Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనిత ఉన్న ఇంటిపై టీడీపీ గూండాలతో కలిసి దాడి చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు , టీడీపీ గూండాల దాడిలో గాయపడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ చౌడేశ్వరి
ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు

ఓటమి తప్పదన్న నిరాశానిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయంటే... చంద్రబాబు స్థాయి మరిచి, సిగ్గెగ్గులు వదిలి ‘అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు’ అంటూ అడ్డూఅదుపూ లేకుండా పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛను రాకుండా వారిని మండటెండల్లో రోడ్లమీదికి తేవటమే కాదు..భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధులను కుట్రతో అడ్డుకోవటమే కాదు... బాబు, దత్తపుత్రుడు కలిసి కిరాయి గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు... హోంమంత్రి తానేటి వనిత కావచ్చు... ప్రచారానికి వెళుతున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా.. ఇది నారాసురుడికి క్లయిమాక్సే.సాక్షి, అమరావతి/వెల్దుర్తి/ముప్పాళ్ల/సాక్షి, నరసరావుపేట: రూ.కోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. కళ్ల ముందు మరోసారి ఘోర పరాజయం స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్‌ (నిరాశ, నిస్పృహ) తార స్థాయికి చేరుకుంది. చివరకు అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మహిళలపై సైతం దాడులు చేసే స్థాయికి దిగజారిపోవడం వారిద్దరినీ ఆవరించిన నైరాశ్యాన్ని రుజువు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! అంటూ ఈ నెల 6న అనకాపల్లి సభలో చంద్రబాబు బూతు పురాణం లంకించుకోవడంతో మహిళలంతా నివ్వెరపోయారు. అంతకుముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో.. జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్‌ తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులను ప్రజలకు వివరిస్తూ, వారినుంచే జవాబులు రాబడుతూ ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ దాడులు, దుర్భాషలనే నమ్ముకోవడం వారి వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సైతం బాబు శైలిని అనుకరిస్తూ వ్యక్తిత్వహననం, దుర్భాషలకు దిగడం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు పేట్రేగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగుతూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయి. నల్లజర్లలో ‘ముళ్లపూడి’, మాచర్లలో ‘జూలకంటి’ గూండాయిజం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మంగళవారం రాత్రి ప్రచారం ముగించుకుని పార్టీ నేత వెల్లంకి సుబ్రమణ్యం ఇంట్లో భోజనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరి­పాడులో బుధవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు సైతం గాయ­పడ్డారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి టీడీపీ గూండాలను దాడులకు పురిగొల్పారు. పచ్చి అవకాశవాదం.. ఎన్నికల్లో సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోనే సత్తాలేక జనసేనతో జట్టు కట్టి బీజేపీతో కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబు దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా దగా చేయడం, ఇప్పుడు మళ్లీ జత కట్టటాన్ని ప్రజలు పచ్చి అవకాశవాదంగా గుర్తించారు. మళ్లీ కూటమి ముసుగులో చంద్రబాబు మోసం చేస్తారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కరువైంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాను రప్పించినా ప్రయోజనం కానరాకపోవడంతో ఓటర్లపై ధనా్రస్తాన్ని ఎక్కుపెట్టారు. నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలు విదేశాల్లోని తన సామాజిక వర్గానికి చెందిన ఆరు వేల మంది ఎన్నారైలను రప్పించిన చంద్రబాబు వారిని గ్రామాల్లో మోహరించి నోట్ల కట్టలు వెదజల్లుతున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, నరసరావుపేట లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ తదితరుల ద్వారా నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలను సమాయత్తం చేశారు. ఎన్నికల అధికారులకు భారీ ఎత్తున పట్టుబడుతున్న కోట్ల కట్టలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. కర్ణాటక, గోవా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలించి ఏరులై పారిస్తున్నారు. ఎన్నికల అధికారులు సీజ్‌ చేస్తున్న మద్యం డంపులే అందుకు నిదర్శనం. కోట్ల కట్టలను వెదజల్లుతున్నా.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, ఘోర పరాజయం కళ్ల ముందు కానరావడంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఫ్రస్టేషన్‌ తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి, వేటాడి రక్తపుటేరులు పారించి భయోత్పాతం సృష్టించడం ద్వారా ఉనికి చాటుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన గూండాలను దాడులు, హత్యాకాండకు పురిగొలిపారు. ‘ఫ్యాన్‌’కి ఓటేశాడని..!పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు హోం ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా పరిమి పెద్దభూషయ్య అనే వృద్ధుడు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసేందుకు సుముఖత చూపటాన్ని జీర్ణించుకోలేక బెదిరిస్తూ వాదనకు దిగాయి. తనకు కులాలతో పనిలేదని, మంచి చేసిన పార్టీకే ఓటు వేస్తానని పెద్దభూషయ్య తేల్చి చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడు రావిపాటి నాగేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన షేక్‌ దమ్మాలపాటి బాజికి కూడా ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్‌మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు పలువురు మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడిన ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మాచర్ల టౌన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పి.శరత్‌బాబు, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరి, కారంపూడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్న మల్లయ్యను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దౌర్జన్యాలు.. హత్యాయత్నాలు⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్‌ వద్ద మంగళవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భార్య కాటసాని జయమ్మపై దాడికి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి గూండాలను పురిగొల్పారు. ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఆమె తనయుడు ఓబుళరెడ్డిపై కూడా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోనేటి దుర్గ, సయ్యద్‌ అబ్బాస్, ఇంతియాజ్, ఖాజా హుస్సేన్, జమీర్, గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. ⇒ అనంతపురం నియోజకవర్గంలో గత నెల 30న ఎన్నికల ప్రచారం నిమితం బైక్‌పై వెళ్తున్నవైఎస్సార్‌సీపీ నాయకుడు గుజ్జుల నగే­ష్‌పై టీడీపీ గూండాలు కళ్లల్లో కారం చల్లి కర్రలు, ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామంలో గత నెల 27న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వాహనాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత కురుబ ముత్యాలు వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మిట్టమీదిపల్లి, మాల్యవంతునిపాడు గ్రామాల మధ్య వైఎస్సార్‌సీపీకి చెందిన మూడు ప్రచార రథాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. డ్రైవర్లు వీరాంజనేయులు, ఆంథోని, రాజును రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ⇒ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే రీతిలో టీడీపీ, జనసేన రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సతీమణిపై దాడిఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారాయంటే ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో మహిళలు, పిల్లలపై దాడులు చేసిన సంస్కృతి లేదు. అలాంటిది మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు బరి తెగించాయి. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితోపాటు పలువురు మహిళలపై బుధవారం రాళ్లు, సీసాలతో దాడులకు దిగి హత్నాయత్నానికి పాల్పడ్డాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమాదేవిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి కుమారుడు శివారెడ్డి, కల్లం రామాంజిరెడ్డి తమ అనుచరులతో కలసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. పీఆర్కే సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, కౌన్సిలర్‌ గట్ల అరుణ కుమారి, కో ఆప్షన్‌ సభ్యురాలు అన్నెం అనంతరావమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీపీ చౌడేశ్వరికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునే యత్నం చేసిన ఎస్‌ఐ శ్రీహరిపై సైతం పచ్చమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు దిగటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక టీడీపీ హింసకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డిని చంద్రబాబు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడంతో ఫ్యాక్షన్‌ రాజకీయాలు తిరిగి మొదలయ్యాయని పేర్కొంటున్నారు. ఓటమి భయంతోనే మహిళలపై టీడీపీ దాడులుఎన్నికల్లో ఓటమి భయం­తోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ మహిళా విభా­గం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ.. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడి చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బొండా ఉమా మహిళలపై దాడులకు పురిగొల్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేసి.. దళితులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సీఎం జగన్‌పై కక్ష కట్టాయన్నారు. విద్యార్థులకు విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

బుధవారం వేములవాడ సభలో ప్రధాని మోదీ అభివాదం. చిత్రంలో బండి సంజయ్‌
‘ఆర్‌ఆర్‌’ ట్యాక్స్‌ వెయ్యికోట్లు!: ప్రధాని మోదీ

సాక్షి, వరంగల్‌/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ వేములవాడ: ‘‘కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అభివృద్ధి పూర్తిగా ఆగి, ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారింది, కాంగ్రెస్‌ వాళ్లు.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అందులో సగం హైదరాబాద్‌లోని ‘ఆర్‌’కు వెళ్తే.. రెండో సగం మరో ‘ఆర్‌’ కోసం ఢిల్లీకి వెళ్తుంది. ఈ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌.. ట్రిపుల్‌ ఆర్‌ సినిమా రూ.వెయ్యికోట్ల వసూళ్లను అనతికాలంలోనే దాటడం ఇక్కడి అవినీతికి నిదర్శనం..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంత అబద్ధాల కోరు అన్నది తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. రైతుల రుణమాఫీపై కాంగ్రెస్‌ చేతులెత్తేయబోతోందని.. లోక్‌సభ ఎన్నికల వరకు ఆగి మోసగిస్తుందని వ్యాఖ్యానించారు. బుధవారం వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అమరుల కుటుంబాలకు పెన్షన్‌ ఇస్తామని, 250 గజాల భూమి ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, మోసం చేసింది. తెలంగాణలో విద్యుత్‌ కోతలు పెరిగాయి. ప్రజలకు గంట గడవడం కష్టమవుతోంది. అలాంటి నమ్మక ద్రోహి కాంగ్రెస్‌ ప్రజలకు ఎలా మేలు చేస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజలు కాంగ్రెస్‌ను అధికారమిస్తే.. కుటుంబానికే పెద్దపీట వేసి, జాతి ప్రయోజనాలకు గంగలో ముంచింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించింది. అదే పీవీని బీజేపీ సర్కారు భారతరత్నతో గౌరవించింది. బీసీలకు కోత వేసి ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్‌ దృష్టిలో రాజ్యాంగానికి విలువ లేదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేడ్కర్‌ స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్‌ కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లు కత్తిరించి ముస్లింలకు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో అదే ప్రయత్నం జరిగినా హైకోర్టు నిలిపివేసింది. దీన్ని కాంగ్రెస్‌ సహించలేకపోతోంది. అందుకే చట్టం చేసి అయినా.. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇవ్వాలనుకుంటోంది. బీఆర్‌ఎస్‌ కూడా బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. కేవలం ముస్లింల కోసం ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. 2014లో అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎం చేస్తామని మోసం చేసింది. దళిత బంధు పేరిట మోసం చేసింది. కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడింది. ఎస్సీ వర్గీకరణ చేస్తాం.. మాదిగ సోదరులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ వెనుకడుగు వేస్తోంది. ఎస్సీ వర్గీకరణ కోసం నా చిన్న తమ్ముడు మంద కృష్ణ చాలాకాలం నుంచి పోరాడుతున్నారు. ఇప్పటివరకు న్యాయం జరగలేదు. నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను. అమలు చేసి చూపిస్తా. కాంగ్రెస్‌ సీట్లను భూతద్దంలో చూసుకోవాల్సిందే.. ప్రపంచమంతా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ కార్యభారాన్ని, శక్తిని తప్పుడు చేతుల్లో పెట్టొద్దు. పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏరకమైన పాపాలు చేసిందో అందరికీ తెలుసు. నాలుగు రోజులకో కుంభకోణం, అవినీతి బయటపడుతుండేవి. దేశంలోని పెద్ద పట్టణాల్లో బాంబు పేలుళ్లు సంభవించేవి. ఇప్పుడు ఎన్టీయే విజయరథం వేగంగా ప్రయాణం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో ముందు నిలిచింది. కాంగ్రెస్‌ ఎక్కడెక్కడ సీట్లు గెలుస్తుందా అని భూతద్దం పెట్టి చూసే పరిస్థితి ఏర్పడింది. నాలుగో దశ పూర్తయ్యే సరికి భూతద్దంతోనూ దొరకవు. మైక్రోస్కోప్‌ కావాల్సి వస్తుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తోడు దొంగలే! బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ తోడుదొంగలే. పైకి తిట్టుకున్నా అవినీతి అనే వారధి వారిని తెరవెనుక కలుపుతోంది. అందుకే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ నేతను, కాళేశ్వరం అవినీతిలో బీఆర్‌ఎస్‌ నేతలను రెండు పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ఎంఐఎం విషయంలో బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్య అవగాహన ఉంది. కానీ బీజేపీ రంగంలోకి దిగేసరికి వారిలో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌లకు కుటుంబ రాజకీయాలే తొలి ప్రాధాన్యం. బీజేపీకి దేశమే తొలిప్రాధాన్యం. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల అడ్రస్‌ గల్లంతే. తెలంగాణ ప్రజలంతా ఏకమై మే 13న ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి..’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఓరుగల్లు సభలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. చర్మం రంగును బట్టి యోగ్యత ఉంటుందా..? మేం 2014లో తొలిసారి అధికారంలోకి రాగానే దళితుడైన రాంనాథ్‌ గోవింద్‌ను రాష్ట్రపతిని చేశాం. 2019లో ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. కాంగ్రెస్‌ ఈ ఇద్దరిని వ్యతిరేకించింది. ముఖ్యంగా ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్‌ ఎందుకు అంతగా వ్యతిరేకించిందా? అని ఎంతగా ఆలోచించినా ఇన్నాళ్లూ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ద్రౌపదీ ముర్ము గారి చర్మం రంగు నలుపు. ఇక్కడున్న రాజ కుమారుడి (రాహుల్‌ గాం«దీ)కి అమెరికాలో ఓ ఫ్రెండ్‌ ఫిలాసఫర్, మార్గదర్శి (శ్యామ్‌ పిట్రోడా) ఉన్నారు. చర్మం రంగు నల్లగా ఉన్నవాళ్లందరూ ఆఫ్రికన్లలా ఉంటారని ఆయన ఈ మధ్య అన్నారు. చర్మం రంగును బట్టి ద్రౌపదీ ముర్ము గారిని కూడా ఆఫ్రికన్‌ అని ఆయన భావించారు. అందుకే ఓడించాలని చెప్పి రాజకుమారుడికి బోధించారు. నలుపు చర్మం ఈ దేశంలో చాలా మందికి ఉంటుంది. శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపే. మరి అలాంటిది చర్మం రంగును బట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? ఇందుకే ఆ రాజ కుమారుడి మీద నాకు కోపం వస్తోంది. నన్ను తిడితే నాకు కోపం రాదు. కానీ నా దేశ ప్రజలను చర్మం రంగు పేరిట రాజ కుమారుడి మార్గదర్శకుడు లండన్‌లో కూర్చొని , అమెరికాలో కూర్చొని తిట్టడం నాకు కోపం తెప్పిస్తోంది. రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ వేములవాడకు చేరుకున్నారు. నేరుగా శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ.. బాలానగర్‌లోని సభాస్థలికి చేరుకున్నారు. సభ ముగిశాక హెలికాప్టర్‌లో వరంగల్‌ పయనమయ్యారు. ‘ఒక్కొక్కరి పొలంలో పది మీటర్లు..’ కాంగ్రెస్‌పై మోదీ సెటైర్‌ లెక్క! ‘‘ఈసారి ఇండియా కూటమి ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానులను తీసుకొస్తామని చెప్తోంది. ఇదీ అందరికీ స్పష్టంగా అర్థం కావాలంటే మరో పద్ధతిలో చెబుతా. పది మంది రైతులు తమ పొలాల్లో బోరు వేయించాలనుకున్నారు. ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తం పరిశీలించి, 100 మీటర్లు తవ్వితే నీళ్లు పడతాయని చెప్పారు. అప్పుడు ఈ రైతులు.. ఒకరి పొలంలో పది మీటర్లు, పక్క పొలంలో పది మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో పది మీటర్లు.. ఇలా పది మంది పొలాల్లో తవ్వితే 100 మీటర్లు అయిపోతుందనుకున్నారు. అలా చేస్తే నీళ్లు వస్తాయా? ఇండియా కూటమి అంతే. పార్టీకో ప్రధాని ఉంటే దేశం భవిష్యత్‌ ఏమవుతుంది?’’ రుణమాఫీపై చేతులెత్తేస్తారు! ‘‘కాంగ్రెస్‌ అతిపెద్ద నాయకురాలు (సోనియా) పుట్టినరోజు డిసెంబర్‌ 9న రైతుల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు వాయిదా వేసి ఆ వాగ్దానాన్ని వెనక్కి తోశారు. లోక్‌సభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తర్వాత చేతులెత్తేయబోతున్నారు. ఇది మిమ్మల్ని మోసం చేయడమే.. మీ మనోభావాలను దెబ్బతీయడమే.. వాళ్లు ఒకవైపు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిడుతూ, ఒట్లు పెట్టేవారిని ఎవరు నమ్ముతారు..’’ – మోదీ

Kadapa Court Shock For Sharmila And Sunita
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పీసీసీ చీఫ్‌ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.

YS Avinash Reddy Strong Political Counter To Sunitha And Sharmila
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్‌ అవినాష్‌

సాక్షి, వైఎస్సార్‌: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు.రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్‌మెన్‌ రంగన్నకు నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.దివంగత వైఎస్సార్‌ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్‌ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్‌ పెట్టిన టాస్క్‌. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్‌ చేశారు.

Sam Pitroda Resigns From Congress Party
కాంగ్రెస్‌కు శామ్‌ పిట్రోడా రాజీనామా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి శామ్‌ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్‌కు చేరింది.

Ksr Comments On Chandrababu Political Stratagies On Farmers
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుల మనోబావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరికైనా భూమితో ఉండే సంబంధం చెప్పనవసరం లేదు. అందులోను రైతులకు మరింతగా ఉంటుంది. వారు భూమిని దైవంగా పరిగణిస్తారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఆ భూముల డాక్యుమంట్లను చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. వాటిని తమ కుటుంబ భవిష్యత్తుకు చిహ్నాలుగా చూసుకుంటారు. అలాంటి డాక్యుమెంట్లను చంద్రబాబు నాయుడు దగ్దం చేసే సాహసం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. వైఎస్ జగన్‌ ప్రభుత్వంపై ఆయనకు ఎంత ద్వేషమైనా ఉండవచ్చు. ఎంత అక్కసు అయినా ఉండవచ్చు.కాని జగన్‌ను దూషించడానికి రైతుల డాక్యుమెంట్లను తగులబెట్టి దారుణమైన చర్యకు ఉపక్రమించారు. పైగా అదేదో గొప్ప పని మాదిరి ఏమి తమ్ముళ్లూ తగులబెట్టానా? అంటూ ఒకటికి రెండుసార్లు సభలో వికటాట్టహాసం చేయడం. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ఎవరు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇస్తున్నారో కాని, ఆయన చేష్టలన్నీ రోత పుట్టిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. బూతులు తిట్టడం, డాక్యుమెంట్లు కాల్చడం ఏమిటి? 2014-2019 టరమ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను పీడించి 33 వేల ఎకరాలను సమీకరించారు. కొందరు ఇష్టంతోనే ఇచ్చినా, చాలామంది అందుకు సిద్దపడలేదు. వారిపై రకరకాల కేసులు పెట్టి, చివరికి వారి పంటలను కూడా దహనం చేయించారన్న విమర్శలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం గురి అయింది. దాని ప్రభావంతో ఏపీలో ఆయన ఏకంగా అధికారాన్ని కోల్పోయి, కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారు. వైఎస్సార్‌సీపీకు 151సీట్లతో స్వీప్ వచ్చింది.అమరావతి రాజధాని గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరిలలో కూడా టీడీపీ ఓటమిపాలైంది. మంగళగిరిలో స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీచేసినా ఫలితం దక్కలేదు. దానిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జగన్‌ ప్రభుత్వాన్ని సజావుగా నడవకుండా అడ్డుపడుతూ వచ్చారు. అలాగే మళ్లీ 2024 ఎన్నికల సమయంలో కూడా అనేక గొడవలు సృష్టించడానికి, అబద్దపు ప్రచారాలు చేయడానికి చంద్రబాబు బృందం పూనుకుంది. నిప్పుకు గాలి తోడైనట్లు పవన్‌ కల్యాణ్‌, రామోజీరావు, రాధాకృష్ణ వంటి మరికొందరు ఆ బాచ్‌లో చేరి అడ్డగోలు ప్రచారాలకు దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి తానేమి చేస్తున్నాననో అర్ధం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ అమ్మమొగుడు, అమ్మమ్మ మొగుడు, నానామ్మ మొగుడు.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా? మైండ్ ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి బూతులు మాట్లాడతారా? రెండు రోజుల క్రితమే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ బూతులు తిట్టే రాజకీయ నేతలను ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబును ఓడించాలని వెంకయ్య నాయుడు పిలుపు ఇస్తే బాగుంటుంది. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు పట్ల చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై రెండు రోజుల నిషేధం పెట్టిన ఎన్నికల సంఘం చంద్రబాబుపై మాత్రం ఆ స్థాయిలో చర్య తీసుకోవడం లేదు. జగన్‌ను చంపితే ఏమి అవుతుందని చంద్రబాబు ప్రశ్నించినా, ఎన్నికల సంఘం మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ పైన, సీనియర్ అధికారులపై ఫిర్యాదు చేస్తే చాలు.. ఆఘమేగాల మీద చర్యలు చేపట్టి వారిని బదిలీ చేస్తోంది. తద్వారా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న లక్ష్యాన్ని ఎన్నికల సంఘం కూడా నెరవేర్చుతున్నట్లు అనిపిస్తుంది.కేంద్ర హోం మంత్రి అమిత్-షా వచ్చిన రోజున డీజీపీని బదిలీ చేసి, ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన రోజున మరికొందరు సీనియర్ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసి కూటమి నేతలను సంతోషపెట్టినట్లు అనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఏపీలో ఎప్పటి నుంచో అమలు అవుతున్న ఆయా స్కీములకు గాను ప్రజలకు వెళ్లవలసిన డబ్బు వెళ్లకుండా అడ్డుపడుతోంది. కూటమి నేతలు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌ వంటివారు చేసే ఫిర్యాదుల ఆధారంగా ఈసి పనిచేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికలనైనా సజావుగా జరగనిస్తారా? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే, రైతు భూమి డాక్యుమెంట్ను చంద్రబాబు దగ్దం చేయడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే అందులోను చంద్రబాబు డబుల్ గేమ్ బయటపడుతుంది. రామోజీ జర్నలిజాన్ని ఎంతగా దిగజార్చింది అర్దం అవుతుంది.2019 జూలైలో శాసనసభలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది చాలా గొప్ప చట్టమని, కేంద్రం దీనిపై ఎప్పటినుంచో కసరత్తు చేస్తోందని, పలు దేశాలలో ఇప్పటికే ఈ తరహా చట్టాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఎక్కడా వద్దనలేదు. కాని శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దానిని కాంట్రవర్శీ చేసి రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. తదితర ఎల్లో మీడియా అడ్డగోలు కధనాలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని తలపెట్టాయి. మొదట వైఎస్సార్‌సీపీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్‌ కల్యాణ్‌లు కుయుక్తులు పన్నారన్న విషయం అర్దం చేసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మేల్కొని అసలు విషయాలు చెప్పడం ఆరంభించారు. ఆ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వీడియోని, రామోజీకి చెందిన టీవీలలో ఈ బిల్లు గొప్పదని చెప్పిన సంగతులను బయటపెట్టారు. దాంతో వారికి నోట మాటరాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి ప్లేట్ పిరాయించాయి. ఇంత తొందరేముంది అంటూ మరో చెత్త కధనాన్ని వండి యత్నం చేశాయి. చంద్రబాబు అయితే నిర్లజ్జగా ఆ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మరింత వికృతంగా వ్యవహరించారు. అందులో భాగంగానే రైతుల సెంటిమెంట్‌ దెబ్బతినే విదంగా వారి భూ డాక్యుమెంట్ను దగ్దం చేశారు. ఆ పనేదో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్-షాల సభలలో వారి సమక్షంలోనే తగులబెడితే వారు ఏమి చెప్పేవారో తెలిసేది కదా? కాని ఆ పని చేయరు.కేవలం ప్రజలను మోసం చేయడానికి, తాను ఆత్మరక్షణలో పడిన విషయాన్ని కప్పిపుచ్చడానికి డాక్యుమెంట్లను దగ్దం చేసి రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని చెప్పాలి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డబుల్ గేమ్ ఆడారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. తీరా కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు రెడీకాగానే సోనియాగాంధీని దెయ్యం, బూతం అంటూ బండబూతులు తిట్టారు. ఆంధ్రుల పొట్టకొట్టిందని అన్నారే తప్ప తాను సమైక్యవాదినని, తాను ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని మాత్రం చెప్పలేదు. తెలంగాణలో జరిగిన సభలలో తనవల్లే రాష్ట్రం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇలా ఎన్నిసార్లు డబుల్ గేమ్ ఆడారో లెక్కలేదు. రెండు నాలుకల దోరణిలో బహుశా దేశంలోనే చంద్రబాబుకు అగ్రస్థానం ఉండవచ్చు. వలంటీర్ల వ్యవస్థను రకరకాలుగా దూషించారు. ఆ తర్వాత తాను అదే వ్యవస్థను కొనసాగిస్తానని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తానని అంటారు.జగన్‌ సంక్షేమ స్కీములు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అన్న చంద్రబాబు అంతకు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇస్తుంటారు. ఈ డబుల్ టాక్‌తో రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారు. అలాగే ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన డబుల్ టాక్ చేసి అప్రతిష్టపాలయ్యారు. అమలులోకి రాని చట్టంతో ఏదో ప్రమాదం జరిగినట్లు పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పిచ్చి ప్రసంగాలు చేయడం నిత్యకృత్యం అయింది. అందులో బాగంగా చంద్రబాబు రైతుల బూమి డాక్యుమెంట్ ను దగ్దం చేసి రైతుల సెంటిమెంట్‌ను దెబ్బతీశారు. గతంలో అమరావతిలో పంటపొలాలు దహనం చేయించిన తర్వాత ఘోర పరాజయం చెందారు. అలాగే ఈసారి రైతుల భూమి డాక్యుమెంట్ను బుగ్గిపాలు చేయడం ద్వారా కూటమి అదికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అలాగే తగులబెడతామని ప్రజలకు వారికి తెలియకుండానే సంకేతం పంపించారు. కనుక భూ డాక్యుమెంట్ తగులబెట్టిన చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదన్న భావన వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Actor Janagaraj Latest Look is Unrecognisable
స్టార్‌ హీరోలతో యాక్టింగ్‌.. ఆ కమెడియన్‌ ఇలా అయిపోయాడేంటి!

కాలం వేగంగా పరిగెడుతోంది. ఒకప్పుడు వెండితెరపై వెలుగులు పంచిన ఎందరో తారలు తర్వాతి కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కమెడియన్‌ జనగరాజ్‌ కూడా ఇదే కోవలోకి వస్తాడు. అప్పట్లో తమిళ చిత్రపరిశ్రమలో సెంథిల్‌, గౌడమణి తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పంచింది ఈయనే!కామెడీ రోల్స్‌తో..మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అందులో క్లిక్కవడంతో జనగరాజ్‌కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. విలనిజం పండే పాత్రలు చేశాడు. కామెడీ రోల్స్‌తోనూ అదరగొట్టాడు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి స్టార్స్‌తో కామెడీ సీన్లలో పోటీపడి నటించేవాడు. అప్పట్లో ఏడాదికి 15-20 సినిమాలు చేశాడు. జెట్‌ స్పీడులో మూవీస్‌ చేసిన ఆయన 2000వ సంవత్సరంలో అడుగుపెట్టేసరికి కాస్త స్లో అయ్యాడు.ఇండస్ట్రీకి దూరంతెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. దాడి చిత్రంలోనూ యాక్ట్‌ చేశాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయి తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. దీంతో అతడు అమెరికా వెళ్లి సెటిలైపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత విజయ్‌ సేతుపతి 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తాత అనే షార్ట్‌ ఫిలింలో నటించాడు.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడుఈ షార్ట్‌ ఫిలింలో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అలాగే అతడి లేటెస్ట్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నటుడు బక్కచిక్కిపోయి ఉన్నాడు. వయసు 68 ఏళ్లు కావడంతో వృద్ధాప్య చాయలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నటుడి ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడేంటి? ఇలా అయిపోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: భర్తతో విడిపోయిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఒంటరినే అంటూ పోస్ట్‌

Bjp Paying Money To Buy Votes: Mamata Banerjee
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్‌

కోల్‌కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్‌లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్‌ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Lok Sabha Election 2024: Unanimous in the history of Lok Sabha elections
Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు

గుజరాత్‌లో అన్ని లోక్‌సభ స్థానాలకూ మే 7న మూడో విడతలో భాగంగా పోలింగ్‌ జరిగింది. అయితే అంతకుముందే ఒక సీటు అధికార బీజేపీ ఖాతాలో పడింది! సూరత్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ ‘తిరస్కరణ’కు గురవడం, ఆ వెంటనే పోటీలో ఉన్న మిగతా 8 మంది అభ్యర్థులూ నామినేషన్లు ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. దాంతో పోలింగ్‌తో పని లేకుండా బీజేపీ అభ్యర్థి ముఖేశ్‌ దలాల్‌ ఏకగ్రీవ ఎంపీగా ఎన్నికైపోయారు! అనంతరం కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ మీడియాకు ముఖం చాటేయడంతో ఇదంతా బీజేపీ స్క్రిప్టేనంటూ ఆరోపణలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలను ఓసారి చూస్తే... లోక్‌సభ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడం అసాధారణమైన విషయం. తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఇప్పటిదాకా ఇలా పోటీ లేకుండా గెలిచిన 29వ ఎంపీ దలాల్‌. బీజేపీ నుంచైతే ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి ఎంపీ ఆయనే. 1952, 1957, 1967 ఎన్నికల్లో ఐదేసి మంది చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1952లో ఏకగ్రీవమైన ఐదుగురు ఎంపీల్లో ఒక్క జమ్మూ కశీ్మర్‌ నుంచే నలుగురుండటం విశేషం! ఆంధ్రప్రదేశ్, అసోం, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ సహా ఎనిమిది రాష్ట్రాలు ఒకరికంటే ఎక్కువ మంది ఎంపీలను పోటీ లేకుండా లోక్‌సభకు పంపాయి. పారీ్టలపరంగా చూస్తే ఏకంగా 20 మంది ఏకగ్రీవ ఎంపీలతో ఈ జాబితాలో కాంగ్రెస్‌ అగ్ర స్థానంలో ఉంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల నుంచి ఇద్దరేసి ఏకగ్రీవమయ్యారు. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్క స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గారు. సిక్కిం, శ్రీనగర్‌ లోక్‌సభ స్థానాలకు ఒకటి కంటే ఎక్కువసార్లు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవ ప్రముఖులు.. ఏకగ్రీవంగా గెలుపొందిన ఎంపీల్లో పలువురు ప్రముఖులున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైబీ చవాన్, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, నాగాలాండ్‌ మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ ఎస్సీ జమీర్, ఒడిశా తొలి సీఎం హరేకృష్ణ మహతాబ్, రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు, కాంగ్రెస్‌ నాయకుడు టీటీ కృష్ణమాచారి, కేంద్ర మాజీ మంత్రులు పీఎం సయీద్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విజయవాడ నుంచి కేఎల్‌ రావు పోటీ లేకుండా గెలిచారు. రాజ కుటుంబీకుల నుంచి మొదలు... లోక్‌సభకు ఏకగ్రీవాలు రాజ కుటుంబీకుల నుంచి మొదలయ్యాయి. 1952 తొలి ఎన్నికల్లో లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి నాయకునిగా ఆనంద్‌ చంద్‌ రికార్డులకెక్కారు. అంతేగాక ఏకగ్రీవమైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి కూడా ఆయనే! బిలాస్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. నిధుల కొరతను కారణంగా చూపుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. ఆయనకు చంద్‌ లంచం ఇచి్చనట్టు కాంగ్రెస్‌ ఆరోపించింది. చంద్‌ ఎన్నికను కోర్టులో సవాలు కూడా చేసింది. అయితే తీర్పు చాంద్‌కే అనుకూలంగా వచ్చింది. ఇక ఒడిశా తొలి సీఎం హరేకృష్ణ మహతాబ్‌ 1962లో అంగుల్‌ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై బరిలో ఉన్న గణతంత్ర పరిషత్‌ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అదే ఏడాది తెహ్రీ గడ్వాల్‌ నుంచి మానవేంద్ర షా కాంగ్రెస్‌ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1967లో లద్దాఖ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, బౌద్ధ ఆధ్యాతి్మక నాయకుడు చోగ్నోర్‌ పోటీ లేకుండా గెలుపొందారు. 1971లోనూ ఆయన విజయం సాధించారు. 1977లో సిక్కిం స్థానంలో ఏకంగా ఏడుగురు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చెల్లకపోవడంతో ఛత్ర బహదూర్‌ ఛెత్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్‌ వెస్ట్‌ స్థానంలో రించిన్‌ ఖండూ ఖ్రీమే ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయనా పోటీ లేకుండా నెగ్గారు. 1989లో కశీ్మర్లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో కేవలం 5 శాతం ఓటింగ్‌ నమోదైంది. కాశీ్మర్‌ లోయలో తిరుగుబాట్లు, ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన మహమ్మద్‌ షఫీ భట్‌ శ్రీనగర్‌ నుంచి పోటీ లేకుండా గెలిచారు! కన్నౌజ్‌ నుంచి డింపుల్‌ దలాల్‌కు ముందు చివరిసారిగా ఏకగ్రీవంగా గెలిచిన ఎంపీ సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్‌ యాదవ్‌. కన్నౌజ్‌ ఎంపీగా ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. దాంతో ఖాళీ అయిన కన్నౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య డింపుల్‌ బరిలో దిగారు. కాంగ్రెస్, బీఎస్పీ, రా్రïÙ్టయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ)తో సహా ప్రధాన పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి. కొందరు స్వతంత్రులతో పాటు బీజేపీ, పలు చిన్న పారీ్టలు బరిలో దిగాయి. కానీ అంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో డింపుల్‌ ఏకగ్రీవంగా నెగ్గారు. తమ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా ఎస్పీ అడ్డుకుందని బీజేపీ, పీస్‌ పార్టీ వంటివి ఆరోపించడం విశేషం! చివరి నిమిషం ఉపసంహరణలు... 1985 సిక్కిం లోక్‌సభ స్థానం సిట్టింగ్‌ ఎంపీ నార్‌ బహదూర్‌ భండారీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో లోక్‌సభకు రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఆయన భార్య దిల్‌ కుమారి భండారీ సిక్కిం సంగ్రామ్‌ పరిషత్‌ నుంచి ఏకగ్రీవంగా నెగ్గారు. కాంగ్రెస్‌తో సహా ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అధికార పార్టీ వారిపై బెదిరింపులకు పాల్పడిందంటూ ఆరోపణలొచ్చాయి!– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all