అయ్యారు. తాజాగా ఆమె ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో  ఆ కుట్ర బయటకు వచ్చింది.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బుల్లిబాబు పోటీ చేస్తున్నాడు. అయితే ఈయన అభ్యర్థిత్వం కంటే ముందు ఇక్కడ రేసులో ఉంది వంతల సుబ్బారావు. బుల్లిబాబు వైఎస్సార్‌సీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. చేరి చేరగానే బుల్లిబాబునే పాడేరు అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న సుబ్బారావు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలకే కాకుండా.. ఓటు బ్యాంకు ఏనాడో కనుమరుగైన కాంగ్రెస్‌లోనూ రెబల్స్‌ పోటు ఆసక్తికర చర్చకు దారి తీసింది. దీంతో వంతల సుబ్బారావుతో రాయబారానికి దిగారు.  మీరు సొంత అన్నమాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె. అయితే.. ఏనాడూ జెండా మోయనోడికి టికెట్‌ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పర్చిందని షర్మిలతో ఆయన అన్నారు.కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో పాటు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌ గురించి మరిచిపోవాలంటూ బెదిరింపు స్వరంతో కోరారామె. చివర్లో.. కాంగ్రెస్‌కు డ్యామేజ్‌ చేయొద్దంటూ షర్మిల కోరగా.. తన భవిష్యత్తు ఆల్రెడీ డ్యామేజ్‌ అయ్యిందని ఆయన బదులిచ్చారు.

know your sim cards status in Govt website and will update
మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..

ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు సిమ్‌కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులే ఉండాలి.ప్రభుత్వ వెబ్‌సైట్‌ సంచార్‌సాతి వెబ్‌సైట్‌ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్‌కార్డులను నేరుగా ఆన్‌లైన్‌లోనే బ్లాక్‌ చేసుకునే సౌకర్యం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.బ్రౌజర్‌లో https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.కింద సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీసెస్‌ కేటగిరీలో ‘Know Your Mobile Connections’ క్లిక్‌ చేయాలి. ఈ సర్వీస్‌ టెలికాం అనలిటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌(టీఏఎఫ్‌సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్‌ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. కింద క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. ‘వాలిడేట్‌ క్యాప్చా’ బటన్‌ ప్రెస్‌ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్‌లో ఎంటర్‌చేసి లాగిన్‌ అవ్వాలి. మన పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్‌ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్‌ వస్తుంది.ఇదీ చదవండి:  రోజులో ఒకసారైనా ఓపెన్‌ చేసే ఈ యాప్‌ గురించి తెలుసా..?ఒకవేళ ఏదేని నంబర్‌ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్‌ చేసి సబ్మిట్‌ చేయాలి. చివరగా లాగ్‌అవుట్‌ చేయాలి.

AP Elections 2024:  CM YS Jagan Speech At Bobbili Road Show
‘జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్‌షోలో సీఎం జగన్‌

విజయనగరం, సాక్షి: కుర్చీలు లాక్కోవడం, వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం, మనషుల్ని చంపేయడం.. ఇదే చంద్రబాబు రాజకీయమని, అలాంటి చంద్రబాబుకి ఓటేయమని అడిగే అర్హత ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం ఉదయం బొబ్బిలి మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగించారు.ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు. మళ్లీ మోసపోవడం ఖాయం.  ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు.. ఈ ఓటుతో మీ తలరాతలు మారుతాయి.  రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించేవి ఈ ఎన్నికలు....చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమం అందించాం. ప్రతీ పేదవాడికి అండగా ఉంటూ వైద్యం అందించాం. రైతన్నకు చేయిపట్టుకుని సాయం అందించాం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరగని సామాజిక న్యాయం కళ్లెదుటే కనిపిస్తోంది. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.  డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం.  2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం... ఎన్టీఆర్‌ కుర్చీని లాక్కుని, సొంత పార్టీ అధ్యక్షుడ్ని కుట్రలతో చంపేసిన వ్యక్తి. వంగవీటి మోహన రంగాను కుట్రలతో చంపింది ఎవరు?. ఐఎస్‌ అధికారి రాఘవేంద్రను కుట్రలతో చంపించింది ఎవరు?. ఇప్పడు మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేనని చంద్రబాబుకి అర్థం అయ్యింది. మోసపూరిత హామీలతో.. ఎన్నెన్ని మాటలు చెబుతున్నా ప్రజలెవరూ చంద్రబాబును నమ్మడం లేరు. జనం మోసపోవడానికి సిద్ధం లేరని చంద్రబాబుకి అర్థం అయ్యింది. ఈ జగన్‌ను చంపేస్తే ఏమౌతుంది అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సిగ్గుచేటు పరిణామం.చంద్రబాబు మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి. అయ్యా చంద్రబాబూ.. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్‌, ఆ మహానేతకు వచ్చిన ప్రజాదరణను ఓర్వలేక అసెంబ్లీ సాక్షిగా ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్’‌ అని అన్నమాటల్నినేను మరిచిపోలేను. నాడు నా తండ్రిని, నేడు నన్నూ.. ఈ ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనలేక నువ్వు మాట్లాడే మాటలు.. నీ నేర ప్రవృత్తికి  అద్దం పడుతున్నాయి. బాబు మెంటల్‌ హెల్త్‌ ఏ స్థాయిలో ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి.కానీ, చంద్రబాబు అనుకుంటే జగన్‌ చనిపోడు.. జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు. అవ్వాతాలు, అక్కాచెల్లెమ్మల ప్రార్థనలు, దీవెనలే నాకు శ్రీరామరక్ష... ఎన్నికలయ్యాక చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. కానీ, మీ బిడ్డ ఈ జగన్‌ 58 నెలల పాలనలో 99 శాతం హామీలు అమలు చేశాడు. అయ్యా.. నువ్వు 14 ఏళ్లు సీఎంగా చేశావ్‌. మరి నీ పేరు చెబితే ఒక్క పేదవాడికి మంచి చేసినట్లు గుర్తుకు వస్తుందా?. 2014లో మేనిఫెస్టోతో చంద్రబాబు చేసిన మోసం గుర్తుందా?. ప్రధాన హామీల పేరుతో ఏ ఒక్క వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి, అదే మోసపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.వలంటీర్ల ద్వారా మళ్లీ సంక్షేమం కొనసాగాలన్నా, వైద్యం ఆరోగ్య సేవలు.. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలన్నా.. ఫ్యాన్‌ గుర్తును రెండుసార్లు నొక్కాలి. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్‌సీపీకే రావాలి. దేశంలో ఎన్నడూ జరగని విధంగా, రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు.. మొత్తం రెండొందల స్థానాలకు ఏకంగా 100 స్థానాలు.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు పోటీకి దిగుతున్నారు. సామాజిక న్యాయం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోండి.వైఎస్సార్‌సీపీ తరఫున బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్‌. వెంకట చిన అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఆయన్ని గెలిపించి సామాజిక న్యాయాన్ని గెలిపించాలి. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌లను గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement